iDreamPost
android-app
ios-app

Varsha Bollamma: అమ్మ ఏడుస్తూ ఉంటుంది.. ఓదారుస్తూ ఉంటా: వర్షా బొల్లమ్మా

  • Published Jan 21, 2024 | 6:45 PM Updated Updated Jan 21, 2024 | 6:45 PM

వర్ష బొల్లమ్మ నటించిన తాజా చిత్రం ‘ ఊరి పేరు బైరవ కోన ’ ఫిబ్రవరి 9వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఆమె ఈ మూవీ ప్రమోషన్‌లలో బిజీగా గడుపుతున్నారు.

వర్ష బొల్లమ్మ నటించిన తాజా చిత్రం ‘ ఊరి పేరు బైరవ కోన ’ ఫిబ్రవరి 9వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఆమె ఈ మూవీ ప్రమోషన్‌లలో బిజీగా గడుపుతున్నారు.

  • Published Jan 21, 2024 | 6:45 PMUpdated Jan 21, 2024 | 6:45 PM
Varsha Bollamma: అమ్మ ఏడుస్తూ ఉంటుంది.. ఓదారుస్తూ ఉంటా: వర్షా బొల్లమ్మా

‘చూసీ చూడంగానే’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు హీరోయిన్‌ వర్ష బొల్లమ్మ. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. 2020లో వచ్చిన ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఆమె తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మూవీస్‌ చేస్తున్నారు. 2022లో స్టాండప్‌ రాహుల్‌, స్వాతిముత్యం సినిమాలతో ప్రేక్షకుల ముందకు వచ్చారు.

2023లో ఆమె నటించిన ఏ సినిమా విడుదల కాలేదు. ఈ ఏడాది ఆమె నటించిన ‘ ఊరి పేరు బైరవ కోన’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 2024, ఫిబ్రవరి 9వ తేదీన విడుదల అవ్వనుంది. మూవీ విడుదలకు కేవలం నెల రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో చిత్ర టీం ప్రమోషన్లలో బిజీ అయిపోయింది. తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక, మూవీ టీం ప్రమోషన్ల భాగంగా ఇంటర్వ్యూలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఈ నేపథ్యంలో వర్ష బొల్లమ్మ ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి మాట్లాడారు. తన పెళ్లి విషయంలో తల్లి ఏడ్వటం.. ఆమె సర్థి చెప్పటం మామూలు అయిపోయిందని అన్నారు. ఆ ఇంటర్వ్యూలో వర్ష మాట్లాడుతూ.. సినిమాల విషయంలో తల్లి దండ్రులు తనను బాగా సపోర్ట్‌ చేస్తున్నారని అన్నారు. తాను ఏం చేసినా సూపర్‌ అంటూ పొగుడుతారన్నారు. అమ్మ తనతో షూటింగ్‌కు వస్తారని చెప్పారు. పెళ్లి సీన్‌లు చేసినపుడు తల్లి ఎమోషనల్‌ అయి ఏడుస్తుందని అన్నారు.

‘ అది కేవలం షూటింగ్‌ మాత్రమే.. నేనేమీ నిజంగా పెళ్లి చేసుకోవట్లేదు’ అని చెప్పి ఓదారుస్తుంటానని అన్నారు. ఎంత చెప్పినా తల్లి ఎమోషనల్‌ అవుతూనే ఉంటారని చెప్పారు. తాను పెళ్లి చేసుకోవడానికి ఇంకా మూడు నాలుగేళ్లు పడుతుందని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే.. వర్ష ఇంకో మూడేళ్ల తర్వాతే పెళ్లి చేసుకోబోతున్నారని అర్థం అవుతోంది. మరి, వర్ష బొల్లమ్మ తన పెళ్లిపై చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom