iDreamPost
android-app
ios-app

ఏం లక్ డార్లింగ్ నీది.. సలార్ బైక్ గెలిచేశాడు.. కానీ..

  • Published May 02, 2024 | 8:45 PM Updated Updated May 02, 2024 | 8:45 PM

ప్రభాస్ సలార్ లో నడిపిన బైక్ నడిపే అవకాశం వస్తే అంతకంటే అదృష్టం ఏముంటుంది. ఆ అవకాశం వస్తే ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు. అయితే ఓ ప్రేక్షకుడు సలార్ బైక్ ను గెలిచేశాడు. ఆయన ఎవరంటే?

ప్రభాస్ సలార్ లో నడిపిన బైక్ నడిపే అవకాశం వస్తే అంతకంటే అదృష్టం ఏముంటుంది. ఆ అవకాశం వస్తే ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు. అయితే ఓ ప్రేక్షకుడు సలార్ బైక్ ను గెలిచేశాడు. ఆయన ఎవరంటే?

  • Published May 02, 2024 | 8:45 PMUpdated May 02, 2024 | 8:45 PM
ఏం లక్ డార్లింగ్ నీది.. సలార్ బైక్ గెలిచేశాడు.. కానీ..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ మూవీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టింది. దాదాపు 700 కోట్లను కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూసిన రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించారు డార్లింగ్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీలో ప్రభాస్ వాడిన బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంటి బైక్ ను గెలుచుకున్నారు తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి.

థియేటర్లలో మాస్ జాతర కొనసాగించిన సలార్ ఓటీటీలో కూడా దుమ్మురేపింది. ఇటీవల స్టార్ మాలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక్కడ కూడా రికార్డ్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన తరుణంలో స్టార్ మా ఆడియెన్స్ కు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది. సలార్ లో ప్రభాస్ వాడిన బైక్ లాంటి బైక్ ను గెలుచుకునే అవకాశం కల్పించింది. ఇందుకోసం సలార్ బైక్ ఎస్ఎంఎస్ కాంటెస్ట్ ను నిర్వహించింది. ఎంతో మంది ప్రేక్షకులు ఇందులో పాల్గొనగా విజయవాడకు చెందిన వరప్రసాద్ ను ఆ బైక్ వరించింది. తాజాగా ఈ పోటీలో గెలిచిన విన్నర్ ను స్టార్ మా ప్రకటిస్తూ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Salaar Bike

సలార్ బైక్ ఎస్ఎంఎస్ కాంటెస్ట్ లో పాల్గొని బైక్ ను గెలుచుకున్న వరప్రసాద్ కు సోషల్ మీడియా వేదికగా అభినందనుల వెల్లువెత్తుతున్నాయి. లక్కీ విన్నర్ అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. విన్నర్ వరప్రసాద్ కు స్టార్ మా అభినందనలు తెలిపింది. మీ విజయాన్ని జరుపుకోవడానికి మేము చాలా సంతోషిస్తున్నాము మరియు మీరు మీ కొత్త రైడ్‌ని ఆనందిస్తారని ఆశిస్తున్నాము.. స్టార్ మాతో మెరుస్తూ,గెలుస్తూ ఉండండి అంటూ తెలిపింది. సలార్ ఐకానిక్ మోటార్‌సైకిల్‌ను గెలుచుకున్న వరప్రసాద్ మాట్లాడుతూ తనకు చాలా సంతోషంగా ఉందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక రెబల్ స్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbaywin girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom