Krishna Kowshik
తెలుగు ఇండస్ట్రీలో వర్సటైల్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్. హనుమాన్ మూవీతో సక్సెస్ పొందిన ఆమె.. ఇప్పుడు శబరిగా రాబోతుంది. ఈ సినిమా మే 3న రాబోతుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలు పంచుకుంది.
తెలుగు ఇండస్ట్రీలో వర్సటైల్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్. హనుమాన్ మూవీతో సక్సెస్ పొందిన ఆమె.. ఇప్పుడు శబరిగా రాబోతుంది. ఈ సినిమా మే 3న రాబోతుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలు పంచుకుంది.
Krishna Kowshik
తండ్రి నుండి నటనను వారసత్వంగా తీసుకుని వచ్చిన నటి వరలక్ష్మీ శరత్ కుమార్. హీరోయిన్, నెగిటివ్, సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లతో అదరగొడుతుంది. వర్సటైల్ నటిగా పేరు తెచ్చుకుంది. తెలుగులో అడుగుపెట్టడానికి కాస్త ఆలస్యమైనా.. వరుస పెట్టి అవకాశాలను కొల్లగొడుతుంది. ఈ ఏడాది హనుమాన్ తో హిట్ కొట్టేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు శబరీ అనే మూవీతో రాబోతుంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా మూవీగా తెరకెక్కుతోంది. మహర్షి కండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్ర నాథ్ నిర్మిస్తున్నాడు. అనిల్ కాట్జ్ దర్శకుడు. ఈ నెల 3వ తేదీన రిలీజ్ కు రెడీ అవుతుంది ఈ సినిమా. ఈ సందర్భంగా పలు ప్రమోషన్లలో పాల్గొంటోంది వరలక్ష్మీ.
ఇటీవల ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఈ స్టార్ కిడ్.. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొని శబరి మూవీతో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంది. శబరి మూవీ గురించి మాట్లాడుతూ.. తల్లి కూతుళ్ల చుట్టూనే ఈ సినిమా తిరుగుతుందని వెల్లడించింది. ‘ఈ సబెక్ట్ నేనేప్పుడు చేయలేదు. నేను మదర్‌గా చేశాను. సింగిల్ మదర్ తన కూతరుకి ఎలాంటి లోటు తెలియకుండా పెంచాలని అనుకుంటుంది. అలాంటి సమయంలో తన బిడ్డకి ఎవరైనా ఆపద తలపెట్టాలని ప్రయత్నిస్తే.. తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది.. స్ట్రగుల్ ఏంటీ. కూతురుని ఎలా కాపాడుకుంటోంది. కూతురి కోసం తల్లి ఎలా ఫైట్ చేస్తుంది. సైకాలజికల్ థ్రిల్లర్‌గా మార్చే సన్నివేశాలు ఇందులో చాలా ఉన్నాయి’అని చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ. ‘నేను బాల్యంలోనే లైంగిక వేధింపులకు గురయ్యాను. అదే నా జీవితంలో మర్చిపోలేని గాయం. ఈరోజుల్లో ప్రతీ ఒక్కరికి థెరపిస్ట్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది ఇలాంటి వాటి గురించి పక్కన వాళ్లకి, రిలేటివ్స్‌కు, ఫ్రెండ్స్‌కు చెప్పుకోలేరు. చెబితే రియాక్ట్ అవుతున్నారో అర్థం కావడం లేదు. కాబట్టి థెరపిస్ట్ ఉంటే చాలా బెటర్. కుటుంబసభ్యులతో నీ సమస్యల గురించి మాట్లాడితే మనల్నే జడ్జ్ చేస్తారు. అదే థెరపిస్ట్‌తో మాట్లాడితే మన సమస్య తీరుతుంది. అందుకే మనకు ఏదైనా ప్రాబ్లం ఉంటే.. థెరపిస్ట్ దగ్గరకు వెళ్లి నయం చేసుకోవడం మంచిది’ అంటూ తెలిపింది వరలక్ష్మి.