iDreamPost
android-app
ios-app

Vanitha Vijayakumar: ఆరోజు నేను రమ్యకృష్ణని తిట్టలేదు! ఆ ఒక్క మాట అడిగా: వనితా విజయ్ కుమార్!

Vanitha Vijayakumar.. సినిమాలతో కన్నా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది వనిత విజయ్ కుమార్. ఓ డ్యాన్స్ షోలో రమ్యకృష్ణతో జరిగిన గొడవపై స్పందించిన ఈ నటి.. ఏమన్నదంటే..?

Vanitha Vijayakumar.. సినిమాలతో కన్నా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది వనిత విజయ్ కుమార్. ఓ డ్యాన్స్ షోలో రమ్యకృష్ణతో జరిగిన గొడవపై స్పందించిన ఈ నటి.. ఏమన్నదంటే..?

Vanitha Vijayakumar: ఆరోజు నేను రమ్యకృష్ణని తిట్టలేదు! ఆ ఒక్క మాట  అడిగా: వనితా విజయ్ కుమార్!

ఇండస్ట్రీలో నటనను వారసత్వంగా తీసుకుని వచ్చిన నటీమణుల్లో ఒకరు వనితా విజయ్ కుమార్. తండ్రి విజయ్ కుమార్, తల్లి మంజుల నుండి కూతురైన ఆమె.. నటన కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. విజయ్, రాజ్ కిరణ్ వంటి స్టార్ హీరోలతో చేసిన ఆమె.. పెళ్లిళ్లు, తండ్రి, కుటుంబంపై విమర్శలు చేసి వార్తల్లో నిలిచింది. తన తండ్రి విజయ్ కుమార్, తన సోదరీమణులు తనను మోసం చేశారంటూ.. ఇంట్లో నుండి గెంటేశారని తీవ్ర ఆరోపణలు చేసింది. తన వాటా తనకు ఇవ్వకుండా అన్యాయం చేశారని వాపోయింది. అంతేకాకుండా ఈ కాంట్రవర్సీ క్వీన్ బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టి అక్కడ రచ్చ చేసింది. తెలుగులో కూడా దేవి మూవీలో నటించిన అమ్మడు.. మంచి మార్కులే కొట్టేసింది.

దేవీ మూవీలో చాలా సౌమ్యంగా, పదహారు అణాల ఆడపిల్లగా అలరించింది. దీంతో ఆమెకు ఫిదా అయిపోయారు తెలుగు ఆడియన్స్. అంతలో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లోకి వెళ్లిపోయింది. 2000లో ఆకాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకోగా.. ఈ జంట 2007లో విడిపోయింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఆ తర్వాత ఆనంద్ జయరాజన్ అనే వ్యక్తిని చేసుకుని అతడితోనూ ఎక్కువ కాలం ఉండలేకపోయింది. వీరికో పాప. పీటర్ పాల్ పెళ్లి అయితే మూడు నెలల ముచ్చటగానే ముగిసింది. 2013లో తిరిగి కెరీర్ స్టార్ చేసిన వనిత విజయ్ కుమార్.. సుమారు పదిహేను సంవత్సరాల తర్వాత మళ్లీ పెళ్లితో తెలుగులో అడుగు పెట్టింది. ఇక తమిళంలో కూడా వరుసగా సినిమాలు చేస్తుంది. బుల్లితెరపైన సందడి చేస్తుంది.

ఇదిలా ఉండగా.. గతంలో ఓ రియాలిసిటీ డ్యాన్ షోలో పార్టిసిపేట్ చేసింది వనిత. అందులో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఆ షోకు రమ్యకృష్ణ జడ్జ్‌గా వ్యవహరించింది. ఆ సమయంలో కూడా వీరి మధ్య గొడవ జరిగింది. వనితా కాళికా మాత వేషంలో డాన్స్ చేయగా.. మేకప్ బాగుంది కానీ డాన్సింగ్ బాలేదని రమ్యకృష్ణ కామెంట్ చేసింది. అప్పుడు రమ్యకృష్ణపై వనిత ఆగ్రహం వ్యక్తం చేసింది. జడ్జ్ మెంట్ ఇవ్వకుండా మీ వ్యక్తిగత అభిప్రాయాలు చెబుతారేంటీ అంటూ మండిపడుతూ.. అక్కడ నుండి వెళ్లిపోయింది. తాజాగా దీనిపై స్పందించిన వనిత.. ఆమె తనకు చిన్నప్పటి నుండి తెలుసనని, ఆమె మంచి యాక్టర్ అని చెప్పుకొచ్చింది. అలాగే ఆమెతో ఎలాంటి గొడవలు లేవని.. కేవలం ఆమె చెప్పిన జడ్జ్‌మెంట్ నచ్చలేదు అని తెలిపింది. ప్రస్తుతం అనీతి, ధిల్లు ఇరుంద పోరడు, ఆపరేషన్ లైలా వంటి చిత్రాలు చేస్తుంది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetparktimebetjojobet girişslot siteleriMadridbetMadridbetmadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetlunabetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş