iDreamPost
android-app
ios-app

షాకింగ్.. ప్రముఖ నటిపై దాడి! కారణం ఏంటంటే?

  • Author Soma Sekhar Published - 12:32 PM, Sun - 26 November 23

ప్రముఖ నటిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. తనపై జరిగిన దాడికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఎవరా నటి? దాడికి కారణాలు ఏంటి? ఆ వివరాలు..

ప్రముఖ నటిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. తనపై జరిగిన దాడికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఎవరా నటి? దాడికి కారణాలు ఏంటి? ఆ వివరాలు..

  • Author Soma Sekhar Published - 12:32 PM, Sun - 26 November 23
షాకింగ్.. ప్రముఖ నటిపై దాడి! కారణం ఏంటంటే?

సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు మాట్లాడే మాటలు, వారు పెట్టే పోస్ట్ లు అప్పుడప్పుడు వివాదాలకు దారితీస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ వివాదాలు వ్యక్తిగత దాడుల వరకూ వెళ్తుంటాయి. తాజాగా ఓ ప్రముఖ నటిపై కొందరు దాడిచేసిన ఘటన ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఓ వర్గానికి చెందిన ఫ్యాన్సే ఆమెపై దాడి చేశారని కొందరు ఆరోపిస్తున్నారు. తనపై జరిగిన దాడికి సంబంధించిన ఫొటోను ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్ వైరల్ గా మారింది. ఈ దాడికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ప్రముఖ నటి వనితా విజయ్ కుమార్ పై కొందరు దాడి చేసిన ఘటన ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వనితా విజయ్ కుమార్.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో ఆమె మూడో పెళ్లిపై జరిగిన చర్చ, మరే ఇతర సెలబ్రిటీపై జరగలేదనే చెప్పాలి. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ప్రస్తుతం బిగ్ బాస్ తమిళ్ సీజన్ 7లో వనితా విజయ్ కుమార్ కూతురు జోవికా కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టింది. తన కూతురు జోవికాకి మద్ధతుగా వనిత బయట నుంచి ఫుల్ సపోర్ట్ చేస్తోంది. వరుసగా ట్వీట్లు, పోస్టులు వేస్తూ.. తన కూతురి ఆటకు అండగా నిలుస్తోంది. ఇదే టైమ్ లో హౌస్ లో ఉన్న ప్రదీప్ అనే కంటెస్టెంట్ ఫ్యాన్స్ కు, జోవికా ఫ్యాన్స్ కు మధ్య సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్ జరుగుతోంది. దీంతో ప్రదీప్ అభిమానుల మీద కూడా వనిత కామెంట్లు చేస్తుంటుంది.

ఇంతవరకు బాగానే ఉన్నా.. తాజాగా వనిత విజయ్ కుమార్ పై షాకింగ్ దాడి జరిగింది. ఈ దాడి ఎవరు చేశారన్నది ఇంకా తెలియరాలేదు. కానీ ప్రదీప్ ఫ్యాన్సే ఈ దాడి చేశారని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇక దాడికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది వనిత. కన్ను భాగంలో గాయమైన పిక్ ను పోస్ట్ చేసింది. “నాపై దారుణమైన దాడి జరిగింది. ఈ సంఘటన గురించి ధైర్యంగా పోస్ట్ చేస్తున్నాను. ఇక బిగ్ బాస్ షో అనేది కేవలం ఆట మాత్రమే. ఇలా దాడి చేయడం, హింసను సృష్టించడం సరైన పద్దతి కాదు” అంటూ రాసుకొచ్చింది వనిత విజయ్ కుమార్. ఇక ఈ విషయంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. బిగ్ బాస్ షోను ఒక ఆటలా మాత్రమే చూడాలని, ఇలా వ్యక్తిగతంగా తీసుకోరాదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రదీప్ ఫ్యాన్సే దాడి చేశారని మీరెలా చెప్పగలరు? ఆమెకు ఎంతో మందితో గొడవలున్నాయి.. ఎవరు దాడి చేశారో ఎవరికి తెలుసు? అంటూ రాసుకొస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Vanitha Vijaykumar (@vanithavijaykumar)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom