iDreamPost
android-app
ios-app

ఇంట్లో నుంచి గెంటేశారు.. నా కొడుకు కూడా నాతో మాట్లాడం లేదు: వనితా విజయ్‌ కుమార్‌

  • Published Aug 09, 2023 | 3:09 PM Updated Updated Aug 09, 2023 | 3:09 PM
  • Published Aug 09, 2023 | 3:09 PMUpdated Aug 09, 2023 | 3:09 PM
ఇంట్లో నుంచి గెంటేశారు.. నా కొడుకు కూడా నాతో మాట్లాడం లేదు: వనితా విజయ్‌ కుమార్‌

నటి వనితా విజయకుమార్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దేవి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. సీనియర్‌ నటీ నటీలు మంజుల-విజయ్‌కుమార్‌ల సంతానం వనితా విజయ్‌ కుమార్‌. సినిమాలతో కన్నా వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. పెళ్లిళ్లు, విడాకులు, కుటుంబ సభ్యుల మీద సంచలన ఆరోపణలు చేస్తూ.. నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మరోసారి తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న చేదు సంఘటనల గురించి, తాను ఎదుర్కొన్న కష్టాల గురించి వెల్లడించింది. తను ప్రేమ వివాహం చేసుకోవడం.. దాని తర్వాత తలెత్తిన పర్యవసనాల గురించి చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా వనితా విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘నాకు 20 ఏళ్లప్పుడు ఆకాశ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. దాంతో నా కుటుంబం నన్ను దూరం పెట్టింది. చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను అతి జాగ్రత్తగా పెంచింది. అలా కట్టుబాట్ల మధ్య ఉంటే రెబల్‌గా అవుతారు. అందుకు నేనే ఊదాహరణ. ఇక ఆకాశ్‌తో పెళ్లి తర్వాత రెండేళ్లకు పైగా తనతో కలిసి ఉన్నాను. అప్పటికే మా మధ్య బంధం సరిగ్గా లేదు. అదే సమయంలో నాకు బాబు పుట్టాడు. నా కొడుకు మాత్రమే జరుగుతున్న దారుణాలకు సాక్షిగా ఉన్నాడు. తను అంత చిన్న వయసులోనే నన్ను, నా పరిస్థితిని అర్థం చేసుకునేవాడు. నా నిర్ణయాలకు మద్దతిచ్చేవాడు. నేను బ్రతికుండడానికి తనే కారణం.. తనే నాకు బలం. నా కొడుకు పేరు విజయ్‌ శ్రీహరి’’ అని చెప్పుకొచ్చింది.

‘‘ఇక పాప కడుపులో ఉన్నప్పుడు నేను విడాకులకు అప్లై చేశాను. అలాంటి సమయంలో కన్నవారు తోడుగా ఉండాలి. కానీ నా తల్లిదండ్రులు నన్ను దగ్గరకు రానివ్వలేదు. ఇంట్లో నుండి గెంటేశారు. విడాకులు తీసుకోవద్దు అన్నారు. కానీ నేను వారి మాటలు వినలేదు. ఆ తర్వాత నాలుగేళ్లు నరకం చూశాను. అప్పుడు నాతో పాటు నా కొడుకు కూడా ధైర్యంగా నిలబడ్డాడు. నన్ను అంతలా అర్థం చేసుకున్న నా కొడుకు ఇప్పుడు లేడు. తనను నాతో ఉంచుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నించాను. కానీ నా కోరిక తీరలేదు. ప్రస్తుతం నా కొడుకు అసలు నాతో మాట్లాడటం లేదు.. నాతో కాంటాక్ట్‌లో కూడా లేడు’’ అంటూ బాధపడింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın alCasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibom