iDreamPost
android-app
ios-app

వాలెంటైన్ డే స్పెషల్‌: OTT లోకి రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Feb 14, 2024 | 9:40 AM Updated Updated Feb 14, 2024 | 9:40 AM

Valentine Day Special: వాలెంటైన్ డే సందర్భంగా ఓటీటీలో సినిమాల జాతర కొనసాగుతుంది. ఇప్పటికే పలు ప్రేమ కథా చిత్రాలు సందడి చేస్తున్నాయి.. ఈ క్రమంలోనే రొమాంటిక్ లవ్ స్టోరీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.

Valentine Day Special: వాలెంటైన్ డే సందర్భంగా ఓటీటీలో సినిమాల జాతర కొనసాగుతుంది. ఇప్పటికే పలు ప్రేమ కథా చిత్రాలు సందడి చేస్తున్నాయి.. ఈ క్రమంలోనే రొమాంటిక్ లవ్ స్టోరీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.

  • Published Feb 14, 2024 | 9:40 AMUpdated Feb 14, 2024 | 9:40 AM
వాలెంటైన్ డే స్పెషల్‌: OTT లోకి రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇటీవల కొత్త సినిమా వచ్చిందంటే ధియేటర్లలో క్యూ కట్టి టికెట్ కొని సినిమాలు చూసేవారు.. కానీ ఇప్పుడు కాలం మారింది. టెక్నాలజీ పెరుగుతున్న వేళ ప్రతి ఒక్కటీ మనకు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఓటీటీ వచ్చిన తర్వాత కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ ఇంట్లోనే హ్యాపీగా కూర్చొని చూసుకుంటున్నారు. భారతీయ చిత్రాలే కాదు.. ఇతర భాషా చిత్రాలు కూడా ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. కొంతమంది దర్శక, నిర్మాతలు డైరెక్ట్ గా తమ సినిమాలను ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వాలెంటైన్ డై సందర్భంగా రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ ఓటీటీలోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల చిన్న సినిమాలతో తమ టాలెంట్ చూపిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నవారిలో చైతన్య రావ్ ఒకరు. 30 వెడ్స్ 21 వెబ్ సీరీస్ తో తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు చైతన్య రావ్. ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తూ.. మరోవైపు స్టార్ హీరోల చిత్రాల్లో అతిధి పాత్రల్లో నటిస్తున్నాడు. ఇటీవల చైతన్య రావు నటించిన ‘కీడాకోలా’ మంచి హిట్ అందుకుంది. గత ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా చైతన్య రావు నటించిన వాలంటైన్స్ నైట్ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి పాజిటీవ్ టాక్ వచ్చినప్పటికీ పెద్దగా అడలేదు. నేడు వాలెంటైన్ డే సందర్భంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ డిజిటల్ లో స్ట్రీమింగ్ రానుంది. దాదాపు ఏడాది తర్వాత ఓటీటీలో రాబోతున్న వాలంటైన్స్ నైట్ మూవీ. ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ వాలెంటైన్స్ డే తర్వాత అంటే ఫిబ్రవరి 15న ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

సామాజిక సందేశానికి కమర్షియల్ అంశాలను జోడిస్తూ అనీల్ గోపిరెడ్డి దర్శకత్వంలో చైతన్య రావు, సునీల్ , లావణ్య ప్రధాన పాత్రల్లో ‘వాలెంటైన్స్ నైట్’ మూవీ తెరకెక్కించారు. నేటి తరం యువత జీవన శైలిని వాస్తవిక కోణంలో ఆవిష్కరించారు దర్శకులు. నటీనటుల పర్ఫామెన్స్ కి మాంచి మార్కులే పడ్డాయి. కాకపోతే ఈ సినిమాకు సరైన ప్రమోషన్ లేకపోవడం వల్ల ధియేటర్లలో పెద్దగా ఆడలేకపోయిందని ఇండస్ట్రీ టాక్. ఈ మూవీకి అనీల్ గోపిరెడ్డి సంగీతం అందించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న ‘వాలెంటైన్స్ నైట్’పై ఓ లుక్కేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom