iDreamPost
android-app
ios-app

ఆనంద్‌ దేవరకొండకు హ్యాండిచ్చిన వైష్ణవి చైతన్య!

  • Published Nov 02, 2023 | 6:36 PM Updated Updated Nov 02, 2023 | 6:36 PM

ఇక, బేబీ కాంబో ఆనంద్‌ దేవరకొండ-వైష్ణవి చైతన్యలు హీరో, హీరోయిన్లుగా ‘డ్యూయట్‌’ సినిమా తెరకెక్కుతున్నట్లు కొద్దిరోజుల క్రితం ఓ ప్రకటన వచ్చింది.

ఇక, బేబీ కాంబో ఆనంద్‌ దేవరకొండ-వైష్ణవి చైతన్యలు హీరో, హీరోయిన్లుగా ‘డ్యూయట్‌’ సినిమా తెరకెక్కుతున్నట్లు కొద్దిరోజుల క్రితం ఓ ప్రకటన వచ్చింది.

  • Published Nov 02, 2023 | 6:36 PMUpdated Nov 02, 2023 | 6:36 PM
ఆనంద్‌ దేవరకొండకు హ్యాండిచ్చిన వైష్ణవి చైతన్య!

‘బేబీ’ సినిమాతో టాలీవుడ్‌లో క్రేజీ యంగ్‌ హీరోయిన్‌ అయిపోయారు వైష్ణవి చైతన్య. యువకుల్లో ఆమెకు సూపర్‌ క్రేజ్‌ ఏర్పడింది. ఆమె పాత్రపై నెగిటివ్‌ కామెంట్లు వచ్చినా.. నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా సూపర్‌ హిట్‌ అవ్వటంతో వైష్ణవికి వరుస ఆఫర్లు కూడా వస్తున్నాయి. అయితే, ఆఫర్లును ఎంపిక చేసుకునే విషయంలో వైష్ణవి కొంచెం ఆచితూచి వ్యవహరిస్తున్నారని, బేబీ సినిమాతో వచ్చిన క్రేజ్‌కు ఎలాంటి భంగం కలగకుండా ఉండేందకు ప్రయత్నిస్తున్నారని గత కొంత కాలంనుంచి ప్రచారం జరుగుతోంది.

ఇక, బేబీ కాంబో ఆనంద్‌ దేవరకొండ-వైష్ణవి చైతన్యలు హీరో, హీరోయిన్లుగా ‘డ్యూయట్‌’ సినిమా తెరకెక్కుతున్నట్లు కొద్దిరోజుల క్రితం ఓ ప్రకటన వచ్చింది. ఇద్దరూ కలిసి మళ్లీ ఓ సినిమా చేయబోతున్నందుకు ఫ్యాన్స్‌ కూడా ఎంతో సంతోషించారు. అయితే, వైష్ణవి ఆ సినిమానుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. వైష్ణవిని ఆ సినిమాలో నటింపజేసేందుకు నిర్మాతలు ఎంత ప్రయత్నించినా కాలేదట. వైష్ణవి ఇప్పటికే ‘బేబీ’ నిర్మాతలతో మూడు సినిమాలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

బేబీ నిర్మాత ఎస్కేఎన్, గీతా ఆర్ట్స్ నిర్మాతలతో ఈ మూడు సినిమాలు చేయనుంది. బేబీ సినిమా విడుదలకు ముందే ఈ అగ్రీమెంట్ జరిగిపోయింది. ఆ మూడు సినిమాలు అయితే కానీ, వేరే సినిమా చేయటానికి లేదు. ఆ కారణంతోనే ఈ జోడి కుదరలేదు. వైష్ణవి చైతన్య స్థానంలో నిర్మాతలు రితిక నాయక్ ని తీసుకున్నారు.  రితిక నాయక్ గతంలో ‘ అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాలో నటించింది. తర్వాత వేరే సినిమా చేయలేదు. ఇప్పుడు ‘డ్యూయట్’సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి, వైష్ణవి, ఆనంద్‌ సినిమానుంచి తప్పుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbaymavi girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom