iDreamPost
android-app
ios-app

‘బేబీ’కి ముందే సూపర్ హిట్ మూవీ మిస్ చేసుకున్న వైష్ణవి! అది ఏ మూవీనో తెలుసా?

  • Author ajaykrishna Updated - 10:42 AM, Thu - 20 July 23
  • Author ajaykrishna Updated - 10:42 AM, Thu - 20 July 23
‘బేబీ’కి ముందే సూపర్ హిట్ మూవీ మిస్ చేసుకున్న వైష్ణవి! అది ఏ మూవీనో తెలుసా?

ఇండస్ట్రీలో ఒక్కోసారి అవకాశాలు వచ్చినట్లే వచ్చి.. చేజారిపోతుంటాయి. కొన్నిసార్లు బిజీ షెడ్యూల్స్ వలన వదులకోవాల్సి వస్తుంది. కానీ.. కమిట్మెంట్, అగ్రిమెంట్స్ వలన కూడా మంచి సినిమాలు మిస్ చేసుకుంటే.. అది బ్యాడ్ టైమ్ అనే చెప్పాలి. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా హీరోహీరోయిన్స్ విషయంలోనే జరుగుతుంటాయి. అంటే.. వేరే ఆర్టిస్ట్ ల విషయంలో జరిగితే పెద్దగా బయటికి తెలియదు. అదే హీరోహీరోయిన్స్ కి సంబంధించిన విషయాలు ఇట్టే బయటికి రావడమే ఆలస్యం.. వైరల్ కూడా అయిపోతుంటాయి. ఇటీవల డెబ్యూ చేసి సూపర్ హిట్ కొట్టిన తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్య విషయంలో అదే జరిగిందట.

రీసెంట్ గా బేబీ మూవీతో సూపర్ హిట్ డెబ్యూ చేసింది వైష్ణవి. తొలి సినిమా అయినప్పటికీ.. ఏమాత్రం జంకకుండా అన్నివిధాలా క్యారెక్టర్ ని క్యారీ చేస్తూ న్యాయం చేసింది. కట్ చేస్తే.. సినిమా సూపర్ హిట్. కథతో పాటు అందులో ఉన్న క్యారెక్టర్స్.. మ్యూజిక్.. అన్ని బాగా కుదరడంతో మూవీకి బాగా ప్లస్ అయింది. అయితే.. ఫస్ట్ మూవీలోనే బోల్డ్ సీన్స్ కూడా చేసేసింది వైష్ణవి. దీంతో అటు డీసెంట్ రోల్స్ మాత్రమే కాదు.. గ్లామర్ రోల్స్ కి కూడా తాను సిద్ధమే అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అంటే.. ఆమె కూడా అన్ని రకాల క్యారెక్టర్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంటర్వ్యూలలో కూడా చెప్పింది. అయితే.. బేబీకి ముందే ఓ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకుందట వైష్ణవి.

అది ఏ సినిమానో తెలుసా.. కమెడియన్ వేణు డైరెక్టర్ గా మారి తెరకెక్కించిన ‘బలగం’. ఈ సినిమాలో ప్రియదర్శి హీరో కాగా.. మసూద ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది. పక్కా తెలంగాణ కల్చర్ ని ప్రెజెంట్ చేస్తూ రూపొందిన ఈ సినిమాలో.. కావ్య హీరోకి మరదలు క్యారెక్టర్ లో నటించింది. సినిమా రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ కావడంతో పాటు.. కావ్యకి కూడా మంచి పేరు తీసుకొచ్చింది బలగం. అలాంటి సినిమాని ముందుగా వైష్ణవి వదులుకుందట. ఈ విషయాన్నీ స్వయంగా వేణు.. బేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెప్పడం విశేషం. అయితే.. అప్పటికే వైష్ణవి బేబీ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వేరే ఏ సినిమా ఒప్పుకోకూడదని అగ్రిమెంట్ చేసుకోడంతో బలగం సినిమాను రిజెక్ట్ చేసిందట. ఆ విధంగా వైష్ణవి ఓ బ్లాక్ బస్టర్ ని మిస్ చేసుకుంది. మరి వైష్ణవి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss