iDreamPost
android-app
ios-app

ప్రముఖ నటుడు వడివేలు ఇంట్లో తీవ్ర విషాదం!

  • Published Aug 28, 2023 | 2:17 PM Updated Updated Aug 28, 2023 | 2:17 PM
  • Published Aug 28, 2023 | 2:17 PMUpdated Aug 28, 2023 | 2:17 PM
ప్రముఖ నటుడు వడివేలు ఇంట్లో తీవ్ర విషాదం!

ప్రముఖ నటుడు వడివేలు ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తమ్ముడు, ప్రముఖ నటుడు జగదీశ్వరన్‌ కన్నుమూశారు. గత కొద్దిరోలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 52 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. జగదీశ్వరన్‌ గత కొన్నేళ్ల నుంచి కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా, ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించారు. గత కొద్దిరోజుల నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

జగదీశ్వరన్‌ ఆరోగ్యాన్ని సాధారణ స్థితికి తీసుకురావటానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలయ్యాయి. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆయన కన్నుమూశారు. జగదీశ్వరన్‌ మృతితో వడివేలు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ రోజు సాయంత్రం మధురైలోని సొంత గ్రామంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక, జగదీశ్వరన్‌ నటుడిగా కూడా పలు సినిమాల్లో నటించారు. సొంతంగా బిజినెస్‌ చేస్తూనే సినిమాల్లో నటించారు.

కాగా, వడివేలు తమిళనాట స్టార్‌ కమెడియన్‌గా 1990నుంచి 2010 మధ్య కాలంలో ఓ వెలుగు వెలిగారు. స్టార్‌ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్‌ సైతం తీసుకున్నారు. డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు నాట కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, వివాదాల కారణంగా ఆయన కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరం అయ్యారు. మళ్లీ ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘మామన్నన్‌’లో నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇంతవరకు వడివేలులో కామెడీ యాంగిల్‌ మాత్రమే చూసిన జనం.. సీరియస్‌ యాంగిల్‌ను చూసి ఆశ్చర్యపోయారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom