iDreamPost
android-app
ios-app

మరో సీరియల్‌కు శుభం కార్డు.. బిగ్ బాస్ ఎఫెక్టేనా?

  • Published Aug 25, 2024 | 4:33 PM Updated Updated Aug 25, 2024 | 4:34 PM

మహిళల్ని టీవీలకు కట్టిపడేసేలా చేస్తున్నాయి ధారావాహికలు. వాటిల్లో ఒకటి గుప్పెడంత మనసు. అయితే ఈ సీరియల్ ముగుసిపోయిందట. ఇదే కాదు మరో సీరియల్ కూడా ఇదే బాట పడుతోందని సమాచారం.

మహిళల్ని టీవీలకు కట్టిపడేసేలా చేస్తున్నాయి ధారావాహికలు. వాటిల్లో ఒకటి గుప్పెడంత మనసు. అయితే ఈ సీరియల్ ముగుసిపోయిందట. ఇదే కాదు మరో సీరియల్ కూడా ఇదే బాట పడుతోందని సమాచారం.

  • Published Aug 25, 2024 | 4:33 PMUpdated Aug 25, 2024 | 4:34 PM
మరో సీరియల్‌కు శుభం కార్డు.. బిగ్ బాస్ ఎఫెక్టేనా?

మహిళా ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి సీరియల్స్. థియేటర్లకు వెళ్లలేని మహిళలకు కాలక్షేపంగా మారాయి ఈ ధారావాహికలు. రోజూ ఏం జరిగిందో చూడకపోతే కనీసం తెలుసుకోకపోతే నిద్రపట్టదు. అంతలా వీటికి ఎడిక్ట్ అవుతుంటారు. వివిధ చానళ్లలో ప్రసారమౌతున్న సీరియల్స్ చూడటం వారికో వ్యాపకంగా మారింది అనడంలో సందేహం లేదు. అలా లేడీ ఫాలోయింగ్ పెంచుకున్న ఛానల్ స్టార్ మా. ఇందులో పలు సీరియల్స్ ఆకట్టుకుంటున్నాయి. వాటిల్లో ఒకటి గుప్పెడంత మనసు. 2020లో స్టార్ మాలో ప్రారంభమైన ఈ ధారావాహిక అనతి కాలంలోనే ఆకట్టుకుంది. ఇప్పుడు ఎక్కువ మంది వాచ్ చేస్తున్న సీరియల్ కూడా ఇదే. సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యేది. ఈ సీరియల్ పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది రిషీ సార్-వసుధార క్యారెక్టర్లే. కానీ అనూహ్యంగా ఈ సీరియల్ శుభం కార్డు వేసుకున్నట్లు తెలుస్తుంది.

అర్థవంతమైన కథతో ముగింపు పలికినట్లు సమాచారం. దీనికి కారణం.. బిగ్ బాస్ అని తెలుస్తుంది. సెప్టెంబర్ 1న సాయంత్రం 7 గంటలకు ఈ షో ప్రారంభం కానున్నట్లు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో వసుధార అలియాస్ రక్షా గౌడ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ కథకు మెయిన్ పిల్లర్ రిషీ సార్ అలియాస్ ముఖేష్ గౌడ కూడా కన్నడ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ ధారావాహికను ఇంటికి పంపాలని ప్లాన్ చేశాడు డైరెక్టర్. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. మరోసీరియల్ కూడా ముగింపు పలుకబోతున్నట్లు సమాచారం. అదే టాలీవుడ్ యాక్ట్రెస్ ప్రగతి కీ రోల్ పోషిస్తున్న ఊర్వశివో, రాక్షసివో. గతేడాది డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ సీరియల్ ఇంతలోనే ఎండ్ కార్డు పడనున్నట్లు తెలుస్తుంది.

End card for another serial

బిగ్‏బాస్ షో కారణంగానే ఈ ధారావాహికకు మంగళం పాడనున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ సీరియల్ సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం అవుతుంది. ఇప్పుడు దీని టెలికాస్ట్ టైమ్‌ను బిగ్‏బాస్ షోకు కేటాయించనున్నారు. అందుకే ఈ సీరియల్‌ను ముగిస్తున్నారని టాక్ నడుస్తుంది. లేదంటే మరో టైంకి షిఫ్ట్ చేస్తారా తెలియాల్సి ఉంది. అలాగే ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్న నిఖిల్ కూడా ఈసారి హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా బిగ్ బాస్ అప్ డేట్స్ వస్తున్నాయి కానీ.. ఇంకా ఇందులోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్స్ పేర్లు ఫైనల్ కాలేదని తెలుస్తుంది. ఇప్పటికే వివిధ సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వాళ్లెవరో తెలియాలంటే.. వచ్చే వారం వరకు ఆగాల్సిందే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet