iDreamPost
android-app
ios-app

ఉప్పెన మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు ఇంట తీవ్ర విషాదం !

  • Published May 31, 2024 | 11:28 AM Updated Updated May 31, 2024 | 11:52 AM

Director Buchibabu: ఈ మధ్య తెలుగు చిత్ర పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సినీ సెలబ్రెటీలు కన్నుమూయడంతో అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు.

Director Buchibabu: ఈ మధ్య తెలుగు చిత్ర పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సినీ సెలబ్రెటీలు కన్నుమూయడంతో అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు.

  • Published May 31, 2024 | 11:28 AMUpdated May 31, 2024 | 11:52 AM
ఉప్పెన మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు ఇంట తీవ్ర విషాదం !

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలతో పాటు ఇతర సాంకేతిక రంగాలకు చెందిన వారు.. వారి కుటుంబ సభ్యులు కన్నుమూస్తున్నారు. వయోభారం, అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు ఇతర కారణాల వల్ల సెలబ్రెటీలు కన్నుమూస్తున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఉప్పెన మూవీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ప్రముఖ దర్శకులు బుచ్చిబాబు ఇంట విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే..

ఉప్పెన మూవీతో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు ప్రముఖ దర్శకులు బుచ్చిబాబు. తాజాగా దర్శకులు బుచ్చిబాబు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బుచ్చిబాబు తండ్రి పెదకాపు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన ప్రముఖ దర్శకులు సుకుమార్ తో పాటు సినీ ప్రముఖులు  బుచ్చిబాబు తండ్రి కి ఘన నివాళులర్పించారు.  నేడు సాయంత్రం కాకినాడలో ఆయన స్వగ్రామం కొత్తపల్లిలో అంత్యక్రియలు జరగనున్నాయి.

ఉప్పెన మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీని మొత్తం తన వైపు తిప్పుకున్నాడు బిచ్చిబాబు సన. మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేయడమే కాదు.. మంచి పేరు వచ్చేలా చేశాడు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రం 100 కోట్లు కలెక్ట్ చేసింది. కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్ అందరూ కొత్త వాళ్లతో వచ్చిన ఈ మూవీ కంటెంట్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఒక డబ్యూ హీరో సినిమా ఏకంగా వంద కోట్లు వసూళ్లు చేయడం ఒక రికార్డే అన్నారు. క్రియేటీవ్ డైరెక్టర్ శిష్యుడు అయిన బుచ్చిబాబు సన మొదటి సినిమాతోనే తానేంటో ప్రూవ్ చేస్తున్నాడు.ఆయన తదుపరి చిత్రం ఎవరితో తీస్తాడన్నది ఆసక్తిగా మారింది. ఆ మధ్య యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.. కాకపోతే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు.

 

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş