iDreamPost
android-app
ios-app

UI Movie Teaser: పిచ్చెక్కిస్తున్న యూఐ.. టీజర్‌ మామూలుగా లేదు!

  • Published Jan 08, 2024 | 12:51 PM Updated Updated Jan 08, 2024 | 12:51 PM

చాలా రోజుల తర్వాత ఉపేంద్ర మార్కు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఈ ఏడాది విడుదల కానుంది. తాజాగా టీజర్‌ విడుదల అయింది.

చాలా రోజుల తర్వాత ఉపేంద్ర మార్కు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఈ ఏడాది విడుదల కానుంది. తాజాగా టీజర్‌ విడుదల అయింది.

  • Published Jan 08, 2024 | 12:51 PMUpdated Jan 08, 2024 | 12:51 PM
UI Movie Teaser: పిచ్చెక్కిస్తున్న యూఐ.. టీజర్‌ మామూలుగా లేదు!

ఇండియాలోని అతి కొద్ది మంది సూపర్‌ టాలెంటెడ్‌ దర్శకుల్లో ‘‘ ఉపేంద్ర’’ ముందు వరుసలో ఉంటారు. దర్శకుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఉప్పి.. కన్నడ నాట తక్కువ కాలంలో స్టార్‌ డైరెక్టర్‌గా మారారు. ఇండస్ట్రీ హిట్‌లను అందుకున్నారు. తర్వాత తాను కూడా హీరోగా మారి సినిమాలు చేశారు. ఆ చిత్రాలు కూడా సూపర్‌ హిట్‌ అయ్యాయి. తెలుగులో కూడా డబ్‌ అయి హిట్‌ను అందుకున్నాయి. ప్రస్తుతం ఆయన దర్శకుడిగా సినిమాలు చేయటం తగ్గించేశారు.

హీరోగా..క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చిత్రాలు చేస్తూ బిజీ అయిపోయారు. గత సంవత్సరం ‘కబ్జా’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆయన ప్రస్తుతం ‘ యూఐ’ సినిమా చేస్తున్నారు. నటనతో పాటు దర్శకత్వం కూడా చేస్తున్నారు. యూఐ షూటింగ్‌ పూర్తి చేసుకుంది. పోస్టు ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. యూఐకి సంబంధించి తాజాగా టీజర్‌ రిలీజైంది. టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. చాలా రోజుల తర్వాత ఉప్పి మార్కు సినిమా  ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇంతకీ టీజర్‌ ఎలా ఉందంటే..

టీజర్‌ అడవుల్లో  ఆడమ్‌ అండ్‌ ఈవ్‌లతో మొదలవుతుంది. తర్వాత నాగరికత మార్పుకు సంబంధించిన షాట్లు వస్తాయి. టీజర్‌ క్లైమాక్స్‌లో ఉప్పి గుర్రం మీద ఎంట్రీ ఇస్తారు. కోపంగా చూస్తూ ఉంటారు. యూఐ అన్న టైటిల్‌ పడుతుంది. అయితే, టీజర్‌లో సినిమా కథ ఏంటి అన్నది అస్సలు అర్థం కావటం లేదు. మొత్తానికి బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌, సాధు కోకిల గెటప్‌ టీజర్‌ను ఎక్కడికో తీసుకెళుతున్నాయి. 1.57 సెకన్ల నిడివి కలిగిన వీడియో అద్భుతంగా ఉందని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

కాగా, యూఐ తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఈ ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రంలో రీష్మ ననయ్య, మురళీ శర్మ, సన్నీ లియోన్‌, నిధి సుబ్బయ్య, సాధు కోకిల, మురళి క్రిష్ణ, ఇంద్రజిత్‌ లోకేష్‌లు నటిస్తున్నారు. అంజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. దాదాపు 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. లహరి ఫిల్మ్స్‌, వీనస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించాయి. మరి, యూఐ టీజర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet