iDreamPost
android-app
ios-app

UI రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఉపేంద్ర గట్టిగానే ప్లాన్ చేశాడు..

  • Published Aug 16, 2024 | 6:53 PM Updated Updated Aug 16, 2024 | 6:53 PM

Upendra Pan Indian Movie UI The Movie Release Details: ఉపేంద్ర సినిమా ఫ్యాన్స్ క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు. తాను చేస్తున్న పాన్ ఇండియా సినిమా రిలీజ్ కి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేశాడు.

Upendra Pan Indian Movie UI The Movie Release Details: ఉపేంద్ర సినిమా ఫ్యాన్స్ క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు. తాను చేస్తున్న పాన్ ఇండియా సినిమా రిలీజ్ కి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేశాడు.

  • Published Aug 16, 2024 | 6:53 PMUpdated Aug 16, 2024 | 6:53 PM
UI రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఉపేంద్ర గట్టిగానే ప్లాన్ చేశాడు..

ఉపేంద్ర.. ఈయన పేరు వినగానే సినిమా ప్రేక్షకుల్లో ఎక్కడలేని ఉత్సాహం, జోష్ వచ్చేస్తాయి. ఉపేంద్ర నుంచి సినిమా వస్తోంది అంటే చాలు అలర్ట్ అయిపోతారు. ఎందుకంటే సమాజంలో ఉన్న సమస్యలు, చెడు ధోరణుల గురించి నిక్కచ్చిగా సినిమా తీయగల సత్తా ఆయనకి మాత్రమే ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉపేంద్ర తీసిన సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఉపేంద్ర నుంచి ఏకంగా పాన్ ఇండియా సినిమా వస్తోంది. అందులో హీరోగా యాక్ట్ చేయడమే కాకుండా.. ఆ మూవీని డైరెక్ట్ కూడా చేశాడు. ఇంక సినిమా పేరు కూడా ఎంతో విచిత్రంగా UI The Movie అని పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

ఉపేంద్ర నుంచి వస్తున్న యూఐ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా కాన్సెప్ట్ చూసినప్పటి నుంచే అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. నరకం తరహాలో, ఉపేంద్ర ఒక నరకంలో శిక్షలు విధించే వ్యక్తిలా కనిపించాడు. పైగా ఆ యూఐ టైటిల్ కూడా గుర్రపు నాడాతో ఉంది. ఇలాంటివి అన్నీ చూసిన తర్వాత సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. అందులోనూ ఉపేంద్ర డైరెక్షన్ అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఇది కచ్చితంగా సమాజాన్ని ప్రశ్నించే సినిమా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల విడుదల చేసిన సాంగ్ చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. ఈ రెండేళ్లలో వచ్చిన మీమ్స్ అని కలిపి ఒక అదిరిపోయే పాట చేసేశారు.

ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించి అధికారికంగా ప్రకటన చేశారు. ఈ సినిమాకి అక్టోబర్ నెలలో విడుదల చేయబోతున్నాం అంటూ ప్రకటన చేశారు. అయితే ఈ డేట్ కి రాబోతున్నారు అనే విషయం మాత్రం చెప్పలేదు. పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని భాషల్లో చూసుకుని రావాలి. అంటే ఆ ఇండస్ట్రీల్లో ఎలాంటి పోటీలేని సమయంలో వస్తేనే బాగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అక్టోబర్ 10కి అయితే కొన్ని రిలీజులు ఉన్నాయి. కాబట్టి యూఐ చిత్రం ఆ సమయానికి రాకపోవచ్చు. డేట్ ని ప్లాన్ చేసుకుందామనే.. ఇంకా వెల్లడించలేదు అనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. తాజా అప్ డేట్ లో కూడా ఒక కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు. పుర్రెలు, అస్థిపంజరాలు, కాకుల మధ్య ఉపేంద్ర నరకాధిపతిగా కనిపిస్తున్నాడు. ఇవన్నీ చూశాక యూఐ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. మరి.. యూఐ సినిమా అక్టోబర్ నెలలో వస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet