Ram Charan: రామ్‌చరణ్‌కి అవమానం.. ఉపాసన సీరియస్! ఆ పోస్ట్‌కి అర్థం?

Upasana, Ram Charan, Shahrukh Khan: అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా.. బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ రామ్‌చరణ్‌ను అవమానించడంపై చరణ్‌ భార్య ఉపాసన సీరియస్‌గా ఉంది. ఈ క్రమంలోనే ఒక పోస్ట్‌..

Upasana, Ram Charan, Shahrukh Khan: అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా.. బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ రామ్‌చరణ్‌ను అవమానించడంపై చరణ్‌ భార్య ఉపాసన సీరియస్‌గా ఉంది. ఈ క్రమంలోనే ఒక పోస్ట్‌..

గుజరాత్‌ లోని జామ్‌ నగర్‌ లో అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులతో పాటు బాలీవుడ్‌ మొత్తం కదిలి వెళ్లింది. టాలీవుడ్‌ నుంచి రామ్‌ చరణ్‌ దంపతులకు మాత్రమే ఆహ్వానం అందింది. అయితే.. ఈ వేడకల్లో భాగంగా షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, ఆమీర్‌ ఖాన్‌ కలిసి డ్యాన్స్‌ వేశారు. అనంతరం రామ్‌ చరణ్‌ ను స్టేజ్‌ పైకి ఆహ్వానించారు. ఏకంగా కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌ ఖాన్‌ రామ్‌ చరణ్‌ ను స్టేజ్‌ పైకి పిలవడం విశేషంగా మారింది. కానీ, ఇడ్లీ, వడా.. రామ్‌ చరణ్‌ అంటూ సంబోధిస్తూ.. చరణ్‌ ను స్టేజ్‌పైకి ఆహ్వానించడంపై రామ్‌ చరణ్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఇది ముమ్మాటికీ బాలీవుడ్‌ అహంకారమే అంటూ షారుఖ్‌ పై మండిపడుతున్నారు.

ఈ క్రమంలోనే అక్కడే ఉన్న రామ్‌చరణ్‌ భార్య ఉపాసన ఈ విషయంలో బాగా ఫీలైనట్లు తెలుస్తోంది. గ్లోబల్‌ స్టార్‌ గా ఎదిగిన తన భర్తను ఇలా వెటకారంగా స్టేజ్‌ పైకి ఆహ్వానించడంపై ఆమె కోపంగా ఉన్నట్లు సమాచారం. ఈ వేడుకకు ఉపాసన పర్సనల్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ జెబా హసన్‌ కూడా హాజరయ్యారు. రామ్‌ చరణ్‌ ను స్టేజ్‌పైకి పిలిచేటప్పుడు అక్కడే ఉన్న జెబా హసన్‌.. షారుఖ్‌ పిలిచిన విధానం నచ్చక అక్కడి నుంచి వచ్చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేశారు. ఒక పర్సనల్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ కే ఈ విషయం నచ్చనప్పుడు.. ఉపాసన ఎలా లైట్‌ తీసుకుని ఉంటారని.. ఆమె కూడా ఈ విషయంపై సీరియస్‌ గానే ఉండి ఉంటారని సన్నిహితులు పేర్కొంటున్నారు.

తమ వద్ద పనిచేసే వ్యక్తి ఇలా ఓపెన్‌ గా పోస్ట్‌ చేశారంటే.. ఈ విషయంపై వారి మధ్య చర్చ జరిగే ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. తన కంటే పెద్ద విషయంలో ఎంతో వినయంగా, విధేయంగా ఉండే రామ్‌ చరణ్‌ మంచితనాన్ని షారుఖ్‌ ఖాన్‌ ఇలా అడ్వాంటేజ్‌ గా తీసుకోవడంపై రామ్‌ చరణ్‌ అభిమానులే కాకుండా.. సినీ అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను దాటి వెళ్లిపోతున్న రామ్‌ చరణ్‌ ను చూసి.. బాలీవుడ్‌ స్టార్లు అసూయపడుతున్నారని, వారి ఓర్వలేని తనం స్పష్టంగా కనిపిస్తోందని కామెంట్‌ చేస్తున్నారు. మరి తన భర్తకు జరిగిన అవమానంపై ఉపాసన ఎలా రియాక్ట్‌ అవుతారో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments