iDreamPost
android-app
ios-app

మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మీద ఉమాదేవి కూతురు సంచలన కామెంట్స్

  • Published Apr 24, 2024 | 1:33 PM Updated Updated Apr 24, 2024 | 1:33 PM

స్టార్ మాలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ షో నీతోనే డ్యాన్స్ 2.0. ఇందులో జడ్జిలుగా అలరిస్తున్నారు సీనియర్ నటీమణులు రాధ, సదా. ఇప్పుడు ఈ జడ్జిలపై సంచలన కామెంట్స్ చేసింది ప్రముఖ సీరియల్ నటి ఉమాదేవి కూతురు.

స్టార్ మాలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ షో నీతోనే డ్యాన్స్ 2.0. ఇందులో జడ్జిలుగా అలరిస్తున్నారు సీనియర్ నటీమణులు రాధ, సదా. ఇప్పుడు ఈ జడ్జిలపై సంచలన కామెంట్స్ చేసింది ప్రముఖ సీరియల్ నటి ఉమాదేవి కూతురు.

  • Published Apr 24, 2024 | 1:33 PMUpdated Apr 24, 2024 | 1:33 PM
మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మీద ఉమాదేవి కూతురు సంచలన కామెంట్స్

కార్తీక దీపం సీరియల్లో వంటలక్క పిన్నిగా నటించింది ఉమా దేవి. ఇందులో గయ్యాళి పాత్రలో కనిపించి, ఆ తర్వాత కామెడీ పీస్‌గా మారిపోయింది. చివరకు ఆ సీరియల్లో ఆమె పాత్రను లేకుండా చేశారు. పావు శేరు భాగ్యం పాత్రలో మెప్పించిన ఉమాదేవి.. సీనియర్ యాక్టర్ అని చాలా మందికి తెలియదు. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో కొనసాగుతుంది. చిన్న చిన్న పాత్రల్లో మెప్పించిన ఈ నటి.. బుల్లితెరపై కూడా హవా కొనసాగిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టుగా ఇంట్లోకి అడుగుపెట్టిన ఈ నటి.. రెండో వారంలోనే బయటకు వచ్చేసింది. తొలి నుండి తోటి కంటెస్టెంట్లతో గొడవ పడుతూ.. బూతులు మాట్లాడుతూ హాట్ టాపిక్ అయ్యింది. సీజన్ 5 విన్నర్ సన్నీని అల్లుడిగా చేసుకోవాలనుకున్నట్లు కూడా చెప్పింది.

తన పెద్ద కూతురికి అడుగుదామని అనుకన్నాను కానీ.. ఆమె అన్నగా ఫిక్స్ అయిపోయిదంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఉమాదేవి పెద్ద కూతురు తనూష ఓ షోపై హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. స్టార్ మాలో నీతోనే డాన్స్ 2.0 ప్రోగ్రామ్ చేస్తోంది. ఇందులో చాలా వరకు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ డ్యాన్స్ చేస్తున్నారు.  ఈ షోలో జోడీలపై, జడ్జీలపై విరుచుకు పడింది ఉమాదేవి కూతురు. ‘నాకు ఒకటి అర్థం కావడం లేదు. నీతోనే డాన్స్ 2.0 అంటే డాన్స్ ఉండాలి. కానీ విశ్వ, నేహా చౌదరి.. ఎప్పుడూ జిమ్నాస్టిక్సే చేస్తారు. ఒకరికి ఒక టాలెంట్ ఉంది అంటే.. యూజ్ చేసుకోవచ్చు కానీ ప్రతిసారి ప్రతి డ్యాన్సులో జిమ్నాస్టిక్ చేడం కరెక్ట్ కాదు. ఈ జడ్జీలు కూడా అసలెట్లా జడ్జిమెంట్ ఇస్తారో అర్థం కావడం లేదు. పనికి మాలిన జడ్జిమెంట్ అంతే. ఏదో జనాలకి ఎంటర్ టైన్ మెంట్ కావాలి. ఆర్టిస్టుల్ని పోషించాలి అంతే కానీ డాన్స్ అంటే ఏంటీ, అసలు జడ్జిమెంట్ ఎట్లా ఇవ్వాలని కూడా తెలియకుండా ఉన్నారు’ అంటూ రాసుకొచ్చింది.

sensational comments on former Bigg Boss contestants 01

‘నీతోనే డ్యాన్స్‌లో స్టార్ మా వాళ్లు కూడా డ్యాన్స్ రాని వాళ్లను సెలక్ట్ చేసుకుంటారు. లిప్ సింక్ ఉండదు. పెయిర్ మధ్య సింకింగ్ ఉండదు. క్లమ్జీ.. క్లమ్జీగా ఉంటుంది. అయినా ఫుల్ మార్క్ ఇచ్చేస్తారు జడ్జిలు. ఒక్క పెయిర్ అని కాదు.. అన్ని పెయిర్స్ అలానే ఉన్నాయి. మరీ వాళ్లు ఏం జడ్జెస్సో నాకు అర్థం కావడం లేదు. అయినా హీరోయిన్లను తీసుకు వచ్చి జడ్జిలుగా కూర్చొబెడితే వాళ్లకు ఏం తెలుస్తుంది’ అంటూ పేర్కొంది. అలాగే మరో కన్నడ పెయిర్ గురించి మాట్లాడుతూ.. అలాగే వీరికి తెలుగు రాదని, కానీ వాళ్లను మనం ఎంకరేజ్ చేయాలని, కానీ కన్నడలో తెలుగు వాళ్లు సీరియల్స్ , డ్యాన్స్ షో చేస్తామంటే ఒప్పుకుంటారా అంటూ ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది తనూష. కాగా, ఈ డ్యాన్స్ షోకు సీనియర్ నటి రాధ, సదా జడ్జిలుగా వ్యవహరిస్తున్న సంగతి విదితమే.

 

View this post on Instagram

 

A post shared by Tanusha Yagati (@t.a.n.u.s.h.a.y.a.g.a.t.i)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom