iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి మృతి

  • Published Feb 16, 2024 | 2:36 PM Updated Updated Feb 16, 2024 | 2:36 PM

Kavita Chaudhary Passes away: ఒకప్పుడు బాలీవుడ్ బుల్లితెరపై నటించిన నటీనటులు ఇటీవల వరుసగా కన్నుమూస్తున్నారు. ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.

Kavita Chaudhary Passes away: ఒకప్పుడు బాలీవుడ్ బుల్లితెరపై నటించిన నటీనటులు ఇటీవల వరుసగా కన్నుమూస్తున్నారు. ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.

  • Published Feb 16, 2024 | 2:36 PMUpdated Feb 16, 2024 | 2:36 PM
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి మృతి

ఇటీవల వెండితెర, బుల్లితెర ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. వయోభారం, అనారోగ్యం, హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు ఇలా ఎన్నో కారణాల వల్ల సెలబ్రెటీలు కన్నుమూస్తున్నారు. నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగానికి చెందిన సెలబ్రెటీలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం తీరని దుఖఃంలో మునిగిపోతున్నారు. ఒకప్పుడు దూరదర్శన్ లో ఎన్నో అద్భుతమైన సీరియల్స్ వచ్చాయి. అందులో ఉడాన్ దారావాహికం ఒకటి. తాజాగా ఈ సీరియల్ లో నటించిన ప్రముఖ నటి కన్నుమూయడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే..

ఒకప్పుడు దూరదర్శన్ లో వచ్చిన సీరియల్స్ కి ఎంతో మంచి ఆదరణ లభించేది. రామయణం, మహాభారతం ఇతిహాసాలతో వచ్చిన దారావాహికాలతో పాటు హర్రర్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైన్‌మెంట్ జోనర్ లో వచ్చిన సీరియల్స్ కి మంచి క్రేజ్ లభించింది. 1989 లో ‘ఉడాన్’ సీరియల్ కి మంచి పేరు వచ్చింది. ఈ సీరియల్ ని కవితా చౌదరి దర్శకత్వం వహించారు. అంతేకాదు ఈ సీరియ్ లో ఐపీఎస్ అధికారిని కళ్యాణి సింగ్ పాత్రలో నటించి ప్రేక్షకులు మెప్పించారు కవితా చౌదరి. అప్పట్లో ఈ సీరియల్ ఒక సెస్సేషన్ క్రియేట్ చేసింది. 1989 నుంచి మొదలైన ఈ సీరియల్ 1991 వరకు దూరదర్శన్ లో ప్రసారం అయ్యింది.

బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. నటి కవితా చౌదరి అమృత్ సర్ లో గుండెపోటుతో కన్నుమూశారు.  గత కొంత కాలంగా అనారోగ్యంతో బాదపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1957 లో జన్మించిన కవితా చౌదరి టీవి నటిగా, దర్శకురాలిగా మంచి పేరు సంపాదించారు. ఉడాన్ తో పాటు యువర్ హానర్, ఐపీఎస్ డైరీస్ దారవాహికాలు కూడా తెరకెక్కించారు. 1980 చివర్లో కొన్ని యాడ్స్ లో కూడా నటించారు కవితా చౌదరి. ఆమె మరణ వార్త తెలిసిన బుల్లితెర, వెండితెర సెలబ్రెటీలు నివాళులర్పిస్తున్నారు.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş