iDreamPost
android-app
ios-app

ప్రముఖ టాలీవుడ్ నటి ఇంట్లో దొంగతనం.. ఏం పోయాయంటే.?

  • Published Jul 04, 2024 | 4:30 PM Updated Updated Jul 04, 2024 | 4:30 PM

సినీ సెలబ్రిటీల ఇళ్లల్లో వరుస దొంగతనాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. గతంలో రజనీ కూతురు ఐశ్వర్య.. కల్కి మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన శోభన, నిరోషా వంటి నటీమణుల ఇళ్లల్లో చోరీలు జరిగిన సంగతి విదితమే. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో చేతి వాటం ప్రదర్శించారు.

సినీ సెలబ్రిటీల ఇళ్లల్లో వరుస దొంగతనాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. గతంలో రజనీ కూతురు ఐశ్వర్య.. కల్కి మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన శోభన, నిరోషా వంటి నటీమణుల ఇళ్లల్లో చోరీలు జరిగిన సంగతి విదితమే. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో చేతి వాటం ప్రదర్శించారు.

  • Published Jul 04, 2024 | 4:30 PMUpdated Jul 04, 2024 | 4:30 PM
ప్రముఖ టాలీవుడ్ నటి ఇంట్లో దొంగతనం.. ఏం పోయాయంటే.?

ఈజీ మనీ, జల్సాలకు అలవాటు పడి కొంత మంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. బయట వ్యక్తుల పని అనుకుంటే పొరపాటు.. ఇంట్లో బాగా తెలిసిన వ్యక్తులే ఇలాంటి పనులు చేస్తున్నారు. సామాన్యుల ఇళ్లల్లోనే కాదు స్టార్ సెలబ్రిటీ నివాసాల్లో కూడా చేతి వాటం ప్రదర్శిస్తున్నారు ఇంట్లో పనిచేసే వ్యక్తులు. గత ఏడాది రజనీకాంత్ కూతురు, ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య ఇంట్లో దొంగతనం జరగ్గా.. చివరకు పనిమనిషి, కారు డ్రైవర్ చోరీ చేశారని తేలింది. ఆ తర్వాత ఒకప్పటి స్టార్ నటి శోభన ఇంట్లో కూడా దోపిడీ జరిగింది. ఆ వెంటనే రాధిక సోదరి నిరోషా ఇంట్లో కూడా దొంతనం చోటుచేసుకుంది. గత నెలలో మరాఠి భామ శ్వేతా షిండే కూడా బాధితురాలైంది. తాజాగా.. ప్రముఖ నటి ఇంట్లో దొంగతనం చోటుచేసుకుంది.

ప్రముఖ కోలీవుడ్, టాలీవుడ్ నటి అతుల్య రవి ఇంట్లో చోరీ జరిగింది. కోయంబత్తూరులోని వాడవల్లి ప్రాంతంలో ఈ ఘటన చోటచేసుకుంది. నటి తన తల్లితో కలిసి ఇదే ఇంట్లో ఉంటుంది. ఆమె ఇంట్లో నుండి డబ్బు.. పాస్ పోర్టు కనిపించకుండా పోయాయి. ఈ విషయాన్ని గమనించిన తల్లి విజయలక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంట్లో రూ. 2 వేలతో పాటు.. పాస్ పోర్టు మాయమైనట్లు ఫిర్యాదు చేసింది. కాగా, ఆమె పనిమనిషిపై అనుమానం వ్యక్తం చేశారు. తొండముత్తూరు సమీపంలోని కులత్తుపాళ్యంలో నివాసముంటున్న అతుల్య రవి పనిమనిషి సెల్విని పోలీసులు విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. దొంగతనంపై ఆరా తీయగా.. తొలుత తనకేమీ తెలియదని బుకాయించగా.. తమదైన స్టైల్లో విచారించే సరికి తానే.. తన స్నేహితురాలితో కలిసి ఈ దొంగతనం చేసినట్లు వెల్లడించింది.

Thiefs in actress atulya ravi

తన స్నేహితురాలు సుబాషిణితో కలిసి డబ్బు దోచుకున్నట్లు ఆమె అంగీకరించింది. నిందితుల నుండి రూ.1500 స్వాధీనం చేసుకున్నారు. అయితే పాస్‌పోర్టు గురించి వివరాలు ఆరా తీస్తున్నారు. సెల్వి, సుభాషిణీని అరెస్టు చేసి మరింత విచారణ జరుపుతున్నారు. అతుల్య రవి అసలు పేరు దివ్య. 2017లో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అతుల్య. కాదల్ కాన్ కట్టుదే ఆమెకు తొలి సినిమా. కథా నాయగన్, యమాలితో మొదలైన ఆమె ప్రయాణం తెలుగు ఇండస్ట్రీకి పాకింది. గత ఏడాది టాలీవుడ్ పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన మీటర్ మూవీలో హీరోయిన్ అతుల్యానే. ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్టులున్నాయని తెలుస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibom