iDreamPost
android-app
ios-app

రోడ్డు ప్రమాదం.. మూడు సర్జరీలు.. నడవలేని స్థితిలో ప్రముఖ నటుడు

  • Published Mar 02, 2024 | 3:04 PM Updated Updated Mar 02, 2024 | 3:04 PM

Malayalam TV Actor Unable to Walk: రోడ్డు ప్రమాదం ఆ నటుడి జీవితాన్ని మొత్తం మార్చింది. నడవలేని దయనీమైన స్థితికి తీసుకువచ్చింది.. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా?

Malayalam TV Actor Unable to Walk: రోడ్డు ప్రమాదం ఆ నటుడి జీవితాన్ని మొత్తం మార్చింది. నడవలేని దయనీమైన స్థితికి తీసుకువచ్చింది.. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా?

  • Published Mar 02, 2024 | 3:04 PMUpdated Mar 02, 2024 | 3:04 PM
రోడ్డు ప్రమాదం.. మూడు సర్జరీలు.. నడవలేని స్థితిలో ప్రముఖ నటుడు

ఇటీవల దేశ వ్యాప్తంగా పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డైవర్లు చేస్తున్న నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఎంతోమంది జీవితాలు బలైపోతున్నాయి. కుటుంబ పెద్దని కోల్పోయి అనాథలుగా మిగిలిపోతున్నారు. మరెంతోమంది అంగవైకల్యంతో బాధపడుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. వాహనదారులు నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు కూడా రోడ్డు ప్రమాదాల భారిన పడి చనిపోతున్నారు. ఒక రోడ్డు ప్రమాదం నటుడి జీవితాన్ని ఛిద్రం చేసింది. ఇంతకీ ఆ నటుడు ఎవరు.. ఏం జరిగిందన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

మాలీవుడ్ బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు కార్తీక్ ప్రసాద్. ఫిబ్రవరి 20న ‘మౌనరాగం’ సీరియల్ షూటింగ్ ముగించుకొని ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంతలోనే ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ప్రసాద్ ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కార్తీక్ ప్రసాద్ స్పృహ తప్పి కిందపడిపోయాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కార్తీక్ తల, ముఖానికి, కాళ్లకు తీవ్ర గాయాలు అయినట్లు వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయన ముఖానికి ప్లాస్టీక్ సర్జరీ చేయించుకున్నారు. తదుపరి చికిత్స కోసం కోజికోడ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మౌన రాగం సీరియల్ లో బైజు పాత్రకు పెద్ద ఎత్తున ప్రేక్షకుల నుంచి ఆదరణ వచ్చింది. సీరియల్స్ లోనే కాదు.. సినిమాల్లో కూడా నటించాడు కార్తీక్. ప్రస్తుతం ఆయన పరిస్థితి చాలా దయనీకంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ విషయం గురించి నటి బీనా ఆంటోనీ మాట్లాడుతూ.. ‘కార్తీక్‌ ప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగాలేదు. ఆయన నడవడానికి కూడా చలా సమయం పట్టేలా ఉంది. రెండు కాళ్ల చర్మం ఊడిపోయింది.. ఇప్పటికే రెండు మూడు సార్లు సర్జరీ చేశారు. ఇంకా చేయాలని అంటున్నారు. నాతో కార్తీక్ మాట్లాలేదు.. అతని భార్యతో మాట్లాడాను. నొప్పులు భరించలేక చాలా ఇబ్బంది పడుతున్నాడని ఆయన భార్య చెప్పడంతో నా మనసు చాలా బాధపడింది. మంచి కెరీర్ కొనసాగిస్తున్న కార్తీక్ కి ఇలాంటి ఘటన జరగడం శోచనీయం’ అని అన్నారు. కార్తీక్‌ ప్రసాద్‌ త్వరగా కోలుకొని రావాలని సహనటులు, అభిమానులు దేవున్ని ప్రార్థిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet