iDreamPost
android-app
ios-app

ప్రేమించిన ప్రియుడిని పెళ్లాడిన నటి!

  • Published Dec 22, 2023 | 2:58 PM Updated Updated Dec 22, 2023 | 2:58 PM

ఇటీవల వెండితెర, బుల్లితెర నటీనటులు వివాహబంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెడుగుపెడుతున్నారు. చాలా మంది తమ సహనటులను ప్రేమించి.. పెద్దలను ఒప్పించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

ఇటీవల వెండితెర, బుల్లితెర నటీనటులు వివాహబంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెడుగుపెడుతున్నారు. చాలా మంది తమ సహనటులను ప్రేమించి.. పెద్దలను ఒప్పించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

  • Published Dec 22, 2023 | 2:58 PMUpdated Dec 22, 2023 | 2:58 PM
ప్రేమించిన ప్రియుడిని పెళ్లాడిన నటి!

ఈ మద్య వెండితెర, బుల్లితెర నటీనటులతో పాటు దర్శక, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్లు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు వరుసగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. వీరిలో ప్రేమించి పెళ్లి చేసుకునేవారు కొందరైతే.. పెద్దలు నిశ్చయించిన వివాహాలు చేసుకున్నవారు కొంతమంది ఉన్నారు. బాలీవుడ్ బుల్లితెర నటి శ్రెను పరీఖ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు.. ఈ అమ్మడు స్టార్ ప్లస్ లో వచ్చిన రొమాంటిక్ డ్రామా ‘ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్’ లో అగ్ని హూత్రి పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా శ్రెను పరీఖ్ తన సహనటుడు అక్షయ్ మాత్రే ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

ఇటీవల సెలబ్రెటీలు తాము ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్నారు. తాజాగా బుల్లితెర నటి శ్రెను పరిఖ్‌ తన సహ నటుడు అయిన అక్షయ్ మాత్రే తో కొంతకాలం ప్రేమలో ఉంది. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించడంతో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట 2021 లో బుల్లితెరపై వచ్చిన ‘ఘర్ ఏక్ మందిర్ కృపా అగ్రసేన్ మహరాజా కి’ అనే సీరియస్ లో కలిసి నటించారు. చాలా వరకు సెట్ లో కలిసి ఉండటం వల్ల ఒకరినొకరు ఇష్టపడ్డారు. అలా కొంతమంది కాలం వీరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగడం.. ఆ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ గా రావడం తెలిసిందే. అప్పట్లో స్టార్ ప్లస్ లో వచ్చిన ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్ సీరియల్ లో శ్రెను పరిఖ్‌ నటనకు మంచి ఆదరణ లభించింది.

actress getting marriage

ఈ సీరియల్ జంట వివాహం శ్రేను సొంత ఊరు అయిన గుజరాత్ లోని వడోదరలో గురువారం బంధు, మిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. పెళ్లికి ముందు హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు సైతం ఘనంగా జరిగాయి. సంగీత్ లో ఈ ప్రేమ బాలీవుడ్ హిట్ సాంగ్స్ కి స్టెప్పులు వేశారు. ఇక వీరిద్దరి కెరీర్ విషయానికి వస్తే.. శ్రెను పరిఖ్‌.. ఎక్ బార్ ఫిర్, ఎక్ భ్రమ్ సర్వగుణ్ సంపన్, ఘర్ ఏక్ మందిర్, జింగదగి కా హర్ ర్యాంగ్, గులాల్ వంటి హిట్ సీరియల్స్ లో నటించిన పాపులర్ అయ్యింది. పలు లైవ్ షోలు కూడా చేసింది. ఇక ఇండియావాలీ మా సీరియల్ లో అక్షయ్ మాత్రే నటించిన మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా తమ వివాహవేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నారు కొత్త జంట.

 

View this post on Instagram

 

A post shared by Shrenu Parikh (@shrenuparikhofficial)

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet