iDreamPost
android-app
ios-app

ఆసుపత్రిలో చేరిన సీరియల్‌ నటి పావని.. కారణం ఏంటంటే..

  • Published Jul 06, 2023 | 4:04 PM Updated Updated Jul 06, 2023 | 4:04 PM
  • Published Jul 06, 2023 | 4:04 PMUpdated Jul 06, 2023 | 4:04 PM
ఆసుపత్రిలో చేరిన సీరియల్‌ నటి పావని.. కారణం ఏంటంటే..

తెలుగు సీరియల్‌ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు పావని రెడ్డి. సీరియల్‌, సినిమా నటిగా ఈమె రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు.. తమిళ నాట కూడా చాలా ఫేమసే. పావని తెలుగు,తమిళం, మలయాళ భాషల్లో పలు సీరియళ్లు, సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె తమిళ సీరియల్స్‌తో బీజీ అయిపోయారు. ఎప్పుడూ సినిమాలు, సీరియల్‌ షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండే ఆమె తాజాగా ఆసుపత్రి పాలయ్యారు. గత కొన్ని నెలలుగా తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చేరారు.

వైద్యులు ఆమె మెడ దగ్గర మేజర్‌ సర్జరీ చేశారు. దాదాపు 15 రోజులు ఆమె ఆస్పత్రిలోనే ఉంటూ చికిత్స పొందుతూ ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు, ఫొటోలను గురువారం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఆమె తన పోస్టులో..‘‘ ఈ 15 రోజులు చాలా దారుణంగా గడిపాను. మెడ దగ్గర చిన్న నొప్పి మొదలైంది. అది రోజురోజుకు పెరుగుతూ పోయింది. నేను చాలా మంది డాక్టర్లను కలిశాను. కానీ, ఆ నొప్పి తగ్గలేదు. నేను ఆ నొప్పి కారణంగా చాలా ఇబ్బందులు పడ్డా. ఏడుస్తూ.. ఏన్నో నిద్రలేని రాత్రులు గడిపా.

నొప్పి తట్టుకోలేక కొన్ని సార్లు బోరున ఏడ్చేదాన్ని.. గోడను బలంగా కొట్టేదాన్ని. ఈ సందర్భంలోనే ఏషియన్‌ స్పైన్‌ హాస్పిటల్లో చేరాను. ఎండోస్కోపిక్‌ డిసెక్టమీ సర్జరీ చేయించుకున్నాను. ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంది. డాక్టర్లకు నా కృతజ్ఞతలు. నేను ఈ రోజు డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ కష్ట సమయంలో నాకు తోడుగా నిలిచిన కుటుంబసభ్యులు, మిత్రులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా అమిర్‌ నాకోసం ఎంతో కష్టపడ్డాడు. నిద్రలేకుండా గడిపాడు. షూటింగ్‌లకు కూడా పోలేకపోయాడు’’ అని పేర్కొన్నారు. కాగా, 2016లో తెలుగు నటుడు ప్రదీప్‌ కుమార్‌తో ప్రేమలో పడ్డారు.

ఇద్దరూ 2017, ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజున పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే, వీరి కాపురం ఎక్కువ కాలం సజావుగా సాగలేదు. అనుకోని విధంగా ప్రదీప్‌ 2017 మే 17న హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. భర్త మరణం తర్వాత ఆమె తమిళ సీరియళ్లు, సినిమాలపై ఎక్కువ ఫోకస్‌ పెట్టారు. ఈ నేపథ్యంలోనే తమిళ కొరియోగ్రాఫర్‌ అమీర్‌ ఏడీఎస్‌తో ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారు.  మరి, మెడ నొప్పి కారణంగా పావని తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Pavni (@pavani9_reddy)

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetavrupabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş