iDreamPost
android-app
ios-app

ఆటో డ్రైవర్‌తో సీరియల్‌ నటి గొడవ.. మరీ ఇంత దారుణమా మేడమ్‌!

  • Published Sep 24, 2023 | 11:59 AM Updated Updated Sep 24, 2023 | 5:04 PM
  • Published Sep 24, 2023 | 11:59 AMUpdated Sep 24, 2023 | 5:04 PM
ఆటో డ్రైవర్‌తో సీరియల్‌ నటి గొడవ.. మరీ ఇంత దారుణమా మేడమ్‌!

ఓ సీరియల్‌ నటి ఆటో డ్రైవర్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించింది. అతడి ఆటోలో ఊరంతా తిరిగి.. అతడితోనే గొడవ పెట్టుకుంది. అంతటితో ఆగకుండా ఆటో ఛార్జీ చెల్లించకుండానే వెళ్లిపోయింది. సదరు ఆటో డ్రైవర్‌ ఆమె ప్రవర్తనతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటకలో ఆసల్యంగా వెలుగుచూసింది. ఆ వివరాల్లోకి వెళితే… నటి పద్మిని ‘పునర్‌ వివాహ్‌’ అనే సీరియల్‌ ద్వారా బుల్లి తెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా, ఆమె కర్ణాటక, మల్లేశ్వరంలోని మోర్గాసా రోడ్డునుంచి బనశంకర్‌ వెళ్లటానికి ఊబర్‌ ఆటో బుక్‌ చేసుకున్నారు.

మోర్గాసా రోడ్డులో ఆటో ఎక్కారు. ఆ ఆటో డ్రైవర్‌ పేరు కులదీప్‌. బనశంకర్‌ చేరుకుంటున్న సమయంలో ఆటో ట్రాఫిక్‌లో చిక్కుకుంది. దీంతో ఆ నటికి కోపం వచ్చింది. ‘నువ్వెందుకు ఈ రోడ్డులో తీసుకొచ్చావు. ట్రాఫిక్‌ చూడు ఎంత ఎక్కువగా ఉందో.. నువ్వు సరిగా డ్రైవింగ్‌ చేయటం లేదు’’ అంటూ అతడితో గొడవ పెట్టుకుంది. ఆలస్యం అవుతోంది అంటూ అతడ్ని నిందించటం మొదలుపెట్టింది. అంతటితో ఆగకుండా ఆటో డబ్బులు చెల్లించకుండానే ఆటో దిగి పోయింది. మరో ఆటో ఎక్కింది.

అయితే, కులదీప్‌ తన డబ్బు చెల్లించి మరో ఆటో ఎక్కమన్నాడు. ఇందుకు నటి ఒప్పుకోలేదు. ఆమె అతడికి 437 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా.. వాటిని ఇవ్వకుండానే వెళ్లిపోయింది. ఆ డ్రైవర్‌పై ఊబర్‌ వాళ్లకు ఫిర్యాదు కూడా చేసింది. అయితే, ఆమె తనతో గొడవ పడుతున్న దృశ్యాలను అతడు తన ఫోన్‌లో వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను తన సోషల్‌ మీడియా ఖాతాలో పెట్టాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. మరి, నటి పద్మిని ప్రవర్తనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş