iDreamPost
android-app
ios-app

Dalljiet Kaur: భర్తతో విభేదాలు.. పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకున్న నటి?

  • Published Feb 11, 2024 | 11:07 AM Updated Updated Feb 11, 2024 | 11:07 AM

ఓ నటి తన రెండో భర్తకు విడాకులు ఇచ్చినట్లుగా వార్తలు వైరల్ గా మారాయి. దానికి కారణం ఆమె తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయడమే.

ఓ నటి తన రెండో భర్తకు విడాకులు ఇచ్చినట్లుగా వార్తలు వైరల్ గా మారాయి. దానికి కారణం ఆమె తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయడమే.

Dalljiet Kaur: భర్తతో విభేదాలు.. పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకున్న నటి?

సాధారణంగా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు, పెళ్లిళ్లు, డేటింగ్, విడాకులు లాంటి విషయాలు సర్వసాధారణమైపోయాయి. ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా జంటలు విడిపోయి సింగిల్ గా బతుకుతున్నారు. ఇక మరికొందరు రెండో బంధంలోకి అడుగుపెట్టి లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నటి తన రెండో భర్తకు విడాకులు ఇచ్చినట్లు వార్తలు వైరల్ గా మారాయి. అందుకు కొన్ని కారణాలు కూడా వెల్లడిస్తున్నారు నెటిజన్లు. మరి ఆ నటి ఎవరు?

దల్జీత్ కౌర్.. బుల్లితెరపై ‘చూపులు కలిసిన శుభవేళ’ అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత నటిగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుంది ఈ బ్యూటీ. అయితే ఆమె సినీ కెరీర్ సాగినంత సజావుగా వైవాహిక జీవితం నడవలేదు. 2009లో నటుడు షాలిన్ బానోత్ ను వివాహం చేసుకున్న కౌర్.. ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో 2013లో విడాకులు తీసుకుంది. అప్పటికే వీరికి జైడన్ అనే కుమారుడు జన్మించాడు. అనంతరం కొన్నిరోజులు ఒంటరిగా జీవించిన దల్జీత్ కౌర్ కు దుబాయ్ లో జరిగిన ఫ్రెండ్స్ పార్టీలో నిఖిల్ పటేల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. కొన్నాళ్లు డేటింగ్ చేసి, గతేడాదే పెళ్లి చేసుకున్నారు.

కాగా.. నిఖిల్ పటేల్ కు గతంలోనే పెళ్లై ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత లండన్ లో సెటిల్ అయిన ఈ జంట ప్రస్తుతం విడిపోయారనే వార్తలు వైరల్ గా మారాయి. తన కొడుకు జైడన్ తో కలిసి దల్జీత్ కౌర్ ఇండియా వచ్చేసింది. అదీకాక తన సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలతో పాటుగా ఇన్ స్టా బయోలో పటేల్ అనే ఇంటిపేరును కూడా తొలగించింది. దీంతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు అనే వార్తలకు బలం చేకూరినట్లు అయ్యింది. ఇక ఇదే సమయంలో దల్జీత్ తన ఇన్ స్టాలో ఓ నోట్ షేర్ చేసింది. అయితే పెళ్లైన ఏడాదికే విడిపోవడం ఏంటని నెటిజన్లు షాకౌతున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Soapbox (@soapboxprelations)

ఇదికూడా చదవండి: ఆనంద్ లవ్ బ్రేకప్.. మూవీలోనే కాదు రియల్ లైఫ్ లో కూడా..!

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet Girişcasibom girişHoliganbet GirişOnwin GirişBetasus girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel