iDreamPost
android-app
ios-app

ప్రముఖ నటుడి ఇంటిని కొల్లగొట్టిన దొంగ!

నటుడు తన కుటుంబంతో కలిసి వేరే ఊరికి వెళ్లాడు. ఇంటికి వచ్చి చూసే సరికి తాళం పగులగొట్టి ఉంది. దీంతో వారు షాక్‌ అయ్యారు. ఇంట్లోకి వెళ్లి చూడగా.. బంగారంతో పాటు ఇతర విలువైన వస్తువులు కనిపించలేదు..

నటుడు తన కుటుంబంతో కలిసి వేరే ఊరికి వెళ్లాడు. ఇంటికి వచ్చి చూసే సరికి తాళం పగులగొట్టి ఉంది. దీంతో వారు షాక్‌ అయ్యారు. ఇంట్లోకి వెళ్లి చూడగా.. బంగారంతో పాటు ఇతర విలువైన వస్తువులు కనిపించలేదు..

ప్రముఖ నటుడి ఇంటిని కొల్లగొట్టిన దొంగ!

 ఈ మధ్య కాలంలో నగరాల్లో దొంగతనాలు బాగా పెరిగిపోయాయి. దొంగలు తెలివిమీరి పోయి ఎంతో చాకచక్యంగా దొంగతనాలు చేస్తున్నారు. పక్కా ప్లాన్‌తో చోరీలకు పాల్పడుతున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను లూటీ చేస్తున్నారు. విలువైన వస్తువుల్ని దొంగతనం చేస్తున్నారు. అయితే, కొన్నిసార్లు అనుకోని విధంగా పోలీసులకు పట్టుబడుతున్నారు. తాజాగా, ఓ ప్రముఖ నటుడి ఇంట్లో దొంగతనం చేసిన ఓ దొంగ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శబరి నాథన్‌కు తమిళనాట సీరియల్‌ నటుడిగా మంచి గుర్తింపు ఉంది. సీరియల్స్‌లోకి రాకముందు ఆయన పలు షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించారు. వేలక్కారన్‌ అనే సీరియల్‌తో బుల్లి తెర ఎంట్రీ ఇచ్చారు. భారతీ కన్నమ్మాతో తమినాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు! పలు టీవీ ఛాన‍ళ్లలో ఫన్నీ టీవీ షోలు కూడా చేశారు. ప్రస్తుతం విజయ్‌ టీవీలో ‘‘ పొన్ని’’ అనే సీరియల్‌లో నటిస్తున్నారు.

Robbery in the house of a famous actor!

శబరికి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన తన కుటుంబంతో కలిసి సేల కోరిమేడు సమీపంలోని బృందావనం గార్డెన్‌ ఏరియాలో ఉంటున్నారు. గత నెల 23వ తేదీ శబరినాథన్‌ చిన్నాన్న చనిపోయాడు. దీంతో అంత్యక్రియల కోసం శబరి కుటుంబం ఇంటికి తాళం వేసి పనమరుత్తుపట్టికి వెళ్లింది. మరుసటి రోజు 24వ తేదీన ఇంటిక వచ్చింది. వాళ్లు ఇంటికి వచ్చే సమయానికి తాళం పగుటగొట్టి.. తలుపు బార్లా తెరిచి ఉన్నాయి. దీంతో వారు షాక్‌ తిన్నారు. తమ ఇంట్లో దొంగలు పడ్డట్టు గుర్తించారు.

ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా.. లక్ష రూపాయల నగదు.. 5 గోల్డ్‌ కాయిన్స్‌.. కొన్ని వెండి వస్తువులు కనిపించలేదు. వాటిని దొంగలే ఎత్తుకెళ్లి ఉంటారని గ్రహించారు. ఆలస్యం చేయకుండా అలగాపురం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. ఇంట్లో జరిగిన దొంగతనంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగల కోసం అన్వేషణ ప్రారంభించారు. పోలీసుల విచారణలో అసలు దొంగ ఎవరో తెలియవచ్చింది. ధర్మపురికి చెందిన మణికందన్‌ దొంగతనం చేసినట్లు తేలింది.

పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. సెంట్రల్‌ జైలుకు పంపారు. అయితే, మణికందన్‌ దొంగతనం చేసిన వస్తువులు దొరికాయా? లేదా? అన్న దానిపై ఓ క్లారిటీ రాలేదు. శబరి నాథన్‌ ఇంట్లో దొంగతనం జరిగిన విషయం కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏది ఏమైనప్పటికి.. ఇళ్లు విడిచి దూరం వెళుతున్నపుడు తాళం వేయటంతో పాటు.. పోలీసులకు సమాచారం ఇవ్వటం అన్నది మంచి పని. లేదంటే చోరీలు జరుగుతూ ఉంటాయి. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.