iDreamPost
android-app
ios-app

నా స్నేహితులు కూడా అదే మాట చెప్పారు.. అందుకే విడాకులు: బుల్లితెర నటుడు

  • Published Feb 29, 2024 | 8:40 AM Updated Updated Feb 29, 2024 | 8:40 AM

ఇండస్ట్రీలో ఈ మధ్య పెళ్లిళ్లు మూణాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. తాజాాగా మరో బుల్లితెర జంట కూడా విడాకులు తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకి ఎవరంటే..

ఇండస్ట్రీలో ఈ మధ్య పెళ్లిళ్లు మూణాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. తాజాాగా మరో బుల్లితెర జంట కూడా విడాకులు తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకి ఎవరంటే..

  • Published Feb 29, 2024 | 8:40 AMUpdated Feb 29, 2024 | 8:40 AM
నా స్నేహితులు కూడా అదే మాట చెప్పారు.. అందుకే విడాకులు: బుల్లితెర నటుడు

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య పెళ్లిళ్లు మూణాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. ఈ క్రమంలోనే అటూ వెండితెర నుంచి బుల్లితెర వరకు ఎక్కడ చూసిన విడాకులు తీసుకున్న సెలబ్రీటి జంటలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఇలా ఇండస్ట్రీలో చాలామంది నటులు విడాకులు తీసుకోవడం ఇటీవల కాలంలో ప్యాషన్ అయిపోయింది. మొదట ప్రేమించికొని, కొన్నాళ్లు సహజీవనం చేసి.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ఎంతో అట్టాహాసంగా పెళ్లి చేసుకుంటారు. అంతా బాగానే ఉన్నారు అనుకొనే సమయంలో.. ఏం జరుగుతుందో తెలియదు కానీ, సరిగ్గా పెళ్లైన కొన్నాళ్లకే లేనిపోని మనస్పర్ధలతో విడాకులంటూ కోర్టు గుమ్మం ఎక్కుతారు. అయితే ,తాజాగా మరో బుల్లితెర జంట కూడా విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంతకి ఎవరంటే..

సెలబ్రీటిస్ కు ఇటీవల కాలంలో ప్రేమ, పెళ్లి, విడాకులనేవి కామన్ అయిపోయాయి.ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న జంట కలకాలం కలిసుండాలని పెద్దలు, అతిథులు దీవించి అక్షింతు వేస్తారు. కానీ ఆ వైవాహిక బంధం మూడేళ్లకే చెదిరిపోతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బుల్లితెర జంట అభిషేక్ మాలిక్, సుహాని చౌదరి కూడా ఈ కోవకు చెందినవారే.తాజాగా తాము ఇద్దరం వీడిపోయామంటూ నటుడు అభిషేక్ వెల్లడించాడు. అయితే ఈ విడాకులకు కారణం తమ మధ్య అంత సఖ్యత లేకపోవడం వలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అభిషేక్ తెలిపాడు.ఇక ఈ విషయం మై అభిషేక్ మాట్లాడుతూ.. ‘మా ఇద్దరి మనస్వత్వాలు వేరు, అలాగే తామిద్దరం ఒకరిని ఒకరం అర్ధం చేసుకోలేకపోయాం. ఇక మా మధ్య ఏదో కనెక్షన్ మిస్ అవుతుంది. దీని గురించి ఇద్దరం చర్చించుకున్నాం. అప్పుడు.. విడాకులు తీసుకుంటేనే ఇద్దరం సంతోషంగా ఉండగలమని నిర్ణయించుకున్నాం. కలిసి బంధాన్ని కొనసాగించాలంటే ఇద్దరి మధ్య అంత సఖ్యత కనిపించట్లేదు. అందుకే బలవంతగా కలిసి బంధాన్ని కొనసాగించి జీవితాలను నాశనం చేసుకోవడం ఎందుకని, విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం.

ఇప్పుడు నేను నా వర్క్ తో నేను చాలా బిజీగా ఉంటున్నాను. ఇక తాను కూడా ఏవేవో కలలు కంటోంది. పైగా తను ముంబైకి కొత్త. ఇక్కడ తనకు పెద్దగా స్నేహితులు కూడా లేరు. నా మిత్రులు మాత్రమే తనకు తెలుసు. ఇండస్ట్రీకి చెందిన నా స్నేహితులు తనను ఎంతో ఇష్టపడతారు. వాళ్లు తనకి మంచి ప్రేండ్స్ కూడా. ఇక నా ప్రేండ్స్ కూడా నేను నా భార్యతో ఎక్కువ సమయం కేటాయించడం లేదని అనేవారు. ఆ మాట నాకు బలంగా గుచ్చుకుంది. అది కాస్తా ఇంతవరకు వచ్చింది. అందుకే ఈ విడాకుల కోసం ధరఖాస్తు చేశాం’ అంటూ అభిషేక్ చెప్పుకొచ్చాడు.

కాగా, అభిషేక్, సుహానీ తొమ్మిది నెలల పాటు డేటింగ్ చేసి ఆ తర్వాత 2021లో పెళ్లి చేసుకున్నారు. కానీ ఇలా మూడేళ్లకే విడాకులు తీసుకోవడంతో వీరి అభిమానులు చాలా బాధా పడుతున్నారు. ఇక అభిషేక్ మాలిక్.. ‘ఛల్ షే ఔర్ మాత్’ అనే సీరియల్ తో 2012లో బుల్లితెర పై అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే ‘ఏక్ వివాహ్ ఐసా బీ’, ‘భాగ్యలక్ష్మీ, యే హై మొహబ్బతే’, ‘కుంకుమ్ భాగ్య’ వంటి సీరియల్స్ తో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా, సుహాని చౌదరి మోడల్ గా రాణిస్తోంది. మరి, ప్రేమించి పెళ్లి చేసుకొని మూడేళ్లకే ఇలా విడాకులు తీసుకున్న జంట పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss