iDreamPost
android-app
ios-app

OTTలోకి ట్రూ ల‌వ‌ర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

  • Published Mar 13, 2024 | 8:56 AM Updated Updated Mar 14, 2024 | 3:56 PM

యూత్ అటెన్షన్‌ను సంపాదించిన తమిళ్ డబ్బింగ్ హిట్ మూవీ ట్రూ లవర్ మరి కొన్ని రోజుల్లో ఓటీటీలో సందడి చేయనుంది. ఇంతకి ఎక్కడంటే..

యూత్ అటెన్షన్‌ను సంపాదించిన తమిళ్ డబ్బింగ్ హిట్ మూవీ ట్రూ లవర్ మరి కొన్ని రోజుల్లో ఓటీటీలో సందడి చేయనుంది. ఇంతకి ఎక్కడంటే..

  • Published Mar 13, 2024 | 8:56 AMUpdated Mar 14, 2024 | 3:56 PM
OTTలోకి ట్రూ ల‌వ‌ర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

ఈ మధ్యకాలంలో సినీ ప్రేక్షకులు భాష ఏదైనా సరే మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎక్కువగా అదరిస్తున్నారు. ముఖ్యంగా వాటికి ఏ విధమైనా ప్రమోషన్స్ లేకపోయినా మంచి హిట్ ను అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే.. చిన్న తరహా సినిమాలు సైతం థియేటర్లలో విడుదలై భారీ సక్సెస్ ను అందకోవడంతో పాటు ఓటీటీలో కూడా దూసుకుపోతున్నాయి. మరి అలాంటి సినిమాల్లో యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే సినిమాలైతే ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక అలాంటి కేటగిరికి చెందిన సినిమాల్లో ‘ట్రూ లవర్’ కూడా ఒకటి. ఈ సినిమా తమిళంలో ‘లవర్’ అని తెలుగులో ట్రూ లవర్ అనే టైటిల్ తో రిలీజ్ అయ్యింది. ఇందులో తమిళ నటుడు మణికందన్ ప్రధాన పాత్రలో నటించాడు. కాగా, ఈ సినిమా తమిళ్ డబ్బింగ్ తో థియేటర్లలో విడుదలైన ప్రేక్షకులను బాగా ఆకట్టున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ఓటీటీలో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇంతకి ఎక్కడంటే..

కోలీవుడ్ నటుడు మణికందన్ హీరోగా తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సినిమా ‘ట్రూ లవర్’. ఈ సినిమాను ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించగా.. ఇందులో తెలుగమ్మాయి శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా నటించింది. కాగా, ఈ సినిమా గత నెల ఫిబ్రవరి 4న తమిళ్ లో విడుదలై చేయగా.. తెలుగులో మాత్రం ఫిబ్రవరి 10న రిలీజ్ చేశారు. ఇక అతి తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా థియేటర్లలో మాత్రం మంచి విజయాన్ని సాధించిదనే చెప్పవచ్చు. అంతాలా హిట్ టాక్ ను సంపాదించుకున్న ఈ ట్రూ లవర్ మూవీ గత కొన్ని రోజులుగా ఓటీటీలోకి రాబోతుందనే వార్త జోరుగా వినిపిస్తోంది. కానీ దాని పై అధికారణ ప్రకటన రాకపోవడంతో ఓటీటీ లవర్స్ కు నిరాశే మిగిలింది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై మాత్రం అఫీషియల్ డేట్ ను అనౌన్స్ చేశారు. ట్రూ లవర్ మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ హక్కులకు కొనుగొలు చేసుకుంది. కాగా, ఈ సినిమా ఈనెల అనగా మార్చి 27నుంచి తమిళం, తెలుగుతో పాటు ఇతర భాషల్లో స్ట్రీమింగ్ కు అందుబాటులో రానుంది. ఇక తమిళ్ లో అతి చిన్న సినిమాగా థియేటర్ లో విడుదలైన లవర్ సినిమా 25 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కాగా, ఈ సినిమాను తెలుగులో ట్రూ లవర్ పేరుతో డైరెక్ట‌ర్ మారుతి, బేబీ ప్రొడ్యూస‌ర్ ఎస్‌కేఎన్ రిలీజ్ చేశారు. అయితే తెలుగులో టీజ‌ర్‌, ట్రైల‌ర్స్‌తో ట్రూ ల‌వ‌ర్ మూవీ ఆడియెన్స్‌లో ఆస‌క్తిని రేకెత్తించింది. ఓపెనింగ్స్ బాగానే వ‌చ్చిన అదే టైమ్‌లో ర‌వితేజ ఈగ‌ల్‌, ర‌జ‌నీకాంత్ లాల్‌స‌లామ్ రిలీజ్ కావ‌డంతో ఈ సినిమా క‌లెక్ష‌న్స్‌పై ఎఫెక్ట్ ప‌డింది. తెలుగు వెర్ష‌న్ మొత్తం రెండు కోట్ల లోపే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

true lover movie in ott

ఇక ట్రూ లవర్ కథ విషయానికొస్తే.. ప్రేమ విష‌యంలో యువ‌త‌రం ఆలోచ‌న‌లు, అభిప్రాయాలు ఎలా ఉంటున్నాయ‌నే పాయింట్‌తో తెరకెక్కిన సినిమానే ట్రూ లవర్. ఇందులో.. హీరో అరుణ్ ను (మ‌ణికంద‌న్‌) హీరోయిన్ దివ్య (శ్రీగౌరిప్రియ‌) ప్రాణంగా ప్రేమిస్తుంది . కానీ, అరుణ్ మాత్రం దివ్య‌ను ప్ర‌తి విష‌యంలో అనుమానిస్తుంటాడు . ఆమె మ‌రొక‌రితో క్లోజ్‌గా మాట్లాడినా స‌హించ‌లేడు. అరుణ్ అనుమానాలు, ప్ర‌వ‌ర్త‌న‌తో విసిగిపోయిన దివ్య అత‌డికి బ్రేక‌ప్ చెప్పాల‌ని చాలా సార్లు అనుకుంటుంది. కానీ, అరుణ్ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌గానే క‌రిగిపోతుంది.ఇక దివ్య త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసిఓ టూర్‌కు వెళుతుంది. అనుకోని ప‌రిస్థితుల్లో ఆమె వెంట అరుణ్ కూడా టూర్ వ‌స్తాడు. అక్క‌డ ఏమైంది? అరుణ్‌లో మార్పు వ‌చ్చిందా? దివ్య ప్రేమ‌ను అర్థం చేసుకున్నాడా? లేదా? అనేది తెలియాలంటే ట్రూ లవర్ ఓటీటీలో చూసేయాల్సిందే. మరి, ఇంకొన్ని రోజుల్లో ఓటీటీలో రిలీజ్ కాబోతున్న ట్రూ లవర్ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap