iDreamPost
android-app
ios-app

కొత్త కారు కొన్న జబర్దస్త్ అవినాష్! కామెంట్స్ లో ఆటాడుకుంటున్న నెటిజన్స్!

  • Author ajaykrishna Published - 12:31 PM, Mon - 24 July 23
  • Author ajaykrishna Published - 12:31 PM, Mon - 24 July 23
కొత్త కారు కొన్న జబర్దస్త్ అవినాష్! కామెంట్స్ లో ఆటాడుకుంటున్న నెటిజన్స్!

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయినవారిలో ముక్కు అవినాష్ ఒకరు. మిమిక్రి చేసుకుంటూ కామెడీ పండించి తనకంటూ ఓ శైలి ఏర్పరచుకున్నాడు. దాంతో పాటు మరిన్ని షోస్, సినిమాలలో అవకాశాలు ఇలా బాగానే దూసుకుపోతున్నాడు అవినాష్. అదిగాక పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కూడా అయిపోయాడు. అయితే.. జబర్దస్త్ తర్వాత బిగ్ బాస్ లో అడుగుపెట్టిన అవినాష్.. టీవీ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చినా.. హౌస్ లో అవినాష్ చివరి దాక ఉండటం విశేషం. ఇక అదే షోలో పెద్ద మొత్తంలో సంపాదించుకున్నాడట. బయటికి వచ్చాక తన అప్పులన్నీ తీర్చేసి.. టీవీ షోస్ లో బిజీ అయిపోయాడు.

ఇక అప్పుడప్పుడు సినిమాలలో మెరుస్తూ.. చిన్న చిన్న క్యారెక్టర్స్ తో ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు తన టాలెంట్ ని రెగ్యులర్ గా సోషల్ మీడియాలోను ప్రదర్శిస్తూ ఉంటాడు. అవినాష్ కి సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఉన్న సంగతి తెలిసిందే. తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి వ్లాగ్స్ లేదా ఏవైనా ఫ్యామిలీ ప్రోగ్రాంస్ ఉంటే వీడియోస్ పోస్ట్ చేస్తుంటాడు. అయితే.. ఆ మధ్య అవినాష్ తన తల్లికి ఆరోగ్యం బాలేదని.. హాస్పిటల్ లో చేరిందని ఓ వీడియో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో చూసి కొంతమంది వాళ్ళమ్మ త్వరగా కోలుకోవాలని విష్ చేయగా.. సోషల్ మీడియాలో కొందరు ఇలాంటి వీడియోలు కూడా పెడతారా అని కామెంట్ చేశారు.

ఈ క్రమంలో మరోసారి అలాంటి పనే చేసి ట్రోల్స్ కి గురవుతున్నాడు అవినాష్. కొత్తగా కారు కొన్నాను అంటూ.. తన భార్యతో కలిసి ఓ పిక్ పోస్ట్ చేశాడు. కారు కొన్నప్పుడు ఎవరికైనా ఆనందం ఉంటుంది. ఆ ఆనందంలో ఫ్యాన్స్ తో విషయాన్నీ షేర్ చేసుకుంటూ అవినాష్ తన న్యూ కార్ ఫోటో పోస్ట్ చేశాడు. ఆ కారు విలువ దాదాపు రూ. 25 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే.. మొన్నే కదా అమ్మకి బాలేదని.. హాస్పిటల్ లో చేరిందంటూ వీడియో తీసి పెట్టావు.. ఇంతలోనే ఈ కారు ఎలా కొన్నావ్? అమ్మ పరిస్థితి అలా ఉండగా కొత్తగా కాస్ట్లీ కారు అవసరమా? అంటూ అవినాష్ ని కామెంట్స్ లో ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. మరి అవినాష్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Mukku Avinash (@jabardasth_avinash)

Jojobet GirişmeritbetmeritbetholiganbetPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler