iDreamPost
android-app
ios-app

ప్రభాస్ లుక్స్ పై ట్రోలింగ్స్.. ? కారణం అదేనా..!

  • Published Oct 23, 2024 | 12:05 PM Updated Updated Oct 23, 2024 | 5:59 PM

Trolling on prabhas looks: రెబలోడి బర్త్ డే హడావిడి మాములుగా లేదు. రీరిలీజ్ అయినా సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. రీసెంట్ గా బర్త్ డే సందర్బంగా ఓ పోస్టర్ ను కూడా రివీల్ చేశారు . అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ లుక్స్ మీద ట్రోలింగ్స్ మొదలయ్యాయి. అదేంటో చూసేద్దాం.

Trolling on prabhas looks: రెబలోడి బర్త్ డే హడావిడి మాములుగా లేదు. రీరిలీజ్ అయినా సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. రీసెంట్ గా బర్త్ డే సందర్బంగా ఓ పోస్టర్ ను కూడా రివీల్ చేశారు . అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ లుక్స్ మీద ట్రోలింగ్స్ మొదలయ్యాయి. అదేంటో చూసేద్దాం.

  • Published Oct 23, 2024 | 12:05 PMUpdated Oct 23, 2024 | 5:59 PM
ప్రభాస్ లుక్స్ పై ట్రోలింగ్స్.. ? కారణం అదేనా..!

ఓ స్టార్ హీరో స్థాయిని బాక్స్ ఆఫీస్ నిర్ణయినిస్తుంది. సినిమా హిట్ కొట్టాడు అనే దానితో పాటు ఎన్ని వందల కోట్లు రాబట్టాడు.. దాని మీద నిర్మాతలు ఎంత పెట్టుబడి పెట్టాలనేదే మెయిన్ కాన్సెప్ట్. దాదాపు నిర్మాతలంతా ఇలానే లెక్కలు వేస్తూ ఉంటారు. కానీ ఇలా లెక్కలు వేయకుండా ఎంత ఖర్చు చేసిన పర్లేదు.. దానికి డబుల్ వస్తుందనే ధీమా కలిగితే మాత్రం.. వారి వెనుక ప్రభాస్ ఉన్నట్లే. ఇండియన్ మూవీ స్టాండర్డ్ ను పెంచిన హీరో ప్రభాస్. వందల కాదు వేల కోట్ల రికార్డ్స్ ను సైలెంట్ గా ఖాతాలో వేసుకుంటాడు. టాలీవుడ్ స్థాయిని ఆకాశానికి పైనే కుర్చోపెడతాడని ఎవరు ఊహించి ఉండరు. ఇక ప్రభాస్ బర్త్ డే సంధర్బంగా.. రీసెంట్ గా నటిస్తున్న రాజాసాబ్ సినిమా నుంచి ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీనితో ఫ్యాన్స్ అంత ఫుల్ ఖుషి అయిపోయారు. ఇది మరో మిర్చి అంటూ.. 2000 కోట్ల పోస్టర్ అది కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అంతా కూల్ గా ఉందనుకునే టైం లో రచ్చ మొదలైంది.

 రెబల్ స్టార్ ను మొన్నీమధ్యన ఒకరు జోకర్ అన్నారు.. కానీ తప్పు తెల్సుకున్నాని తన ఉద్దేశం అది కాదని ఫ్యాన్స్ ని ములగచెట్టు ఎక్కించారు. ఎవరేమన్నా కాదన్న రెబలోడు పాన్ ఇండియా కింగ్.. ఒకటి కాదు రెండు కాదు 5 పాన్ ఇండియా హిట్స్ కొట్టి బాక్స్ ఆఫీస్ కు మొగుడై కూర్చున్నాడు. బాలీవుడ్ మార్కెట్ కు సైతం మెయిన్ పిల్లర్ అయ్యాడు . ఇదే అక్కడ ఖాన్ లు కపూర్ లు తట్టుకోలేకపోతున్నారేమో. అందుకే టాలీవుడ్ నుంచి ఏ పాన్ ఇండియా సినిమా వచ్చినా కానీ.. ట్రోల్ల్స్ చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో ఆ ట్రోల్స్ కు తగిన కౌంటర్స్ కూడా పడుతూనే ఉంటాయి. అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరోసారి వారి అసూయా  బయట పడింది. రాజాసాబ్ మూవీ లో రెబెల్ స్టార్ లుక్ మీద బురద చల్లుతున్నారు.  ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రభాస్ లుక్ మార్చారంటూ.. కల్కి సినిమాలో కాస్త బొద్దుగా ఉన్న ప్రభాస్ అంతలోనే ఇంత స్లిమ్ అయ్యాడా అంటూ కుళ్లుతో కామెంట్ చేస్తున్నారు.

నార్మల్ గా ప్రభాస్ అసలు కాంట్రవర్సీల జోలికి వెళ్లడు. అందుకే అందరి డార్లింగ్ అయ్యాడు. మిగిలిన హీరోల ఫ్యాన్స్ కూడా ఎలాంటి డౌట్స్ లేకుండా ఇష్టపడే కట్ అవుట్ అది . సో టాలీవుడ్ లో ప్రభాస్ ను నెగెటివ్ గా కామెంట్ చేసే సాహసం ఎవరు చేయరు. కాబట్టి ఇది కచ్చితంగా బాలీవుడ్ లో టాలీవుడ్ హీరోల ఎదుగుదల ఓర్వలేని బ్యాచ్ దే. మరి అభిమానులు ఊరికే ఊరుకుంటారా .. ఆ కామెంట్స్ కు తగినట్లు రిప్లయ్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందో తెలియనిది కాదు.. బడా కట్ అవుట్ లే దుకాణం సర్దేస్తున్నాయి. అయినా సరే ఇలాంటి కామెంట్స్ మాత్రం తగ్గడం లేదు. నిజానికి ప్రభాస్ ఈ సినిమా కోసం సన్నబడ్డాడు. కల్కి టైం లో కాస్త గ్యాప్ వచ్చిన సమయంలో జరిగిన మూవీ షూటింగ్ నుంచి .. ఈ లుక్స్ ని రివీల్ చేశారు. సినిమాలో ప్రభాస్ మూడు క్యారెక్టర్స్ లో కనిపించనున్నారట. సో దానికి తగినట్లే లుక్స్ ను చేంజ్ చేస్తున్నారు వస్తున్నారు. బహుశా దానిని AI ఎఫెక్ట్ అని భావించినట్లున్నారు ట్రోలర్స్. ఏదేమైనా డార్లింగ్ రేంజ్ మాత్రం ఎప్పటికి తగ్గదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletpusulabetpusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Girişmarsbahis