iDreamPost
android-app
ios-app

మేకప్ ఆర్టిస్ట్‌ని పెళ్లి చేసుకున్న హీరో.. ఆంటీలా ఉందంటూ ట్రోలింగ్..

  • Published Apr 18, 2024 | 9:27 PM Updated Updated Apr 18, 2024 | 9:27 PM

ప్రేమకి, పెళ్ళికి ఎత్తు, రంగు వంటి వాటితో పని లేదు. గట్టిగా మాట్లాడితే ఇప్పుడు వయసుతో కూడా పని లేదని అంటున్నారు. అయితే ఓ హీరో ఆంటీని పెళ్లి చేసుకున్నాడంటూ ట్రోల్ చేస్తున్నారు.

ప్రేమకి, పెళ్ళికి ఎత్తు, రంగు వంటి వాటితో పని లేదు. గట్టిగా మాట్లాడితే ఇప్పుడు వయసుతో కూడా పని లేదని అంటున్నారు. అయితే ఓ హీరో ఆంటీని పెళ్లి చేసుకున్నాడంటూ ట్రోల్ చేస్తున్నారు.

  • Published Apr 18, 2024 | 9:27 PMUpdated Apr 18, 2024 | 9:27 PM
మేకప్ ఆర్టిస్ట్‌ని పెళ్లి చేసుకున్న హీరో.. ఆంటీలా ఉందంటూ ట్రోలింగ్..

ఆంటీ.. ఈ పదానికి ఒక నేపథ్యం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంటీ అంటే ఒక ఎమోషన్. ఆడవారికి ఆంటీ వయసొచ్చినా సరే ఆంటీ అని పిలిపించుకోవాలంటే ఇష్టం ఉండదు అనేది చాలా మంది అభిప్రాయపడతారు. పెళ్ళైన వారిని ఆంటీ అని పిలిచే కల్చర్ ఎప్పుడూ ఉండేదే. కానీ అప్పుడే పెళ్లి చేసుకున్న అమ్మాయిని కూడా ఆంటీ అంటే ఆ అమ్మాయి ఎలా తట్టుకోగలదు చెప్పండి. అందులోనూ ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేరు. తాజాగా ఓ హీరో పెళ్లి చేసుకున్న అమ్మాయి విషయంలో అదే జరిగింది. ఆమె ఒక మేకప్ ఆర్టిస్ట్. సెలబ్రిటీలకు మేకప్ వేస్తుంటుంది. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా హీరో. ప్రేమకు రంగు, హైటు, వెయిటు వంటి వాటితో పని లేదు. అలానే పెళ్ళికి కూడా. మనసులు ఒకటైతే చాలనుకుంటారు.

కానీ కొంతమంది ఉంటారు.. జోడీ బాలేదని.. అమ్మాయి హైట్ తక్కువని.. అబ్బాయి కలర్ తక్కువని కామెంట్స్ చేస్తుంటారు. కలిసుండేది వీళ్ళిద్దరూ.. హీరో, హీరోయిన్ కి లేని నొప్పి ఆడియన్స్ కేంటో అర్ధం కాదు. కాల ప్రవాహంలో మారని సమాజం తీరు ఇంతే. పాపం ఈ విషయం తెలియక హీరో గారి నూతన వధువు తెగ ఫీలైపోయింది. ఒకప్పుడు హీరోగా పలు సినిమాల్లో నటించిన విరాట్ ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తున్నాడు. ఇతను కన్నడ నటుడు. తమిళంలో కొన్ని సీరియల్స్ లో నటించాడు. పలు రియాలిటీ షోస్ లో కూడా పార్టిసిపేట్ చేశాడు. అయితే ఇవాళ అంటే ఏప్రిల్ 18న తన ప్రేయసి నవీన శివాజీ అనే మేకప్ ఆర్టిస్ట్ ని పెళ్లి చేసుకున్నాడు. తమిళనాడులోని మహాబలిపురంలో వీరి పెళ్లి జరిగింది.

 

View this post on Instagram

 

A post shared by Mugdha WHOLESALE SILKS (@mugdha_chennai_wholesale)

నవీన సెలబ్రిటీలకు మేకప్ వేస్తుంటుంది. ఇద్దరూ ప్రేమించుకోవడంతో పెళ్లితో ఒకటయ్యారు. అయితే ఈ పెళ్ళిలో పుట్టింటి వారికి దూరమవుతున్నందుకు ఆమె పెళ్లి పీటలపై కన్నీళ్లు పెట్టుకుంది. అది చూసి విరాట్ ఆమెను ఓదారుస్తూ ఆప్యాయంగా ముద్దు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా అది చూసిన నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. ఆంటీని పెళ్లి చేసుకున్నావేంటి విరాట్.. ఆమె బాలేదు.. ఆంటీలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరూ అబ్బాయిల్లానే ఉన్నారు.. ఆమె లావుగా ఉందని అంటున్నారు. అయితే కొంతమంది మాత్రం.. శుభమా అని పెళ్లి చేసుకుంటే మీ గోల ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొత్తగా పెళ్లి అయిన వారిని ఆశీర్వదించాల్సింది పోయి ఇలా విమర్శిస్తారేంటి అంటూ సీరియస్ అవుతున్నారు. ఇంకొంతమంది అయితే మేకప్ ఆర్టిస్ట్ ని పెళ్లి చేసుకున్నాడని చులకనగా మాట్లాడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomjojobetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş