iDreamPost
android-app
ios-app

చంద్రయాన్‌ 3 సక్సెస్‌.. ప్రకాశ్‌ రాజ్‌ని దిష్టిబొమ్మతో పోలుస్తున్న నెటిజన్లు!

  • Published Aug 24, 2023 | 11:57 AM Updated Updated Aug 24, 2023 | 11:59 AM
  • Published Aug 24, 2023 | 11:57 AMUpdated Aug 24, 2023 | 11:59 AM
చంద్రయాన్‌ 3 సక్సెస్‌.. ప్రకాశ్‌ రాజ్‌ని దిష్టిబొమ్మతో పోలుస్తున్న నెటిజన్లు!

విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ గత కొద్ది ఏళ్లుగా వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. బీజేపీకి వ్యతిరేకంగా ఆయన సోషల్‌ మీడియా వేదికగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీపై ఆరోపణలు చేస్తూ ఆయన చాలా పోస్టులు పెట్టారు.. పెడుతూనే ఉన్నారు. తాజాగా, ఆయన కన్ను దేశం మొత్తం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే చంద్రయాన్‌ -3పై పడింది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగంపై ఆయన తన సోషల్‌ మీడియా వేదికగా వ్యంగ్యమైన పోస్టు పెట్టారు. ఆ పోస్టు కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి, ఆయనపైకే బ్యాక్‌ ఫైర్‌ అయింది.

సోషల్‌ మీడియాలో ఆయనపై నెటిజన్లు యుద్ధాన్నే ప్రకటించారు. చంద్రయాన్‌ 3 సక్సెస్‌ కావటంతో ఇప్పుడు ఆయనపై మరోసారి ట్రోలింగ్స్‌ మొదలయ్యాయి. ‍నిన్న చంద్రయాన్‌ 3 ల్యాండింగ్‌ సూపర్‌ సక్సెస్‌ అయింది. చంద్రుడిపైకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే చంద్రయాన్‌ 3పై కొద్దిరోజుల క్రితం కామెంట్లు చేసిన ప్రకాశ్‌ రాజ్‌పై సోషల్‌ మీడియా వ్యాప్తంగా ట్రోలింగ్స్‌ మొదలయ్యాయ. నెటిజన్లు ఆయన్ని దారుణంగా ఆడేసుకుంటున్నారు.

మీమ్స్‌తో ప్రకాశ్‌ రాజ్‌పై విరుచుకుపడుతున్నారు. ఒక్కడు సినిమాలో ప్రకాశ్‌ రాజ్‌ బురదలో పడే సీన్‌కు సంబంధించిన షాట్‌ను వాడేసుకున్నారు. ప్రకాశ్‌ రాజ్‌ చంద్రుడిపై బురదతో ఉన్నట్లు క్రియేట్‌ చేసి తెగ వైరల్‌ చేస్తున్నారు. అంతేకాదు! విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై తీసిన ఫొటో ఇదే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘‘  విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై అడుగుపెట్టిన వెంటనే తీసిన ఫొటో ఇదే..’’.. ‘‘ ప్రకాశ్‌ యాన్‌ – 3’’ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరి, చంద్రయాన్‌ 3పై వ్యంగ్యమైన పోస్టు పెట్టి విమర్శలు ఎదుర్కొంటున్న ప్రకాశ్‌రాజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş