iDreamPost
android-app
ios-app

వరుస ప్రాజెక్టులతో బిజీగా త్రిష.. ఏకంగా 4 ఇండస్ట్రీలలో..!

  • Published Feb 06, 2024 | 6:17 PM Updated Updated Feb 06, 2024 | 6:17 PM

Trisha is busy with 4 projects: సినీ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా వరుస సినిమాలతో స్టార్ హీరోల సరసన నటిస్తూ తనదైన మార్క్ చాటుకుంటుంది నటి త్రిష. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన త్రిష ఏకంగా నాలుగు భాషల్లో నటిస్తూ బీజీగా ఉంది.

Trisha is busy with 4 projects: సినీ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా వరుస సినిమాలతో స్టార్ హీరోల సరసన నటిస్తూ తనదైన మార్క్ చాటుకుంటుంది నటి త్రిష. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన త్రిష ఏకంగా నాలుగు భాషల్లో నటిస్తూ బీజీగా ఉంది.

  • Published Feb 06, 2024 | 6:17 PMUpdated Feb 06, 2024 | 6:17 PM
వరుస ప్రాజెక్టులతో బిజీగా త్రిష.. ఏకంగా 4 ఇండస్ట్రీలలో..!

తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ నటించిన ‘వర్షం’మూవీతో పాపులారిటీ తెచ్చుకున్న నటి త్రిష. సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ అప్ కమింగ్ హీరోయిన్స్ తో పోటీ పడుతూ అదరగొడుతుంది.   ఆ మధ్య ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించడంతో ఈ అమ్మడికి కాస్త ఎదురు దెబ్బ తగిలింది. ఒకదశలో ఏ టాప్ బ్యానర్ తోనూ, ఏ స్టార్ హీరో చిత్రానికి ఆమె సంతకం చేయలేదు. ఆ సమయంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్స్ లో ప్రధాన పాత్రలో నటించి మరోసారి అందరి దృష్టి ఆకర్శించింది. ఈ క్రమంలోనే ఈ అమ్మడికి పెద్ద బ్యానర్స్, స్టార్ హీరో సరసన ఛాన్స్ లు వచ్చాయి. త్రిష నటించబోయే చిత్రాల గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

త్రిష కృష్ణన్ అలియాస్ త్రిష.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా’ అంటూ వర్షం చిత్రంలో కుర్రాళ్లను గిలిగింతలు పెట్టింది. మిస్ చెన్నైగా ఎంపికైన తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొంది… తర్వాత మిస్ బ్యూటీఫుల్ స్మైల్ గా ఎంపికైంది. 1999 లో జోడి మూవీలో చిన్న పాత్రలో కనిపించింది. 2002లో సూర్య నటించిన ‘మౌనం పెసియాదే ’ మూవీ, 2003లో విక్రమ్ నటించిన ‘సామి’ త్రిషకు మంచి పేరు తెచ్చాయి. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. నాలుగు పదుల వయసులో అందంగా తయారవుతూ.. నేటికీ కుర్ర హీరోయిన్లకు పోటీగా వస్తుంది. మణిరత్నం దర్శకల్వంలో వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్’, స్టార్ హీరో విజయ్ గ్యాంగ్ స్టర్ డ్రామా ‘లియో’ బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి నిర్మాతలను తను వెంటపడేలా చేసింది.

ఇప్పుడు ఈ అమ్మడి చేతి నిండా సినిమాలు ఉన్నాయి. వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’, మగిల్ తిరుమేని దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా ‘విడాముయార్చి’ మూవీ, స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న ‘థగ్ లైఫ్’, విష్ణు వర్ధన్ దర్శకత్వంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటస్తున్న ‘ద బుల్’, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న ‘రామ్’ మూవీలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. అప్ కమింగ్ హీరోయిన్లకు పోటీగా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా త్రిష స్టార్ హీరోల సరసన నాలుగు భాషా చిత్రాలతో దూసుకుపోతుంది. వాస్తవానికి త్రిషతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు దాదాపు కనుమరుగైపోయారు. కానీ త్రిషా మాత్రం ఇప్పటికీ స్టార్ హీరోల సరసన నటిస్తూ తనదైన మార్క్ చాటుకుంటూ బిజీ హీరోయిన్ గా గడుపుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom