iDreamPost
android-app
ios-app

నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలపై త్రిష ఆవేదన!

  • Published Nov 19, 2023 | 12:36 PM Updated Updated Nov 19, 2023 | 12:36 PM

ప్రముఖ తమిళ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలపై త్రిష స్పందించారు. ఈ మేరకు తన సోషల్‌ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఇకపై అలాంటి నీచులతో పని చేయనని అన్నారు...

ప్రముఖ తమిళ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలపై త్రిష స్పందించారు. ఈ మేరకు తన సోషల్‌ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఇకపై అలాంటి నీచులతో పని చేయనని అన్నారు...

  • Published Nov 19, 2023 | 12:36 PMUpdated Nov 19, 2023 | 12:36 PM
నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలపై త్రిష ఆవేదన!

ప్రముఖ తమిళనటుడు మన్సూర్‌ అలీఖాన్‌ స్టార్‌ హీరోయిన్‌ త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈయన త్రిష గురించి మాట్లాడుతూ..  త్రిషతో మాట్లాడాలని చాలా సార్లు ప్రయత్నించానన్నారు. కానీ, కుదర్లేదని, లియోలో త్రిషతో పాటు కలిసి నటించే అవకాశం వచ్చిందని తెలిపారు. దీంతో ఎంతో సంతోషించానని, ‘ త్రిషతో కలిసి నటిస్తున్నానా? కచ్చితంగా బెడ్‌ రూము సీన్లు ఉంటాయని భావించానన్నారు.

రోజాను, ఖుష్భూను బెడ్‌పై పడేసినట్లు పడేద్దామని అనుకున్నానన్నారు. ‘ 109 సినిమాల్లో నేను చేయనని రేపా?’ అంటూ బీరాలు పలికారు. త్రిషను తన చేతుల్తో ఆంజనేయస్వామి కొండను ఎత్తుకుపోయినట్లు ఎత్తుకుపోయి.. కాశ్మీర్‌లో మంచులో తీసుకుపోవాలని అనుకున్నానని, కానీ, ఆ ఛాన్సు ఇవ్వటం లేదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, ఈ వీడియో త్రిష దృష్టికి కూడా వెళ్లింది. ఆ వీడియోపై త్రిష ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మేరకు త్రిష శనివారం తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ నా గురించి దారుణంగా చెత్తగా మాట్లాడిన వీడియో ఒకటి నా దృష్టికి వచ్చింది. నేను ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అతడికి నాతో కలిసి అలాంటి సీన్లలో చేయాలని ఆశ ఉండొచ్చు. దేవుడి దయ వల్ల అలాంటి నీచులతో స్క్రీన్‌ షేరు చేసుకునే పరిస్థితి రాలేదు. ఇకపై కూడా నటించను. ఇలాంటి వారు మనుష జాతికే చెడ్డ పేరు తెస్తున్నారు’’ అంటూ ఆవేదనతో పాటు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.

కాగా, మన్సూర్‌.. త్రిషపై చేసిన వ్యాఖ్యలపై లియో చిత్ర దర్శకుడు ‘ లోకేష్‌ కనగరాజ్‌’ స్పందించారు. ఈ మేరకు ఓ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీటులో..
‘‘ త్రిషపై మన్సూర్‌ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయి. ఆయన ఒకే టీంలో కలిసి పనిచేశారు. మహిళల పట్ల గౌరవం ఉండాలి. నేను కచ్చితంగా ఈ ప్రవర్తను ఖండిస్తున్నాను’’ అని అన్నారు. హీరోయిన్‌ మాళవిక మోషన్‌ కూడా స్పందిస్తూ.. ‘‘ ఇది చాలా దారుణంగా ఉంది. మన్సూర్‌కు మహిళల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో దీన్ని బట్టే తెలుస్తుంది.

ఇది సిగ్గుచేటు. ఇలా మాట్లాడటానికి ఎంత ధైర్యం ఉండాలి’’ అని అన్నారు. కాగా, మన్సూర్‌ గతంలో తమన్నాపై కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. జైలర్‌ సినిమాలో ఆమె అసభ్యకరంగా డ్యాన్స్‌ చేసిందని అన్నారు. కాళ్ల మధ్యలోకి చేతులు పోనిస్తూ దారుణంగా డ్యాన్స్‌ చేసిందని అన్నారు. దీంతో ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నెల కూడా గడవక ముందే  ఇప్పుడు త్రిషపై మాట్లాడారు. మరి, మన్సూర్‌ అలీ వరుస వివాదాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetsmove girişEscortes BelgiqueCasibomGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibom