iDreamPost
android-app
ios-app

యానిమల్‌ సినిమా కోసం త్రిప్తి దిమ్రీ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

  • Published Dec 14, 2023 | 9:17 PM Updated Updated Dec 15, 2023 | 11:59 AM

యానిమల్‌ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటి వరకు దాదాపుగా 1000 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది. ఓవర్‌సీస్‌లో రికార్డులను సృష్టిస్తోంది.

యానిమల్‌ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటి వరకు దాదాపుగా 1000 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది. ఓవర్‌సీస్‌లో రికార్డులను సృష్టిస్తోంది.

  • Published Dec 14, 2023 | 9:17 PMUpdated Dec 15, 2023 | 11:59 AM
యానిమల్‌ సినిమా కోసం త్రిప్తి దిమ్రీ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

యానిమల్‌ సినిమాతో ఓ రేంజ్‌ ఫాలోయింగ్‌ తెచ్చుకున్నారు త్రిప్తి దిమ్రీ. మూవీలో సెకండ్‌ హీరోయిన్‌గా కనిపించారు. ఉన్నది కొద్దిసేపే అయినా.. రష్మికను మించిన క్రేజ్‌ తెచ్చుకున్నారు. ఓవర్‌ నైట్‌లో ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఈమెను గురించిన చర్చలే జరుగుతున్నాయి. ఇప్పుడు త్రిప్తికి సంబంధించిన ఓ న్యూస్‌ నెట్టింట వైరల్‌గా మారింది. యానిమల్‌ సినిమా కోసం త్రిప్తికి ఇచ్చిన రెమ్యూనరేషన్‌ వార్త అది.

యానిమల్‌ కోసం త్రిప్తికి 40 లక్షల రూపాయల రెమ్యూనరేషన్‌ ఇచ్చారట. ఈ విషయం తెలిసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. మరీ, ఇంత తక్కువ రెమ్యూనరేషనా అంటు పెదవి విరుస్తున్నారు. మూవీకి అంత పేరు తెచ్చిన నటికి అంత తక్కువ డబ్బులా అంటూ మండిపడుతున్నారు. అయితే, నెటిజన్లు ఇక్కడ ఓ విషయాన్ని మర్చిపోతున్నారు. యానిమల్‌కు ముందు వరకు త్రిప్తి గురించి సౌత్‌ ఆడియన్స్‌తో పాటు నార్త్‌లోని చాలా మందికి తెలీదు. కానీ, ఈ చిత్రంతో త్రిప్తి ఇంటర్‌నేషనల్‌ లెవెల్‌లో పాపులారిటీ తెచ్చుకుంది.

2017లో వచ్చిన ‘పోస్టర్ బాయ్స్’ అనే మూవీతో త్రిప్తి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇక, అదే ఏడాది. శ్రీదేవి నటించిన ‘మామ్’ చిత్రంలో స్వాతి పాత్రలో మెరిసింది. 2018లో వచ్చిన ‘‘ లైలా మజ్ను’’ బాలీవుడ్‌లో ఆమెకు క్రేజ్ తీసుకొచ్చింది. ‘బుల్బుల్’ మూవీలో నటనకు గాను ఓ అవార్డును సైతం సొంతం అయింది. ప్రస్తుతం ఆమె నటించిన లైలా మజ్ను- జీ 5, బుల్బుల్, ఖాలా మూవీలు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో ఆమెకు ఇచ్చిన రెమ్యూనరేషన్‌ కంటే యానిమల్‌ సినిమాకు ఎక్కువ రెమ్యూనరేషన్‌ ఇచ్చారని చెప్పొచ్చు.

సాధారణంగా ఇండస్ట్రీలో ప్రాసెస్‌ అదే. ఇప్పుడు త్రిప్తి క్రేజ్‌ పెరిగింది కాబట్టి..  ఆమె డిమాండ్‌ చేసినంత ఇవ్వాల్ని ఉంటుంది. కాగా,  త్రిప్తికి వరుస అదృష్టాలు వరిస్తున్నాయి. కొన్ని రోజుల ముందు వరకు త్రిప్తి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో కేవలం 6 లక్షల మంది ఫాలోవర్స్‌ మాత్రమే ఉండేవారు.  యానిమల్‌ సినిమా పుణ్యమా అని ఆ సంఖ్య ఇప్పుడు ఏకంగా మిలియన్లకు చేరింది. త్రిప్తిని ఇన్‌స్టాగ్రామ్‌లో 3.5 మిలియన్లకుపైగా మంది ఫాలో అవుతున్నారు. ఇది వారం రోజుల్లో చోటుచేసుకున్న మార్పు కావటం విశేషం.

ఇక, త్రిప్తికి సినిమా అవకాశాలు బాగా పెరిగాయి. తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. జూనియర్‌ ఎన్టీఆర్‌ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. ఇదే గనుక నిజం అయితే.. తెలుగు నాట త్రిప్తికి తిరుగుండదు. స్టార్‌ హీరోయిన్‌ అయిపోవటం ఖాయం. మరి, యానిమల్‌కు త్రిప్తి తీసుకున్న రెమ్యూనరేషన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş