iDreamPost
android-app
ios-app

Triptii Dimri: యానిమల్ సెకండ్ హీరోయిన్ త్రిప్తి దిమ్రికి మరో అదృష్టం!

  • Published Dec 13, 2023 | 5:44 PM Updated Updated Dec 13, 2023 | 5:44 PM

డిసెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్‌ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. నటీ,నటులకు కూడా మంచి పేరు తీసుకువచ్చింది. ముఖ్యంగా త్రిప్తికి విపరీతమైన క్రేజ్‌ వచ్చింది.

డిసెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్‌ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. నటీ,నటులకు కూడా మంచి పేరు తీసుకువచ్చింది. ముఖ్యంగా త్రిప్తికి విపరీతమైన క్రేజ్‌ వచ్చింది.

  • Published Dec 13, 2023 | 5:44 PMUpdated Dec 13, 2023 | 5:44 PM
Triptii Dimri: యానిమల్ సెకండ్ హీరోయిన్ త్రిప్తి దిమ్రికి మరో అదృష్టం!

యానిమల్‌ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల మీద రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. విడుదలైన అ‍న్ని చోట్లా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.  ఇప్పటి వరకు ఈ చిత్రం దాదాపు 1000 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఓవర్‌సీస్‌ కలెక్షన్ల విషయంలో యానిమల్‌ పాత రికార్డులను చెరిపేసింది. కొత్త రికార్డులను క్రియేట్‌ చేసింది. ఇక, ఈ మూవీలో నటించిన ప్రతీ ఒక్కరికి మంచి పేరు వచ్చింది. కొంతమంది పేరైతే ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది.

ఒక్క సినిమాతో వారి స్టార్‌డమ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. అలా యానిమల్‌తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది నటి త్రిప్తి దిమ్రి. ఈ మూవీ ముందు వరకు ఈమె గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. అలాంటిది.. ఈ చిత్రంలో నటించటం ద్వారా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మీడియాతో పాటు సోషల్‌ మీడియాలోనూ ఈమె గురించిన వార్తలే ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు కూడా త్రిప్తి గురించి విషయాలపైనే ఎక్కువ సెర్చ్‌ చేస్తున్నారు.

ఇక, యానిమల్‌ మూవీ కారణంగా త్రిప్తికి అదృష్టం పడిశం పట్టినట్లు పట్టింది. రోజుల్లోనే ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్‌ వచ్చేసింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో కొన్ని రోజుల ముందుకు వరకు కేవలం 6 లక్షల మంది ఫాలోవర్స్‌ మాత్రమే ఉండేవారు. యానిమల్‌ సినిమా పుణ్యమా అని ఆ సంఖ్య ఇప్పుడు ఏకంగా మిలియన్లకు చేరింది. త్రిప్తిని ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 3.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. వీరంతా ప్రపంచం నలుమూలకు చెందినవారే. ఇలా యానిమల్‌ చిత్రం వల్ల త్రిప్తికి ఓ మంచి భవిష్యత్తు ఏర్పడింది. అందరి ఆదరణ పొందుతోంది.

కాగా, త్రిప్తి 2017లో వచ్చిన ‘పోస్టర్ బాయ్స్’ అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇక, అదే ఏడాది. శ్రీదేవి నటించిన ‘మామ్’ చిత్రంలో స్వాతి పాత్రలో మెరిసింది. ఆ తర్వాత 2018లో వచ్చిన ‘‘ లైలా మజ్ను’’ బాలీవుడ్‌ నాట ఆమెకు క్రేజ్ తీసుకొచ్చింది. ‘బల్బుల్’ మూవీలో నటనకు గాను ఓ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన లైలా మజ్ను- జీ 5, బల్బుల్, ఖాలా మూవీలు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఇప్పుడు ఆమెకు పలు భాషలనుంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తెలుగులో కూడా త్రిప్తికి అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాలో ఆమెకు హీరోయిన్‌గా ఛాన్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. మరి, యానిమల్‌ సినిమాతో త్రిప్తి దశ ఒక్కసారిగా తిరిగిపోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

Jojobet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetcepbahis girişEscortes BelgiqueCasibomGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibom