iDreamPost
android-app
ios-app

వీడియో: యానిమల్ బ్యూటీ తృప్తీ దిమ్రీ కొత్త సాంగ్ రిలీజ్!

  • Published Jul 08, 2024 | 5:23 PM Updated Updated Jul 08, 2024 | 5:23 PM

Tripti Dimri Bad Newz Movie Jaanam Song Promo: యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రీ తాజాగా ఒక క్రేజీ ప్రాజెక్ట్ తో వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి ఇప్పటికే చాలానే అప్ డేట్స్ వచ్చాయి. తాజాగా ఒక సాంగ్ ప్రోమో వచ్చింది.

Tripti Dimri Bad Newz Movie Jaanam Song Promo: యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రీ తాజాగా ఒక క్రేజీ ప్రాజెక్ట్ తో వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి ఇప్పటికే చాలానే అప్ డేట్స్ వచ్చాయి. తాజాగా ఒక సాంగ్ ప్రోమో వచ్చింది.

  • Published Jul 08, 2024 | 5:23 PMUpdated Jul 08, 2024 | 5:23 PM
వీడియో: యానిమల్ బ్యూటీ తృప్తీ దిమ్రీ కొత్త సాంగ్ రిలీజ్!

తృప్తి దిమ్రీ.. ఒక్క సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ ఈమె. యానిమల్ సినిమాకి ముందు తృప్తీ అంటే ఇండస్ట్రీలో వారికి మాత్రమే తెలిసి ఉంటుంది. కానీ, ఇప్పుడు తృప్తీ దిమ్రీ అంటే పాన్ ఇండియా లెవల్లో ఉన్న సినిమా ప్రేక్షకులు, నెటిజన్స్ కి బాగా తెలుసు. యానిమల్ సినిమా ముందు ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో ఉన్న ఫాలోయింగ్ కేవలం 15 వేలు. ఎప్పుడైతే యానిమల్ మూవీ థియేటర్లోకి వచ్చిందే.. ఆ తర్వాత ఆమెకు క్రేజ్ కూడా అలాగే పెరిగిపోయింది. ఇప్పుడు ఆమెకు 5.2 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ నుంచి ఒక క్రేజీ మూవీ రాబోతోంది. ఆ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ కాబోతోంది.

ప్రస్తుతం బాలీవుడ్ వాళ్లు మాత్రమే కాదు.. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా లైన్ క్రేజీగా ఉండటం ఒక పాయింట్ అయితే.. అంతకు మించిన పాటలతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇప్పటికే తౌబా తౌబా అనే పాట యూట్యూబ్ ని అల్లాడిస్తోంది. ఇప్పుడు అంతకు మించిన పాట ఒకటి రాబోతోంది. జానం అనే సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ మొత్తం ఈ ప్రోమో గురించే చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే సాంగ్ ఆ రేంజ్ లో ఉంది కాబట్టి. ఈ సాంగ్ మంగళవారం విడుదల కాబోతోంది. ఇప్పుడు తౌబా తౌబా సాంగ్ కంటే ఈ జానం సాంగ్ గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

తృప్తి దిమ్రీ- విక్కీ కౌశల్ కాంబోలో ఒక క్రేజీ బాలీవుడ్ ఎంటర్ టైనర్ రాబోతున్న విషయం తెలిసిందే. అదే బ్యాడ్ న్యూజ్ సినిమా. ఈ మూవీ పాయింట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వైద్య చరిత్రలోనే ఒక అద్భుతం జరిగినట్లుచూపిస్తారు. హీరోయిన్ కి ప్రెగ్నెన్సీ వస్తుంది. అయితే ఆమె ఇద్దరితో సన్నిహితంగా ఉంటుంది. వారిలో ఎవరో ఒక్కరే తండ్రి కావాలి. కానీ, ఇక్కడ ఇద్దరూ తండ్రులు అని తేలుతుంది. అంటే ఒక ఎగ్ కి రెండు కణాలు వెళ్లాయి అనమాట. దాంతో పెద్ద సమస్యే వచ్చి పడుతుంది. హీరోయిన్ మాత్రం ఇద్దరిలో ఎవరు ది బెస్ట్ అనుకుంటే వారినే తన బిడ్డకు తండ్రిని చేస్తాను అంటూ తేల్చేస్తుంది. ఇంకేముంది అక్కడి నుంచే అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు హీరోలు తానే బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి నానా కష్టాలు పడతారు. ఆ సీన్స్ తోనే కామెడీ జనరేట్ చేశారు. ఈ మూవీ జులై 19న థియేటర్లలో విడుదల కానుంది. మరి.. ఈ రెండో సాంగ్ ప్రోమో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio