iDreamPost

ఆత్మహత్యకు ముందు పవిత్ర పై చందు వరుస పోస్ట్‌లు! ఇంత నరకం అనుభవించాడా?

TV Actor Chandrakanth: బుల్లితెర ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి.. ఐదు రోజుల క్రితం త్రినయని నటి పవిత్ర జయరామ్ కన్నుమూశారు.. ఈ విషదం మరువక ముందే మరో సంఘటన జరిగింది.

TV Actor Chandrakanth: బుల్లితెర ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి.. ఐదు రోజుల క్రితం త్రినయని నటి పవిత్ర జయరామ్ కన్నుమూశారు.. ఈ విషదం మరువక ముందే మరో సంఘటన జరిగింది.

ఆత్మహత్యకు ముందు పవిత్ర పై చందు వరుస పోస్ట్‌లు! ఇంత నరకం అనుభవించాడా?

ఇండస్ట్రీలో వరుస విషాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వెండితెర, బుల్లితెర నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు వరుసగా కన్నుమూయడంతో వారి కుటుంబాల్లోనే కాదు.. వారిని అభిమానించే అభిమానులు కూడా విషాదంలో మునిగిపోతున్నారు. బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి మరువక ముందే ఆమె భర్తగా ప్రచారం అవుతున్న చంద్ర శుక్రవారం తన నివాసంలో బలవన్మరణానికి పాల్పపడ్డాడు. ఐదు రోజుల క్రితం జరిగిన కారు ప్రమాదంలో పవిత్ర జయరాం అక్కడిక్కడే కన్నుమూసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చందు తీవ్ర మనోవేదనకు గురి అవుతూ.. మీడియా ముందు కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. చందు ఆత్మహత్యతో ఇండస్ట్రీ ఒక్కసారే ఉలిక్కి పడింది.వివరాల్లోకి వెళితే..

బుల్లితెరపై ఎంతో పాపులర్ అయిన త్రినయని, రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం 2 సీరియల్స్ లో నటించిన చందు శుక్రవారం తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. ఈ సీరియల్ లో నటించిన పవిత్ర జయరామ్ చనిపోయిన ఐదు రోజులకే చందు కూడా తన నివాసంలో బలవన్మరణానికి పాల్పపడటం తీవ్ర కలకలం రేపింది. తను ఎంతగానో ఇష్టపడ్డ పవిత్ర తనకు దూరం కావడం దురదృష్టం అని మీడియాలో తన ఆవేదన వెల్లబుచ్చాడు. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనకు గురై.. నరకం అనుభవించాడని చందు సన్నిహితులు అంటున్నారు. పవిత్ర జయరామ్ కన్నుమూసిన తర్వాత చందు తీవ్ర మనస్థాపానికి గురైనట్లు చెబుతున్నారు. చివరికి తాను కూడా ఆత్మహత్య చేసుకోవడం అందరికీ షాక్ ఇచ్చింది.

చందుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరేళ్లుగా త్రినయని సీరియల్ లో నటి పవిత్రతో జయరామ్ సహజీవనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆదివారం (మే11)న జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరాం కన్నుమూసింది. ఆ కారులో చందు కూడా ఉండగా.. గాయాలతో బయటపడ్డాడు. పవిత్ర తన కళ్ల ముందే చనిపోవడం చందు జీర్ణించుకోలేకపోయాడు. ఆమె ఎడబాటును తట్టుకోలేకపోయాడు. రెండు రోజు క్రితం పవిత్ర పుట్టిన రోజు కావడంతో బాగా డిప్రేషన్ కి లోనైనట్లు తెలుస్తుంది. ‘రెండు రోజులు ఆగు..’ అంటూ తన ఇన్ స్ట్రాలో పోస్ట్ పెట్టాడు. ప్రతిరోజూ తన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ పోస్టుల రూపంలో ఇన్ స్టాలో పోస్ట్ చేసి.. తన బాధను వ్యక్తం చేసుకున్నాడు. చనిపోయే రోజు కూడా ‘గుడ్ మార్నింగ్ నాన్న.. ఇట్స్ టైమ్ ఫర్ జిమ్.. మన జిమ్ కోచ్ ఇప్పడే కాల్ చేశాడు.. లవ్ యూవ్ పాపా..’ అంటూ పోస్ట్ పెట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపో విచారణ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Challa Chandu II (@chandrakanth_artist)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి