మీరు ఏడిపించండి.. మేము ఏడ్చి హిట్ ఇస్తాం!

టాలీవుడ్‌ ప్రేక్షకులు యాక్షన్ సినిమాలతో పాటు సెంటిమెంట్ సినిమాలకు కూడా బ్రహ్మరథం పడుతారు అంటూ హాయ్‌ నాన్న సినిమా హిట్ తో మరోసారి నిరూపితం అయింది. ఒక వైపు వైల్డ్‌ యాక్షన్ మూవీ యానిమల్‌ హిట్ గా నిలువగా, మరో వైపు సెంటిమెంట్‌ తో కన్నీళ్లు పెట్టించిన నాని హాయ్‌ నాన్న కూడా హిట్‌ గా నిలిచింది.

టాలీవుడ్‌ ప్రేక్షకులు యాక్షన్ సినిమాలతో పాటు సెంటిమెంట్ సినిమాలకు కూడా బ్రహ్మరథం పడుతారు అంటూ హాయ్‌ నాన్న సినిమా హిట్ తో మరోసారి నిరూపితం అయింది. ఒక వైపు వైల్డ్‌ యాక్షన్ మూవీ యానిమల్‌ హిట్ గా నిలువగా, మరో వైపు సెంటిమెంట్‌ తో కన్నీళ్లు పెట్టించిన నాని హాయ్‌ నాన్న కూడా హిట్‌ గా నిలిచింది.

సరైన హిట్స్‌ కోసం ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఎట్టకేలకు ఏడాది చివర్లో హాయ్‌ నాన్న రూపంలో ఒక హిట్ దొరికింది. హర్రర్‌ సినిమాలు వచ్చి బాగా భయపెడితే జనాలు భయపడి హిట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎంత హర్రర్‌ ఉంటే అంత ఎక్కువగా విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. ఇక సెంటిమెంట్‌ విషయంలో కూడా అదే జరుగుతోంది. మాస్‌ సినిమాలు, యాక్షన్‌ సినిమాల కంటే సెంటిమెంట్‌ సినిమాలను రూపొందించి, పద్దతిగా, చక్కని స్క్రీన్‌ ప్లేతో ప్రేక్షకులను ఏడిపించగలిగితే కచ్చితంగా ఆయా సినిమాలు హిట్‌ అయిన దాఖలాలు చాలానే ఉన్నాయి. తాజాగా నాని నటించిన హాయ్‌ నాన్న సినిమా కూడా ఆ కోవలోకి చెందినదే. అందుకే నాని సినిమాకు జనాల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుందని సినీ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో వచ్చిన సెంటిమెంట్‌ సినిమాల్లో కొన్ని జనాలను బాగా ఏడిపించాయి. అందులో బలగం ఒకటి కాగా మరోటి హాయ్‌ నాన్న అనడంలో సందేహం లేదు. నాని కొన్ని సన్నివేశాల్లో కన్నీళ్లు పెట్టుకుని, థియేటర్ లో స్క్రీన్‌ ముందు కూర్చున్న వారి కళ్లలో కూడా నీళ్లు తిరిగేలా చేశాడు. దాంతో హాయ్‌ నాన్న సినిమా హిట్ అయింది. బలగం సినిమా క్లైమాక్స్ కి కన్నీళ్లు పెట్టుకోని వారు ఉండరు. అందుకే ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సెంటిమెంట్‌ సినిమాను తీసి చక్కగా ఏడిపిస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఏడ్చేసి సినిమాను హిట్‌ చేస్తారని తాజా హిట్ సినిమాల ఫలితాలను చూస్తూ ఉంటే అర్థం అవుతోంది. ఏడ్చేసి హిట్ చేసేందుకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధం అని మాతృదేవో భవ సినిమా నుంచి మనం చూస్తూనే ఉన్నాం.

సెంటిమెంట్‌ పేరుతో వెకిలి చేష్టలు, ఇతర పిచ్చ సన్నివేశాలు చూపించే ప్రయత్నం చేస్తే ఆ సినిమాలకు తిరస్కరణ తప్పదు. ఆ విషయంలో చాలా మంది ఫిల్మ్‌ మేకర్స్‌ తప్పు చేశారు. సెంటిమెంట్‌ సినిమాలో సెంటిమెంట్‌ ను బలవంతంగా జొప్పించినా కూడా ఫలితం తారు మారు అయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటూ సెంటిమెంట్ తో ఏడిపిస్తే ముందు ముందు కూడా తప్పకుండా ప్రేక్షకులు ఏడ్చేసి హిట్స్ ఇస్తారు. అందుకే బలగం సినిమా తో ఏడిపించి హిట్‌ కొట్టిన దర్శకుడు వేణు మళ్లీ ఏడిపిస్తాను అంటున్నాడు. నానితో ఒక సినిమాను చేసేందుకు వేణు సిద్ధం అవుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా కూడా సెంటిమెంట్‌ తో ఏడిపించి హిట్ అవ్వాలని ఆశిద్దాం. బలగం, హాయ్ నాన్న సినిమాలు మీరు చూసి ఉంటే చూస్తున్న సమయంలో కన్నీళ్లు వచ్చాయా?

Show comments