iDreamPost
android-app
ios-app

యాంకర్ రష్మీ ఇంట విషాదం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

  • Published Mar 11, 2024 | 7:47 AM Updated Updated Mar 11, 2024 | 7:47 AM

బుల్లి తెర యాంకర్ ఇంట విషాదం నెలకొంది. దీంతో రష్మి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషాద ఘటనను తెలియ జేస్తూ రష్మి సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ గా మారింది.

బుల్లి తెర యాంకర్ ఇంట విషాదం నెలకొంది. దీంతో రష్మి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషాద ఘటనను తెలియ జేస్తూ రష్మి సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ గా మారింది.

  • Published Mar 11, 2024 | 7:47 AMUpdated Mar 11, 2024 | 7:47 AM
యాంకర్ రష్మీ ఇంట విషాదం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇప్పుడున్న యాంకర్స్ లో రష్మికి ఉన్న క్రేజే వేరు. యాక్టింగ్, అందం కలగలిపి బుల్లితెరపై దూసుకెళ్తోంది. బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షో జబర్ధస్త్ లో యాంకర్ గా చేస్తూ పాపులారిటీ పొందింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. కానీ తనకు యాంకర్ గానే ఎక్కువగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. తాజాగా యాంకర్ రష్మి ఇంట్లో విషాదం నెలకొంది. తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న పెట్ డాగ్ మరణించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రష్మీ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టు చేసింది.

రష్మి జంతు ప్రేమికురాలు అన్న సంగతి అందరికి తెలిసిన విషయమే. జంతువుల పట్ల తను చూపించే ప్రేమ అంతా ఇంత కాదు. వాటికి కష్టం వస్తే తన కంట కన్నీరు కారుస్తుంది. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో ఆహారం లేక అలమటిస్తున్న జంతువులకు ఆహారం, నీళ్లు అందించి జంతువులపై ప్రేమను చాటుకున్నది. జంతువులపై హింసకు పాల్పడే వారి పట్ల ఘాటుగా స్పందిస్తుంది యాంకర్ రష్మి. జంతు ప్రేమికురాలైన రష్మికి తను ఎంతో ప్రేమగా పెంచుకున్న పెట్ డాగ్ మరణించడతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

తన కుటుంబంలో ఒకరిగా భావించే చుట్కీ గౌతమ్ అనే పెట్ డాగ్ తుది శ్వాస విడిచింది. మరణించిన కుక్కపై రష్మీ పూలమాల వేసి భావోద్వేగానికి లోనైంది. లవ్ యూ మై బేబీ గర్ల్, మై గోల్డెన్ గర్ల్ అంటూ ఎమోషనల్ అయ్యింది. దీనికి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది కాస్త నెట్టింటా వైరల్ గా మారింది. చుట్కీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ గతంలో తీసుకున్న ఫోటోలను షేర్ చేసింది. పెట్ డాగ్ చుట్కీ గౌతమ్ కు అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş