ఇండస్ట్రీలో విషాదం..అప్పుల బాధతో సినీ రచయిత ఆత్మహత్య

Prashanth Passed away: ఇటీవల సిని పరిశ్రమలో వరుసగా విషాదలు జరుగుతున్నాయి. పలు కారణాల వల్ల సెలబ్రెటీలు కన్నుమూయడంతో వాకి కుటుంబ సభ్యులు, అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు.

Prashanth Passed away: ఇటీవల సిని పరిశ్రమలో వరుసగా విషాదలు జరుగుతున్నాయి. పలు కారణాల వల్ల సెలబ్రెటీలు కన్నుమూయడంతో వాకి కుటుంబ సభ్యులు, అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు.

గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. భాషా బేధం లేకుండా అన్ని ఫిలిమ్ ఇండస్ట్రీలో ఒక్కొక్కరూ కన్ను మూస్తున్నారు. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలతో పాటు ఇతర రంగాలకు చెందిన వారు కన్నుమూయడంతో వారి కుటుంబాల్లోనే కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. వయోభారం, హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు ఇలా కొన్ని కారణాలు అయితే.. కెరీర్ సరిగా లేక ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక మరికొంతమంది సెలబ్రెటీలు కన్నుమూస్తున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ రచయిత కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ సినీ రచయిత బలవన్మరణానికి పాల్పపడ్డారు. ఈ సంఘటన సైబరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మణికొండ, పంచవటి కాలనీలోని విక్రమ్ హైట్స్ లో ఉంటున్న దాసరి లలితసాయి ప్రశాంత్ (45) సినీ యానిమేషన్ స్టోరీ రైటర్ గా పనిచేస్తున్నారు. ప్రశాంత్ కి పెళ్లి కాకపోవడంతో ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నారు. ఎప్పుడూ అందరితో కలిసి హ్యాపీగా ఉండే ప్రశాంత్ గత కొంత కాలంగా ముభావంగా ఉంటున్నట్టు అతని సన్నిహితులు చెబుతున్నారు.  ఇండస్ట్రీలో అవకాశాలు లేక.. ఖర్చులు బాగా పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతూ తెలిసిన వారి వద్ద అప్పులు తీసుకున్నాడు.

రోజు రోజుకీ అప్పులు పెరిగిపోతూ వచ్చాయి.. కానీ సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ప్రశాంత్ పూర్తిగా డిప్రేషన్ లోకి వెళ్లిపోయాడు.  తనకు ఆత్మహత్యే శరణ్యం అని భావించాడు. ఇంట్లో సూసైడ్ నోట్ రాసి.. ఫ్యాన్ కి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పపడ్డాడు. బాధితుడి సోదరుడు ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. అప్పుల గురించి తమకు ఎప్పుడూ చెప్పలేదని.. అప్పులు ఉన్నంత మాత్రాన జీవితాన్ని అంతం చేసుకుంటారా? అంటూ ప్రశాంత్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Show comments