iDreamPost
android-app
ios-app

అవును మేం విడిపోయాం.. చెల్లెలి కాపురం సీరియల్‌ హీరోయిన్‌

  • Published May 16, 2024 | 2:53 PM Updated Updated May 16, 2024 | 2:53 PM

Serial Actress Sirisha: తెలుగు బుల్లితెర హీరోయిన్‌ ఒకరు తన అభిమానులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. తాను భర్త నుంచి విడిపోయినట్లు ప్రకటించింది. ఆ వివరాలు..

Serial Actress Sirisha: తెలుగు బుల్లితెర హీరోయిన్‌ ఒకరు తన అభిమానులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. తాను భర్త నుంచి విడిపోయినట్లు ప్రకటించింది. ఆ వివరాలు..

  • Published May 16, 2024 | 2:53 PMUpdated May 16, 2024 | 2:53 PM
అవును మేం విడిపోయాం.. చెల్లెలి కాపురం సీరియల్‌ హీరోయిన్‌

భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మన సమాజం ముందుకు సాగడంలో వివాహ వ్యవహస్థదే కీలక పాత్ర. ఒక్కసారి పెళ్లి బంధంలోకి అడుగు పెడితే.. చనిపోయే వరకు వారితోనే జీవితం అని నమ్మే సమాజం మనది. కష్టాలు వచ్చినా, సమస్యలు ఎదురైనా.. సర్దుకుపోదాం అనుకుంటారు తప్పితే.. విడిపోదాం అని అసలే ఆలోచించరు. ఇక మహిళలైతే.. విడాకులు అంటే ఇప్పటికి కూడా వెనకడుగు వేస్తారు. భర్త ఎలాంటి వాడైనా సరే.. తన గురించి, పిల్లల గురించి ఆలోచించి.. అతడితోనే కలిసి ఉంటుంది కానీ.. భర్త నుంచి మాత్రం విడిపోదు. అయిదే ఇది ఓ దశాబ్దం క్రితం వరకు మాట.

మరి ఇప్పుడో నచ్చితేనే కలిసి ఉందాం.. బలవంతంగా బంధంలో ఉండాల్సిన పని లేదు అనుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. భాగస్వామితో పడటం లేదంటే.. సింపుల్‌గా విడాకులు అంటున్నారు. ఇక ఇండస్ట్రీలో అయితే ఇవి మరింత ఎక్కువ. ప్రేమ, పెళ్లి, విడాకులు అనేవి.. మూవీ పరిశ్రమలో చాలా కామన్‌ అనిపిస్తాయి. ఇక ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకుంటున్న సెలబ్రిటీల సంఖ్య పెరిగిపోతుంది. కొన్ని రోజుల క్రితమే సంగీత దర్శకుడు, హీరో జీవీ ప్రకాష్‌ తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇక తాజాగా ఈ జాబితాలో టాలీవుడ్‌ బుల్లితెర హీరోయిన్‌ ఒకరు చేరారు. ఆ వివరాలు..

శిరీష అంటే వెంటనే గుర్తు పట్టరు కానీ.. చెల్లెలి కాపురం సీరియల్‌ హీరోయిన్‌ భూమి అంటే ప్రతి ఒక్కరు టక్కున గుర్తు పడతారు. ఆ సీరియల్‌ ద్వారా ఎంతో క్రేజ్‌ సంపాదించుకుంది. ఈ క్రమంలో తాజాగా శిరీష షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. తాను భర్తతో విడిపోయినట్లు ప్రకటించింది. 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికినట్లు చెప్పుకొచ్చింది. మొగలి రేకులు సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శిరీష.. ఆ తర్వాత వరుసగా సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా మారింది.

స్వాతిచినుకులు, రాములమ్మ, మనసు మమత, కాంచన గంగ, నాతిచరామి వంటి సీరియల్స్‌లో కీలక పాత్రల్లో కనిపించింది. ఇక శిరీష కెరీర్‌ని మలుపు తిప్పిన సీరియల్‌ చెల్లెలి కాపురం. దీనిలో చెల్లి కోసం.. మతిస్థిమితం లేని వ్యక్తిని పెళ్ళాడి.. అతడిని ఎలా మార్చుకుంది అనే కథతో తెరకెక్కిన ఈ సీరియల్ లో భూమి పాత్రలో నటించి.. అందరి చేత ప్రశంసలు పొందింది శిరీష.

ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే నవీన్ వల్లభనేనిని పెళ్లి చేసుకుంది శిరీష. వివాహం తర్వాత కూడా సీరియల్స్‌లో నటిస్తూ వచ్చింది. ఈ దంపతులకు శ్రీఈష్ అనే బాబు కూడా ఉన్నాడు. ఈ జోడి అనేక ప్రోగ్రాములు, షోలలో కూడా కనిపించారు. ఇక సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. అలాంటిది గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో కానీ, షోస్‌లలో కానీ వీరిద్దరూ జంటగా కనిపించడం లేదు. దీంతో అభిమానులందరూ.. వీరు విడిపోయారా.. విడాకులు తీసుకున్నారా అంటూ అనుమానాలు వ్యక్తం చేయసాగారు. ఈ క్రమంలో తాజాగా వీటిపై స్పందిస్తూ.. శిరీష షాకింగ్‌ ప్రకటన చేసింది.

“నా అభిమానులు, వ్యక్తిగత శ్రేయోభిలాషులతో నేను నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను, నవీన్ ఒకప్పుడు భార్యాభర్తలు, మా నియంత్రణకు మించిన పరిస్థితుల కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. ఇలాంటి సమయంలో మమ్మల్ని అర్ధం చేసుకొని మాకు ప్రైవసీ ఇవ్వాలని కోరుకుంటున్నాము. విమర్శలు వద్దు. ప్రేమ, దయ పంచండి. నాకు నవీన్ పట్ల ఎంతో గౌరవం ఉంది. ఓ సెలబ్రిటీగా ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ముఖ్యమని నేను భావిస్తున్నాను. మీరు మాపై చూపించే ప్రేమకు ఎప్పుడు ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio