iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి!

  • Published Feb 25, 2024 | 7:36 PM Updated Updated Feb 25, 2024 | 7:36 PM

Tollywood producer passed away: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్, చిరంజీవి, సుమన్ లాంటి స్టార్ హీరోలతో చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత కన్నుమూశారు.

Tollywood producer passed away: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్, చిరంజీవి, సుమన్ లాంటి స్టార్ హీరోలతో చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత కన్నుమూశారు.

  • Published Feb 25, 2024 | 7:36 PMUpdated Feb 25, 2024 | 7:36 PM
టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి!

టాలీవుడ్ లో గత కొంతకాలంగా తీవ్ర విషాదాలు చోటుచేసుకుంటూ వస్తున్నాయి. వివిధ కారణాల వల్ల పలువురు నటీ, నటులు, టెక్నీషియన్లు మరణిస్తూ వస్తున్నారు. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, రచయిత వి. మహేష్(85) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్, చిరంజీవి, సుమన్ లాంటి స్టార్ హీరోలతో చిత్రాలను నిర్మించారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత వి. మహేష్ గుండెపోటుతో శనివారం రాత్రి మరణించారు. చెన్నైలో తన ఇంటిలోని బాత్రూమ్ నుంచి వస్తూ.. కాలుజారి కిందపడ్డారు. దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆయన్ని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లుగా వైద్యులు వెల్లడించారు. దీంతో కన్నీరుమున్నీరుగా విలపించారు కుటుంబ సభ్యులు.

ఇక ఈ విషయం తెలిసి తీవ్ర దిగ్బ్రాంతికి గురైయ్యారు పలువురు సెలబ్రిటీలు. వారి ఫ్యామిలీకి సానుభూతి తెలియజేస్తున్నారు. మహేష్ కెరీర్ విషయాల్లోకి వెళితే.. 1975లో వచ్చిన ‘మాతృమూర్తి’ మూవీతో నిర్మాతగా మారి పలు సూపర్ హిట్ చిత్రాను ప్రేక్షకులను అందించారు. అందులో ఎన్టీఆర్ తో తీసిన మనుష్యులంతా ఒక్కటే, మహాపురుషుడు మూవీలతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి ‘సింహపురి సింహం’, సుమన్ తో ‘ముసుగు దొంగ’ సినిమాలను నిర్మించారు.

కాగా.. ఎన్టీఆర్ తో తీసిన మనుష్యులంతా ఒక్కటే మూవీకి ఉత్తమ కథా రచయితగా నంది అవార్డును సైతం ఆయన అందుకున్నారు. సినిమాలతో పాటుగా శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ లో ప్రసారమైన ‘హరి భక్తుల కథలు’ సీరియల్ కు రైటర్ కమ్ ప్రొడ్యూసర్ గా చేశారు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని కొరుటూరు ఆయన స్వగ్రామం. ఇప్పటి వరకు ఆయన పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోయారు. మహేష్ అంత్యక్రియలు చెన్నైలో సోమవారం మధ్యాహ్నం జరుగుతాని ఆయన మేనల్లుడు టీవీ నిర్మాత, డైరెక్టర్ వల్లభనేని మహీధర్ తెలిపారు.

ఇదికూడా చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ మృతి

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss