టాలీవుడ్ లో ఈ పాపులర్ విలన్ గుర్తున్నాడా.. ఇప్పుడెలా మారిపోయాడంటే?

ఒకప్పుడు తన విలనిజంతో తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ పాఫులర్ విలన్ గుర్తున్నడా..? ఇప్పుడెలా మారిపోయడంటే..

ఒకప్పుడు తన విలనిజంతో తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ పాఫులర్ విలన్ గుర్తున్నడా..? ఇప్పుడెలా మారిపోయడంటే..

కొంతమంది విలనీజం చేస్తే కామెడీగా, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అదే కొంతమంది విలనీజం చేస్తే.. విలన్ పేరుకు పెట్టిన క్యారెక్టర్ల అనిపిస్తుంది. ఎందుకంటే.. అంతలా కొంతమంది యాక్టర్స్ తమ నటనతో విలన్ పాత్రలో ఒదిగిపోతుంటారు. ఇక వీరిని చూస్తే.. బయట కూడా అలానే ఉంటారేమో అనే భావన ప్రేక్షకుల్లో భావన కలుగుతుంది. అంతలా విలన్ పాత్రలో న్యాయం చేయడమే కాకుండా.. బెస్ట్ విలన్ గా ముద్ర వేసుకుంటారు. మరీ అలాంటి పాత్రల్లో ఒదిగిపోయి నటుల్లో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఓ నటుడు కూడా ఒకరు. మరీ ఆయన ఎవరో కాదు.. విలన్ పాత్రకు కేరాఫ్ అడ్రాస్ గా నిలిచిన తెలుగు నటుడు సత్యప్రకాశ్. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఒకప్పుడు కరడు కట్టిన విలన్ పాత్రలకు పెట్టిన పేరుగా ‘సత్యప్రకాశ్’ ప్రేక్షకుల్లో తనదైన ముద్రను వేసుకున్నారు. ఇంతకీ ఆయన ఇప్పుడు ఎలా మారిపోయాడు. ఎలా ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకప్పుడు తన విలనిజంతో తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ విలన్ లలో సత్య ప్రకాష్ కూడా ఒకరు. అయితే ఈయన అసలు పేరు పేరి ‘వెంకట సూర్య సత్యనారయణ సోమయాజులు ప్రసాద్’. ఇక సినిమాల్లోకి వచ్చక ఆయన సత్య ప్రకాష్ గా పేరు మార్చుకున్నారు. అయితే చూడటానికి రాష్ట్రం నటుడిలా కనిపించిన సత్య ప్రకాష్.. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో జన్మించాడు. కానీ, పెరిగింది మాత్రం ఒడిశ్సా. అయితే ఈయన నటుడు కాకముందు కొద్దిరోజులు బ్యాంకులో క్లార్క్ గా ఉద్యోగం చేసేవాడు. అయితే సత్య ప్రకాష్ కు చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తి ఉండేది. ఈ క్రమంలోనే.. నటనపై ఆసక్తితో సత్య ప్రకాష్ ఇంట్లో చెప్పకుండా ముంబై వెళ్లిపోయాడు. కానీ, అప్పటిలో వీరి కుటుంబ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే. అయిన సరే నటన మీద పట్టుదల విడవని సత్య ప్రకాష్.. సినిమాల్లో అవకాశాల కోసం చాలా తిరిగేవారు. పెద్ద పెద్ద డైరెక్టర్స్ ను కూడా కలిసేవారు. ఈ క్రమంలోనే.. మొదట చిన్న చిన్న పాత్రల్లో అలరించిన సత్య ప్రకాష్.. పెద్ద పాత్రలు రావాలంటే దేనికైనా టైమ్ రావాలని ఎదరుచూశారు. ఇక ఆయన ఎదురు చూపులు ఫలించి మొదటిగా ఓ కన్నడ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో అవకాశం వచ్చింది. ఇక ఆ సినిమాలో ఆయన నటనకు గాను మంచి ప్రశంసలు అందుకున్నాయి.

అలా అప్పటి నుంచి కన్నడ, హిందీ వంటి భాషల్లో సినిమా అవకాశాలు అందుకున్న ఆయనకు తెలుగులో అవకాశం వస్తే బాగున్ను అని చాలా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలోనే ఆ కోరిక కూడా నెరవేరింది. సత్య ప్రకాష్ మొదటిగా తెలుగులో మొదటిగా 1991లో ‘జైత్రయాత్ర’ సినిమాలో నటించాడు. ఇక ఈ సినిమా తర్వాత.. 1995లో మోగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ సినిమాలో అవకాశం వచ్చింది. ఇక మొదటి సినిమాతోనే తెలుగు నటుడిగా మంచి మార్కులు వేసుకున్న సత్య ప్రకాష్ ఆ తర్వాత కెరీర్ వెనక్కి తిరిగి చూసుకోని విధంగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అయితే సత్య ప్రకాష్ కేవలం నటుడిగా, కమెడియన్ గా కాకుండా.. విలన్ పాత్రలను ఎక్కువగా చేశాడు. ఇకపోతే సత్య ప్రకాష్ విలన్ గా నటించిన సినిమాల్లో.. నరసింహనాయుడు, మాస్టర్, ఎదురులేని మనిషి, సీతారామ రాజు, సీతయ్య, పోకిరి,లక్ష్మీ వంటి సినిమాలు ఈయనకు బాగా ఫేమ్ తెచ్చిపెట్టయని చెప్పవచ్చు.

ఇలా సుదీర్ఘ కాలంగా సత్య ప్రకాష్ ఇప్పటి వరకు 11 భాషల్లో సుమారు 500కి పైగా సినిమాల్లో నటించాడు. ఇకపోతే చివరిగా సత్య ప్రకాష్ 2024లో ఆదిపర్వం అనే సినిమాలో నటించారు. ఇదిలా ఉంటే.. సత్య ప్రకాష్ ఒక నటుడిగా, కమెడియన్, విలన్ గా నటించడమే కాకుండా.. దర్శకుడిగా కూడా స్వీయ దర్శకత్వంలో పలు సినిమాలు తెరకెక్కించారు కానీ, అవి అంతగా సక్సేస్ కాలేదు. మరీ, ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా మంచి క్రేజ్ సంపాదించుకున్న సత్య ప్రకాశ్ బ్యాక్ గ్రౌండ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments