iDreamPost
android-app
ios-app

ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్

  • Published Jan 20, 2024 | 4:04 PM Updated Updated Jan 20, 2024 | 4:04 PM

Tollywood Heroine Wedding:ఇటీవల వెండితెర, బుల్లితెర కు చెందిన నటీనటులు తాము ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటున్నారు. వీరిలో చాలా వరకు తమ సహనటులనే పెళ్లి చేసుకుంటున్నారు.

Tollywood Heroine Wedding:ఇటీవల వెండితెర, బుల్లితెర కు చెందిన నటీనటులు తాము ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటున్నారు. వీరిలో చాలా వరకు తమ సహనటులనే పెళ్లి చేసుకుంటున్నారు.

  • Published Jan 20, 2024 | 4:04 PMUpdated Jan 20, 2024 | 4:04 PM
ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్

వెండితెర, బుల్లితెరకు సంబంధించిన నటీనటులు చాలా వరకు తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది ‘దండుపాళ్యం’ నటి పూజా గాంధీ తాను ప్రేమించిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ ని పెళ్లి చేసుకుంది. ఈ మధ్యనే స్టార్ హీరోయిన్ రకూల్ ప్రీత్ సింగ్ త్వరలో తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబుతున్నట్లు తెలిపింది. మాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటి, యాంకర్ స్వసిక విజయ్ తన సహనటుడు ప్రేమో జాకోబ్ ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సీరియల్ ‘దేవోన్ కే దేవ్…మహాదేవ్‌’లో పార్వతి పాత్రతో మెప్పించిన నటి సోనారిక భడోరియా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..

2012లో బుల్లితెరపై వచ్చిన ‘దేవోన్ కే దేవ్…మహాదేవ్‌’ సీరియల్ లో పార్వతి పాత్రలో నటించిన సొనారిక భడోరియాకు ఎంతో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఆమెకు వెండితెరపై ఛాన్సులు వచ్చాయి. ఈ క్రమంలోనే 2015 లో నాగశౌర్య హీరోగా నటించిన ‘జాదుగాడు’తో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత స్పీడున్నోడు, ఈడో రకం ఆడో రకం మూవీతో అలరించింది. తెలుగు లో మళ్లీ ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు.  బాలీవుడ్ లో సాన్సేన్, హిందుత్వ, తమిళంలో ఇంద్రజీత్ మూవీలో నటించింది. బాలీవుడ్ లో పలు సీరియల్స్ లో నటించిన సోనారిక తాజాగా తాను ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది.

Heroine who is going to get married soon

గత ఏనిమిదేళ్లుగా సొనారిక భడోరియా ప్రముఖ వ్యాపార వేత్త వికాస్ పరశార్ ప్రేమించుకుంటున్నారు. ఈ మధ్యే సొనారిక తన మనసులోని మాట చెబుతూ.. ‘మేం ఎంతోకాలంగా ప్రేమలో ఉన్నాం.. 2022 మేలో మాల్దీవులకు వెళ్లినపుడు వికాస్.. నాకు పెళ్లి ప్రపోజల్ చేశారు. ఈ విషయం మా కుటుంబ సభ్యులకు తెలిపాం.. వాళ్లు సమ్మతించారు. నాకు ప్రతీది సింపుల్ గా చేయాలనిపిస్తుంది.. కానీ తాను మాత్రం గ్రాండ్ గా చేయాలని అంటున్నారు. మా ఇద్దరికీ సముద్రతీరం అంటే చాలా ఇష్టం.. అలానే 2022 డిసెంబర్ లో ఎంగేజ్ మెట్ చేసుకున్నాం’ అని తెలిపింది. రాజస్థాన్ లో ఫిబ్రవరి 18న వీరి వివాహం జరగనుంది. వికాస్ సొంత ఊరైన ఫరిదాబాద్ లోని రిసెప్షన్ జరగనుందని సొనారిక తెలిపింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgar girişgrandpashabet