iDreamPost
android-app
ios-app

Pic Talk: ఇక్కడ కనిపిస్తున్న బుడ్డోడు .. హ్యాట్రిక్ హిట్స్ కొట్టేసిన ఓ హీరో.. ఎవరో గుర్తుపట్టారా!

  • Published Jun 20, 2024 | 10:38 AM Updated Updated Jun 20, 2024 | 10:38 AM

ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్న స్టార్ సెలెబ్రిటీలంతా ఒకప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని అందరికి ఆసక్తి ఉంటుంది. మరి ఈ క్రమంలో ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న స్టార్ హీరో ఎవరో గెస్ చేసేయండి.

ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్న స్టార్ సెలెబ్రిటీలంతా ఒకప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని అందరికి ఆసక్తి ఉంటుంది. మరి ఈ క్రమంలో ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న స్టార్ హీరో ఎవరో గెస్ చేసేయండి.

  • Published Jun 20, 2024 | 10:38 AMUpdated Jun 20, 2024 | 10:38 AM
Pic Talk: ఇక్కడ కనిపిస్తున్న బుడ్డోడు .. హ్యాట్రిక్ హిట్స్ కొట్టేసిన ఓ హీరో.. ఎవరో గుర్తుపట్టారా!

చిన్ననాటి ఫొటోస్ ను గెస్ చేయడంలో ఇప్పుడు అందరూ చాలా ఆశక్తి కనబరుస్తున్నారు. సాధారణంగా అప్పుడప్పుడు మన చిన్ననాటి ఫొటోస్ చూసుకుంటూ అప్పుడప్పుడు మురిసిపోతూ ఉంటాము. అలాంటిది స్టార్ సెలెబ్రిటీలు ఎలా ఉండేవారు అనే ఆసక్తి అందరికి ఉంటుంది. మీడియాలో గత కొంతకాలంగా స్టార్ సెలెబ్రిటీల చిన్న నాటి ఫొటోస్ ట్రెండ్ అవుతూనే ఉన్నా కూడా.. ఈ మధ్య కాలంలో వీటికి క్రేజ్ బాగా పెరిగిందని చెప్పి తీరాలి.వారి అభిమాన తారల చిన్న నాటి ఫోటోలను చూస్తూ వాటిని షేర్స్ చేస్తూ.. ఫ్యాన్స్ కూడా తెగ మురిసిపోతున్నారు. నిజానికి ఈ ట్రెండ్ ను ఇంత బాగా కొనసాగిస్తున్నది కూడా అభిమానులే అని చెప్పి తీరాలి. ఈ క్రమంలో తాజాగా నేనెవరో చెప్పుకోండి అంటూ మరొక బుడతడి ఫోటో సోషల్ మీడియాలోకి వచ్చేశాడు. మరి ఆ బుడతడు ఎవరో ఇప్పుడు ఏం చేస్తున్నాడో.. గెస్ చేసేద్దాం.

ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న ఈ బుడ్డోడిని గుర్తుపట్టడం కాస్త కష్టమే. ఈ బుడ్డోడు ఇప్పుడొక సక్సెస్ ఫుల్ హీరో. ప్రస్తుతానికి స్టార్ హీరో అయితే కాదు కానీ.. ఈ మధ్య కాలం మాత్రం ఈ హీరో సినిమాలు బ్యాక్ తో బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాయి. ఈ సక్సెస్ ఇంకా కొన్ని డేస్ కొనసాగితే కనుక ఖచ్చితంగా స్టార్ హీరో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతని సినిమాలన్నీ కూడా చాలా డిఫ్ఫరెంట్ గా ఉంటాయి. ఆ సినిమాలలో కథలు ఎంత కొత్తగా ఉంటాయో.. ఆ పాత్రలకు అతని ప్రాణం పొసే విధానం కూడా అంతే కొత్తగా ఉంటుంది. పైగా ప్రతి సినిమాలోనూ ఆ కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో మాత్రం ఈ హీరో తీసిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పటికైనా ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా .. ఈ హీరో మరెవరో కాదు.. ఇటీవల ప్రసన్నవదనం సినిమాతో మంచి సక్సెస్ సాధించిన హీరో సుహాస్.

సుహాస్ మొదట తన కెరీర్ ను షార్ట్ ఫిలిమ్స్ తో స్టార్ట్ చేసాడు. ఆ తర్వాత 2018 లో వచ్చిన పడి పడి లేచే మనసుతో వెండి తెరపైన ఎంట్రీ ఇచ్చి.. మజిలీ, డియర్ కామ్రేడ్, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, ప్రతిరోజు పండగే, ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య లాంటి ఎన్నో సినిమాలలో ప్రధాన పాత్రలో నటించాడు. ఇక ఆ తర్వాత కలర్ ఫోటో సినిమాతో డైరెక్ట్ గా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుహాస్. ఈ సినిమా ప్రతి ఒక్కరి మదిని దోచేసింది. ఈ సినిమాను జాతీయ అవార్డు కూడా లభించింది. ఈ సినిమా సుహాస్ కెరీర్ లోనే ఓ మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పి తీరాలి. ఇక ఆ తర్వాత రైటర్ పద్మ భూషణ్, అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్, శ్రీరంగ నీతులు, ప్రసన్నవదనం లాంటి ఎన్నో డిఫ్ఫరెంట్ కాన్సెప్ట్ ఫిలిమ్స్ ను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. మరి రానున్న రోజుల్లో సుహాస్ ఇంకా ఎలాంటి సినిమాలు చేస్తాడో వేచి చూడాలి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş