iDreamPost
android-app
ios-app

టీమిండియా హెడ్‌ కోచ్ పదవికి టాలీవుడ్ హీరో దరఖాస్తు.. కానీ

త్వరలోనే టీ 20 ప్రపంచ కప్ స్టార్ కానుంది. ఈ టోర్నీ ముగిశాక.. టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి హెడ్ కోచ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది బీసీసీఐ.

త్వరలోనే టీ 20 ప్రపంచ కప్ స్టార్ కానుంది. ఈ టోర్నీ ముగిశాక.. టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి హెడ్ కోచ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది బీసీసీఐ.

టీమిండియా హెడ్‌ కోచ్ పదవికి టాలీవుడ్ హీరో దరఖాస్తు.. కానీ

ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. జూన్ 2 నుండి టీ 20 ప్రపంచ కప్ స్టార్ట్ కానుంది. ఇప్పటికే టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసిన సంగతి విదితమే. ఈ టీ 20 ముగిశాక టీమిండియాకు కొత్త కోచ్ రాబోతున్నారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ అప్లికేషన్లను గూగుల్ ఫార్మ్స్‌లో అందుబాటులో ఉంచింది బీసీసీఐ. దీంతో చాలా మంది సరదాగా అప్లై చేస్తున్నారు. వందల కొద్దీ అప్లికేషన్లు రావడంతో బీసీసీఐకి కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఈ క్రమంలోనే ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీమిండియా హెడ్ కోచ్ పదవికి టాలీవుడ్ హీరో కమ్ దర్శకుడు కూడా అప్లై చేశాడు.

టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తుకు సంబంధించి గూగుల్ ఫార్మ్స్ చాలా మంది ఫిల్ చేసినట్లే.. ఈ హీరో కూడా దరఖాస్తు చేశాడు. ఇంతకు ఆ స్టార్ నటుడు ఎవరంటే రాహుల్ రవీంద్రన్. తాను అప్లై చేయగా.. ఆ విషయాన్ని తెలియజేస్తూ స్క్రీన్‌ షాట్స్‌ను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు. అయితే ఆ ఫామ్ ఫిల్ చేశాక.. మేము ఈ దరఖాస్తు స్వీకరించలేం అంటూ బీసీసీఐ నుండి మెసేజ్ కూడా వచ్చింది. ‘ఫామ్ నింపడం సరదాగా ఉంటుందని అనుకున్నాను. ఈ ప్రకారం అప్లై చేశాను. ఏం జరిగిందే చూడండి. ఏదో ఒక రోజు నా పిల్లలకు టీమిండియా హెడ్ కోచ్ కావాలని అనుకున్నానని చెబుతాను.. కానీ’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ పోస్టును చూసిన నెటిజన్లు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.

ఇక రాహుల్ రవీంద్రన్ సినిమాల విషయానికి వస్తే అందాల రాక్షసి మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ సినిమాలో అతడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. స్టార్ సింగర్ చిన్మయిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి పుస్తకం, నేను చిన్న పిల్ల, గాలి పటం, అలా.. ఇలా, టైగర్, శ్రీమంతుడు, హైదరాబాద్ లవ్ స్టోరీ, హౌరా బ్రిడ్జి వంటి చిత్రాల్లో హీరోగా, సపోర్టింగ్ రోల్స్‌లో మెప్పించాడు. 2018లో చిలసౌ మూవీతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమాకు బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కేటగిరిలో జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నాడు. మన్మధుడు 2 కూడా డైరెక్ట్ చేశాడు కానీ అంతగా ఆకట్టుకోలేదు. ఈ ఏడాది గుంటూరు కారం, చారీ 111 మూవీల్లో కనిపించాడు. ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్ అనే మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక కథానాయిక.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి