Uppula Naresh
టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత యక్కలి రవీంద్రబాబు చికిత్స పొందుతూ మృతి చెందారు.
టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత యక్కలి రవీంద్రబాబు చికిత్స పొందుతూ మృతి చెందారు.
Uppula Naresh
ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మొన్న ప్రముఖ నిర్మాత సాతులూరు వేణుగోపాల్, నిన్న నటుడు కళాభవన్ హనీఫ్, ఈ రోజు ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి చెందారు. వారం రోజుల్లోనే ప్రముఖులు చనిపోవడంతో అంతా షాక్ గురవుతున్నారు. ఇక సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతితో సినీ ప్రముఖులు శోక సంద్రంలో మునిగిపోయారు. చంద్రమోహన్ మృతి పట్ల పలువురు నటులు, నిర్మాతలు సంతాపం తెలియజేశారు. ఇక అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. అయితే విషాద ఘటన మరువకముందే తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కన్నుమూశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన యక్కిలి రవీంద్రబాబు శనివారం కన్నుమూశారు. కాగా, గత కొన్ని రోజుల నుంచి ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. కానీ, ఫలితం లేకపోవడంతో ఆయన చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త తెలియడంతో సినీ లోకం మరోసారి శోకసంద్రంలో మునిగిపోయింది. నిర్మాత యక్కిలి రవీంద్రబాబు స్వస్థలం ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో జన్మించారు. మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేశాడు. ఇక చదువు పూర్తి కాగానే ఛార్టర్డ్ ఇంజనీర్ గా పని చేశారు. ఆ తర్వాత ఆయనకు సినిమాపై ఉన్న ఆసక్తితో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు నిర్మించి తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక నిర్మాతగా మారి రవీంద్ర బాబు టాలీవుడ్ లో దాదాపు 17 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అందులో ప్రధానమైన చిత్రాలు.. మా నాన్న నక్సలైట్, వెయిటింగ్ ఫర్ యూ, సొంతూరు, గల్ఫ్, గంగపుత్రులు, హనీట్రాప్ తో పాటు వలస వంటి చిత్రాలకు నిర్మించారు. అయితే గత కొంత కాలం నుంచి ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. ఈ క్రమంలోనే రవీంద్ర బాబు కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఆయన తుది శ్వాస విడిచారు. అయితే ఒకే రోజు టాలీవుడ్ లో ఇద్దరు ప్రముఖులు మృతి చెందడంతో అంతా షాక్ గురవుతున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేశారు.