Tollywood Directors- Lokesh Kangaraj: లోకేష్ స్టైల్ ను సరిగా అర్ధం చేసుకోలేకపోతున్న తెలుగు దర్శకులు

లోకేష్ స్టైల్ ను సరిగా అర్ధం చేసుకోలేకపోతున్న తెలుగు దర్శకులు

Tollwyood Directors- Lokesh Kangaraj: తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజుకు పాన్ ఇండియా లెవల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే టాలీవుడ్ డైరెక్టర్లు మాత్రం లోకీ స్టైల్ ని పట్టుకోలేకపోతున్నారా?

Tollwyood Directors- Lokesh Kangaraj: తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజుకు పాన్ ఇండియా లెవల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే టాలీవుడ్ డైరెక్టర్లు మాత్రం లోకీ స్టైల్ ని పట్టుకోలేకపోతున్నారా?

‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తమిళ పరిశ్రమలోనే కాక తెలుగు సినిమా పరిశ్రమలో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడంతో పాటు హీరో ఎలివేషన్లలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరచుకున్నారు డైరెక్టర్ లోకేష్. అయితే ఆయన నైపుణ్యం కొందరు తెలుగు దర్శకుల పై బాగానే ప్రభావం చూపిస్తుంది.

‘సైంధవ్’ తీసిన శైలేష్ కొలను, ఇటీవల రవితేజతో ‘ఈగల్’ చిత్రాన్ని తెరకెక్కించిన కార్తీక్ ఘట్టమనేని ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాల బాక్సాఫీస్ ఫలితాలను పక్కన పెడితే లోకేష్ కనగరాజ్ సినిమాల ప్రభావం ఈ సినిమాల పైన ఉందనేది కాదనలేని నిజం. అయితే ఇతర దర్శకులతో లేదా సినిమాలతో ప్రభావితం కావడంలో తప్పు లేదు, కానీ ఆ ప్రభావాన్ని సరైన విధంగా తమ కథ, కథనాల్లో ఇమిడిపోయేలా చేయడంలో తెలుగు దర్శకులు విఫలమవుతున్నారు. కేవలం యాక్షన్ మీదనే ఎక్కువగా ఫోకస్ పెడితే మంచి ఫలితాలు రావు. శైలేష్ కొలను ‘సైంధవ్’, కార్తీక్ ఘట్టమనేని ‘ఈగల్’ రెండింటిలోనూ యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా ఉన్నప్పటికీ అవి లోకేష్ కనగరాజ్ తీసిన సినిమాల స్థాయిలో లేవు. ఈగల్ ఒక రకంగా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్నే పొందినప్పటికీ… కొన్ని సన్నివేశాల పై సరైన శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది అని విమర్శకులు అభిప్రాయ పడ్డారు.

అయితే సినిమాల్లో ఎప్పుడూ ఒక ట్రెండ్ అనేది అందరి దర్శకులు ఫాలో అవడం సహజం. బాహుబలి తరువాత అందరూ ఫాంటసీ కాన్సెప్ట్ సినిమాల వెంట పడితే కేజీఎఫ్, పుష్ప, వంటి సినిమాల సక్సెస్ తరువాత సీక్వెల్ ల ట్రెండ్ మొదలైంది. అలాగే లోకేష్ కనగరాజ్ విక్రమ్ తో యాక్షన్ ఎపిసోడ్స్, మల్టీ వర్స్ ట్రెండ్ మొదలైంది. నిజానికి శైలేష్ కొలను కూడా సైందవ్ సినిమాతో ఒక కొత్త యూనివర్స్ మొదలు పెడతానని చెప్పారు. అయితే సైంధవ్ పార్ట్ 2 గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. రవితేజ ఈగల్ సినిమాకు కూడా సీక్వెల్ ఉంటుందని సినిమా చివర్లో కార్తీక్ ఘట్టమనేని హింట్ ఇచ్చారు. ఇక పై వచ్చే సినిమాల్లో అయినా లోకేష్ స్టైల్ కాకుండా తెలుగు దర్శకులు తమదైన శైలిలో సినిమాలు తీస్తారని ఆశిద్దాం.

Show comments