iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలోని చిన్నారిని గుర్తు పట్టారా..? టాలీవుడ్‌లో వెరీ టాలెంటెడ్ నటి

  • Published Sep 02, 2024 | 7:10 PM Updated Updated Sep 02, 2024 | 7:10 PM

ఈ ఫోటోలోని చిన్నారిని గుర్తు పట్టారా..? టాలీవుడ్‌లో వెరీ టాలెంటెడ్ నటి. కేవలం తెలుగు మాత్రమే కాదు.. దక్షిణాది ఇండస్ట్రీలన్నింటిలోనూ వర్క్ చేసింది.

ఈ ఫోటోలోని చిన్నారిని గుర్తు పట్టారా..? టాలీవుడ్‌లో వెరీ టాలెంటెడ్ నటి. కేవలం తెలుగు మాత్రమే కాదు.. దక్షిణాది ఇండస్ట్రీలన్నింటిలోనూ వర్క్ చేసింది.

  • Published Sep 02, 2024 | 7:10 PMUpdated Sep 02, 2024 | 7:10 PM
ఈ ఫోటోలోని చిన్నారిని గుర్తు పట్టారా..?  టాలీవుడ్‌లో వెరీ టాలెంటెడ్ నటి

వెండితెరపై ఎంతో మంది నటీమణులు అలరిస్తూనే ఉన్నారు. వారిలో ఈ చిన్నది కూడా. ఈ ఫోటోలో క్యూట్ లుక్స్‌లో మెస్మరైజ్ చేస్తున్న ఈ పాప.. ఇప్పుడు టాలీవుడ్డే కాదు దక్షిణాదిలో బిజీయెస్ట్ హీరోయిన్. మాటలు రాకపోయినా.. తెరపై ఎంతో అందంగా నటిస్తూ మెస్మరైజ్ చేస్తుంది. ఇంతకు ఆమె ఎవరంటే.. అభినయ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లో చెట్టు చిత్రంలో వెంకటేశ్, మహేష్ బాబుకు సోదరిగా మెప్పించింది. అయితే ఆమె చెప్పేంత వరకు తెలియదు.. ఆమె విభిన్న ప్రతిభావంతురాలని. అంతలా తన నటనతో కట్టిపడేస్తుంది ఈ బ్యూటీ. తమిళనాడుకు చెందిన అభినయ పుట్టుకతోనే బధిర. అంటే ఆమె మాట్లాడలేదు. వినపడదు కూడా. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో రవితేజ హీరోగా వచ్చిన నేనింతే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అభినయ.

నేనింతే మొదలైన ఆమె సినీ ప్రయాణం.. సక్సెస్ ఫుల్‌గా దూసుకెళుతుంది. నాగార్జున కింగ్ మూవీలో యాక్ట్ చేసిన ఆమె.. శంభో శివ శంభోలో కీ రోల్ చేసింది. బెస్ట్ సపోర్టింగ్ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకుంది. అటు తమిళంలోనూ అడుగుపెట్టి వరుస ఛాన్సులు కొల్లగొట్టింది. తన పేరులోనే అభినయాన్ని పెట్టుకున్న ఆమె.. సైన్ లాంగ్వేజ్ తోనే ఆమె తన భావాలను వ్యక్తపర్చగలదు. తెలుగులో దమ్ము తర్వాత గుర్తింపునిచ్చిన పాత్ర ఢమరుకం. ఇందులో నాగ్ సోదరి పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళమే కాదు మలయాళం, కన్నడ పరిశ్రమల్లోనూ వర్క్ చేసింది.

తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ధ్రువ, రాజు గారి గది 2, సీతా రామం, గామి, ఫ్యామిలీ స్టార్స్ వంటి చిత్రాల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. కొన్ని చిత్రాల్లో మెయిన్ రోల్స్ చేసి మెప్పించింది. అలాగే మాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ మలయాళ ప్రాజెక్టు ఉంది. కాగా, ఇటీవల ఆమె ఇంట్లో విషాదం నెలకొంది. తనకు ఎంతో అండగా నిలిచిన ఆమె తల్లి  మరణించింది. ఆటోలో వెళుతుండగా ఊహించని విధంగా ఆమె కన్నుమూసిందని, ఆమె లేదన్న  విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని నటి అభినయ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా తన తల్లితో తనకున్న మధుర జ్ఞాపకాలను తల్చుకుని ఎమోషనలైందీ అందాల తార. మాటలు రాకపోతేనేం.. ప్రతిభకు అంగ వైకల్యం అడ్డం కాదని నిరూపించింది. టాలీవుడ్‌లో వెరీ టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది  అభినయ.

 

View this post on Instagram

 

A post shared by M.g Abhinaya (@abhinaya_official)

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet giriş