iDreamPost
android-app
ios-app

రోజాతో ఉన్న ఈ అమ్మాయి.. వడ్డే నవీన్‌కు ఏమౌతుందో తెలుసా..?

  • Published Aug 23, 2024 | 1:30 PM Updated Updated Aug 23, 2024 | 1:30 PM

Vadde Naveen: ఈ ఫోటోలో ఎల్లో డ్రెస్సులో, ముత్యాల ఆభరణాలు ధరించి.. చిరునవ్వులు చిందిస్తున్న ఈ యువతి ఎవరో తెలుసా..? ఒకప్పటి స్టార్ నటుడు వడ్డే నవీన్‌కు ఏమౌతుందో తెలుసా..?

Vadde Naveen: ఈ ఫోటోలో ఎల్లో డ్రెస్సులో, ముత్యాల ఆభరణాలు ధరించి.. చిరునవ్వులు చిందిస్తున్న ఈ యువతి ఎవరో తెలుసా..? ఒకప్పటి స్టార్ నటుడు వడ్డే నవీన్‌కు ఏమౌతుందో తెలుసా..?

  • Published Aug 23, 2024 | 1:30 PMUpdated Aug 23, 2024 | 1:30 PM
రోజాతో ఉన్న ఈ అమ్మాయి.. వడ్డే నవీన్‌కు ఏమౌతుందో తెలుసా..?

ఈ ఫోటోలో నటి రోజా పక్కన నుంచొని చిరునవ్వులు చిందిస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఎల్లో డ్రెస్‌లో, ముత్యాల ఆభరణాల్లో హీరోయిన్‌ను తలపిస్తున్న ఈ యువతి.. ఒకప్పటి స్టార్ నటుడు వడ్డే నవీన్‌కు ఏమౌతుందో ఎరికేనా..? ఆమె ఈ స్టార్ హీరోకు స్వయానా డాటర్. కొన్ని సంవత్సరాల క్రితం వడ్డే నవీన్ కొడుకు జిష్ణు థోతీ వేడుక నిర్వహించగా.. టాలీవుడ్ ప్రముఖలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  ఆ వేడుకకు చిరంజీవి, సునీల్, రోజా వెళ్లారు. రోజా వడ్డే నవీన్ ఫ్యామిలీతో ఫోటో దిగగా.. హీరో కూతురు ఆమె పక్కన నిల్చుంది. ఆ ఫోటో సోషల్ మీడియాలో షేర్ వైరల్ అయ్యింది. అప్పట్లోదే ఈ ఫోటో. వడ్డే నవీన్ పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. తన ఫ్యామిలీ, పిల్లల గురించి ఎప్పుడూ ప్రస్తావించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం సినిమాలకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న వడ్డే నవీన్..ఈ తరానికి తెలియని ఓ స్టార్ హీరో.

నిర్మాత వడ్డే రమేష్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు వడ్డే నవీన్. 1997లో ‘కోరుకున్న ప్రియుడు’తో తన సినీ కెరీర్ స్టార్ చేశాడు. ఆయనకు బ్రేక్ ఇచ్చిన చిత్రం పెళ్లి. ఇందులో ఆదర్శవంతమైన యువకుడిగా కనిపిస్తాడు. ప్రియా ఓ ప్రియా, తాంబూలాలు, చెలికాడు, పెళ్లాడి చూపిస్తా వంటి చిత్రాలు ఓకే అనిపించాయి. మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించిన చిత్రాలు స్నేహితుడు, మనసిచ్చి చూడు. ఈ రెండు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టుకున్నాయి. నవీన్ కెరీర్‌కు ప్లస్ అయ్యాయి. అతడికి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చిన చిత్రం.. నా హృదయంలో నిదురించే చెలి. ఇందులో ప్రియురాలి కోసం ఇంట్లో నుండి వచ్చేసే ప్రియుడిగా అలరించాడు. కీర్తిరెడ్డి హీరోయిన్‌గా ప్రేమించే మనసు, చాలా బాగుంది చిత్రాల్లో కాస్తంత నెగిటివ్ టచ్ ఉన్న రోల్స్‌లో కనిపించి.. హీరో ఇలాంటి క్యారెక్టర్స్ కూడా చేయొచ్చా అనేంతలా చేశాడు నవీన్.

Hero vadde naveen daughter

ఆ తర్వాత వచ్చిన సినిమాలు.. వడ్డే నవీన్ కెరీర్ డీలా పడేలా చేశాయి. బాగున్నారా..? మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది, శుభకార్యం, ధనుష్, ఎక్ ట్రా, శత్రువు, అయోధ్య చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత వడ్డే నవీన్ నుండి వచ్చిన డిఫరెంట్ చిత్రం. నా ఊపిరి. ఇందులో అమాయకుడైన వేణు పాత్రలో ఏడిపించేస్తాడు. ఇది ఓకే అనిపించినా.. ఆ తర్వాత కథల ఎంపికలో తడబడి.. సెకండ్ హీరో క్యారెక్టర్లకు షిఫ్ట్ అయ్యాడు. అలా అల్లరి నరేష్ గోడీద పిల్లి, అందమైన మనసులో, మంచు విష్ణు ఎటాక్ చిత్రాల్లో మెరిశారు. 2016 తర్వాత ఆయన సినిమాల్లో కనిపించలేదు. కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగా తానే సినిమాలకు దూరం అయ్యానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నవీన్. కాగా, ఆయన నటించాలని ఎంతో మంది కోరుకుంటున్నారు. ఇంటర్వ్యూలకు కూడా దూరంగా ఉంటున్నారు. తన తరంలో ఉన్న తోటి నటులు ఇప్పుడు విలన్ అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్లకు షిఫ్ట్ అయిపోయి బిజీగా మారుతూ సందడి చేస్తున్నారు. నవీన్ కూడా తిరిగి నటిస్తే చూడాలనుకుంటున్నారు ఆయన అభిమానులు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss