iDreamPost
android-app
ios-app

పెద్ద పుడింగులం అనుకుంటున్నారు! తిరగబడరా సామి దర్శకుడు సంచలన కామెంట్స్!

  • Published Aug 03, 2024 | 6:43 PM Updated Updated Aug 03, 2024 | 6:43 PM

Tiragabadara saami Movie Director Comments On Reviewers: రాజ్ తరుణ్- మాల్వి మల్హోత్రా కాంబోలో వచ్చిన తిరగబడరా సామి మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో మూవీ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి రివ్యూవర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Tiragabadara saami Movie Director Comments On Reviewers: రాజ్ తరుణ్- మాల్వి మల్హోత్రా కాంబోలో వచ్చిన తిరగబడరా సామి మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో మూవీ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి రివ్యూవర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Published Aug 03, 2024 | 6:43 PMUpdated Aug 03, 2024 | 6:43 PM
పెద్ద పుడింగులం అనుకుంటున్నారు! తిరగబడరా సామి దర్శకుడు సంచలన కామెంట్స్!

రాజ్ తరుణ్– మాల్వి మల్హోత్రా కాంబోలో థియేటర్లలో విడుదలైన చిత్రం తిరగబడరా సామి. ఈ మూవీ టీమ్ తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో తిరగబడరా సామి హీరోయిన్స్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ పాల్గొన్నారు. ఈ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సినిమాకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. కొన్ని షాకింగ్ కామెంట్స్ కూడా చేశాడు. మంచి సినిమాని ఎవరూ అడ్డుకోలేరు. ఏ రివ్యూవర్లు అడ్డుకోలేరు అన్నారు. పెద్ద పుడింగులు అనుకుని ఏదేదో రాసేస్తున్నారు అంటూ రివ్యూవర్లను ఉద్దేసించి.. డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

డైరెక్టర్ మాట్లాడుతూ.. “హ్యాట్సాఫ్ టు తెలుగు ఆడియన్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఎందుకంటే మొదటి రోజు కంటే రెండో రోజు 25 థియేటర్లు పెరిగాయి. కలెక్షన్స్ కూడా పెరిగాయి. మంచి సినిమాని ఎవడూ అడ్డుకోలేడు. ఏ రివ్యూ కూడా అడ్డుకోలేదు. ఒక సినిమా బతికితే ఎంతో మంది రివ్యూలు రాసేవాళ్లు.. వాళ్ల పిల్లలకు బట్టలు కొనగలరు. వాళ్ల భార్యకి అన్నం పెట్టగలరు. ఒక సినిమా గురించి బ్యాడ్ గా రాసి ఆ సినిమా చస్తే అందరూ ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. దయచేసి తప్పుగా అనుకోవద్దు. 33 సంవత్సరాల నుంచి ఉంటున్నా. కొత్త కొత్తగా వచ్చారు.. పెద్ద పుడింగులు అనుకోవద్దు. కొత్తగా వచ్చి ఏదో రాసేస్తాం అని. సీనియర్స్ ఉన్నారు.. వాళ్ల సజీషన్స్ తీసుకోండి. కాస్త ఆలోచించండి.. సినిమా బతికితే మనం బతుకుతాం. మీ జీతాలు మీకు రావాలి.. మీ డ్యూటీ మీరు చేయచ్చు. రివ్యూస్ రాస్తున్నామని చెప్పి సినిమాని కిల్ చేస్తే.. మనమే ఉరేసుకున్నట్లు లెక్క” అంటూ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం డైరెక్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

శుక్రవారం ఒక్కరోజే మొత్తం 8 సినిమాలు విడుదల అయ్యాయి. వాటిలో ముఖ్యంగా అశ్విన్ బాబు శివమ్ భజే చిత్రానికి ఉన్నంతలో మంచి టాక్ లభించింది. ఆ తర్వాత తిరగబడరా సామి చిత్రానికి బజ్ ఏర్పడింది. రాజ్ తరుణ్- మాల్వి మల్హోత్రా పేర్లు లావణ్య వివాదంతో వైరల్ కావడంతో తిరగబడరా సామి మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు థియేటర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. వీకెండ్ కలెక్షన్స్ మీద తిరగబడరా సామి మూవీ ఫలితం అయితే ఆధారపడి ఉంటుంది. తిరగబడరా సామి మూవీ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş